విడుదలైన నారా రోహిత్ ' కథలో రాజా కుమారి' ట్రైలర్


హీరోయిజం జోలికి వెళ్లకుండా విభిన్న కథలతో ప్రేక్షకుల మనసులు దోచుకున్న నారా రోహిత్ త్వ‌ర‌లో కథలో రాజకుమారి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుదలైన ఈ చిత్ర పోస్ట‌ర్స్, టీజ‌ర్ ఫ్యాన్స్ లో ఎక్స్ పెక్టేష‌న్స్ పెంచాయి. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా ఇందులో ఎమోషన్, సెంటిమెంట్, కామెడీ అన్ని కోణాలు ప‌రిచ‌యం చేశారు. అద్భుతంగా ఉన్న ఈ ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలే పెంచింద‌ని చెప్ప‌వ‌చ్చు.

మహేష్ సూరపనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నారా రోహిత్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. నారా రోహిత్ గత చిత్రం ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రాన్ని నిర్మించిన కృష్ణ విజయ్.. ప్రశాంతిలతో పాటు సౌందర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగశౌర్య క్యామియో రోల్ చేస్తుండటం విశేషం. ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజాతో పాటు ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్నందిస్తున్నాడు . కోట శ్రీనివాసరావు, పరుచూరి వెంకటేశ్వర రావు, అవసరాల శ్రీనివాస్, మురళీమొహన్, అజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, హీరోయిన్ నందిత ఒక కీలక పాత్రలో కనిపించనుంది. నమిత ప్రమోద్ ఈ మూవీలో నారా రోహిత్ సరసన కథానాయికగా నటిస్తుంది. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ ను మీరు కూడా ఓసారి వీక్షించండి.