'కేశ‌వ' టీజ‌ర్ టాక్


ఈమ‌ధ్య కొంత మంది హీరోల నుంచి సినిమాలు వ‌స్తున్నాయంటే జ‌నాల్లో మామూలు ఆస‌క్తి క‌ల‌గ‌డం లేదు. వారిలో హీరో నిఖిల్ కూడా ఒక‌డు. కెరీర్ మొద‌టి నుంచే సెల‌క్టివ్ స‌బ్జెక్ట్స్ ఎంచుకుంటూ, అంద‌రినీ అల‌రిస్తున్న నిఖిల్ ఇప్పుడు త‌న‌ తాజా చిత్రం కేశ‌వ తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. మ‌రి ప్ర‌తీ చిత్రంతోనూ కొత్త కొత్త ప్ర‌యోగాలు చేస్తూ త‌న రేంజ్‌ని పెంచుకుంటున్న నిఖిల్ ఈ సినిమాలో ఏ క‌థ‌ను ఎంచుకున్నాడో చూద్దాం ప‌దండి.

ఫ‌స్ట్ లుక్, పోస్ట‌ర్స్ తోనే అంద‌రినీ ఆక‌ట్టుకున్న కేశ‌వ, ఇప్పుడు టీజ‌ర్ తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. భూతాన్నీ, య‌జ్క్షోప‌వేతాన్నీ, అంటూ గ్రాంథికంగా సాగిన ఈ టీజ‌ర్ చివ‌ర్లో స్మ‌రిస్తే ప‌ద్యం, అరిస్తే  వాద్యం అంటూ త‌న సినిమాలోని అస‌లు కంటెంట్ ని చెప్ప‌క‌నే చెప్పాడు కేశ‌వ‌. ప‌గ అనే వంట‌కాన్ని చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు వ‌డ్డిస్తేనే దాని ప్ర‌భావం మ‌రింత తీవ్రంగా ఉంటుంది అనే క్యాప్ష‌న్ ను దీనికి పెట్ట‌డం ఇలా ఒక‌టేమిటీ టీజ‌ర్ మొత్తం చాలా బాగా క‌ట్ చేశారు. 

ఎప్పుడూ తెర‌పై సైతం అల్ల‌రి చేస్తూ క‌నిపించే నిఖిల్, ఈ సినిమాలో ఆ క్యారెక్ట‌ర్ కు ఎలా స‌రిపోతాడా అనే అనుమానాలు వెల్ల‌డించిన వారంద‌రికీ నిఖిల్ ఈ టీజ‌ర్ తోనే స‌మాధానం చెప్పేశాడు. ఎక్క‌డా ఆవేశ‌ప‌డకుండా, నిల‌క‌డ‌గా న‌టించ‌డం బాగుంది. మొత్తం మీద చెప్పాలంటే నిఖిల్ ఈ రోల్ లో జీవించేశాడ‌నే చెప్పాలి.