Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

కాట‌మ‌రాయ‌డు ప‌రీక్ష రాయ‌డానికి వెళ్తున్నాడు


ప‌వ‌న్ కళ్యాణ్ లేటెస్ట్  సెన్సేష‌న్ కాట‌మ‌రాయుడు ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసేసుకుని, ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ తో బిజీ గా ఉంది. ఆల్రెడీ ఫైన‌ల్ అవుట్ పుట్ ను రెండు సార్లు చూసేసిన ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.ఇదిలా ఉండ‌గా, ఈరోజు కాట‌మ‌రాయుడు సెన్సార్ కానుంది. పూర్తిస్థాయి యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కావ‌డంతో ఇప్ప‌టికే ఈ సినిమాకు యుఎ సర్టిఫికేట్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

మొత్తానికి ఇవాళ సాయంత్రానికి కాట‌మ‌రాయుడు సినిమా సెన్సార్ స‌ర్టిఫికేట్ చేతికి రావ‌డంతో, రిలీజ్ ఏర్పాట్లను వేగ‌వంతం చేయ‌నున్నారు. మార్చి 24న సినిమా రిలీజ్ కానుండ‌టంతో, 23వ తేదీనే సినిమాకు ప్రీమియ‌ర్ షో ల‌ను వేయ‌నున్నారు.  విదేశాల్లో ఇప్ప‌టివ‌ర‌కూ ఏ తెలుగు సినిమాకు లేన‌న్ని ప్రీమియ‌ర్స్ ను కాట‌మ‌రాయుడు కు ప్లాన్ చేశార‌ని స‌మాచారం. అస‌లు ప్రీమియ‌ర్స్ తోనే మిలియ‌న్ డాల‌ర్ల‌ను సాధించే దిశ‌గా కాట‌మ‌రాయుడు ప్లాన్ చేస్తున్నాడు.

ఇటు తెలుగు  రాష్ట్రాల్లోనూ కాట‌మ‌రాయుడు రిలీజ్ కు భారీ స‌న్నాహాలు జరుగుతున్నాయి. గత కొన్ని వారాలుగా డ‌ల్ గా న‌డుస్తున్న బాక్సాఫీస్ ను కాట‌మ‌రాయుడు క‌ళ‌క‌ళ‌లాడించ‌నుంది.