పూరీ జ‌గన్నాథ్ 'రోగ్' ట్రైల‌ర్ టాక్


అస‌లు సినిమా ఎప్పుడు మొద‌లు పెడ‌తాడో, ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలీకుండా, సినిమాను ప‌ట్టాలెక్కించాలంటే పూరీ త‌ర్వాతే ఎవ‌రైనా. ఇజం త‌ర్వాత పూరీ ఒక కొత్త హీరోతో చేస్తున్న చిత్ర‌మే రోగ్. మ‌రో చంటిగాడి ప్రేమక‌థ అనేది ట్యాగ్ లైన్.ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్ విడుద‌ల అయింది.


మామూలుగానే పూరీ జ‌గ‌న్నాథ్ సినిమాలంటే హీరోకి డిఫ‌రెంట్ యాటిట్యూడ్ ఉంటుంది. అలాగే ఈ సినిమా లో కూడా హీరోకి ఒక వింత యాటిట్యూడ్. ప‌ది రూపాయిలు ఇస్తే ఏమైనా చేస్తా, నా వెన‌క్కి వ‌చ్చి దాక్కుంటే వారిని కాపాడేస్తా అనేది అత‌ని క్యారెక్ట‌ర్. ఇప్ప‌టి వ‌ర‌కు పూరీ డైర‌క్ష‌న్లో వ‌చ్చిన హీరోలంద‌రికీ ఇలాంటి వింత యాటిట్యూడే ఉంది. ఇడియ‌ట్ లో ర‌వితేజ అయినా, దేశ‌ముదురు లో బ‌న్నీ అయినా, ఏక్ నిరంజ‌న్ లో ప్ర‌భాస్ అయినా అంద‌రిదీ సేమ్ క్యారెక్ట‌రైజేష‌న్. ఆ సినిమాల‌కు, ఈ సినిమాకు ఉన్న తేడా ఏంటయా అంటే ఈ హీరో కొత్త వాడు. వాళ్లు ఆల్రెడీ ఇండ‌స్ట్రీ లో సెటిల్ అయిపోయిన వాళ్లు.  అంతే తేడా. 


ఇక‌పోతే హీరోయిన్స్ మ‌న్నారా చోప్రా, ఏంజెలా క్రిసిలింజి లు సినిమాకు గ్లామ‌ర్ ఎట్రాక్ష‌న్. ఇదంతా ట్రైల‌ర్ లోనే చూపించడంతో, ఇది ఖ‌చ్చితంగా పూరీ మార్క్ రొమాంటిక్ మూవీ అనుకోవాల్సిందే. మ‌రి ఇజంతో ఫ్లాప్ అందుకున్న పూరీ ఈ సినిమాతో అయినా, హిట్టు కొడ‌తాడేమో చూడాలి.