అంద‌రికీ చేరువ‌వుతున్న “ఒక మ‌న‌సు”


అంద‌రికీ చేరువ‌వుతున్న "ఒక మ‌న‌సు" మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు గారాల కూతురు, మెగా ప్రిన్సెస్ నిహారిక ఒక ఎంట‌ర్ టైన్ మెంట్ ఛానల్ నిర్వ‌హిస్తున్నడ్యాన్స్ ప్రోగ్రామ్ కి హోస్ట్ గా బాధ్య‌త‌లు చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. త‌క్కువ టైమ్ లోనే యాంక‌ర్ గా మంచి పేరు తెచ్చుకున్న నిహారిక.. ముద్దపప్పు ఆవ‌కాయ అంటూ వెబ్ సిరీస్ తో వ‌చ్చి ఆక‌ట్టుకుంది. ఇప్పుడు మ‌ళ్లీ ఒక మ‌న‌సుతో అంద‌రి హృద‌యాల‌ను దోచుకోడానికి వ‌స్తుంది ఈ అల్ల‌రిపిల్ల‌. నాగ‌శౌర్య‌, నిహారిక జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఆడియో విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈనెల 18న మెగా హీరోల స‌మ‌క్షంలో రామ్ చ‌రణ్ చేతుల మీదుగా ఆడియో మార్కెట్ లోకి విడుద‌ల కానుంది. అయితే దీనికి సంబంధించిన ఆడియో టీజ‌ర్ ను ఒక మ‌న‌సు మూవీ టీమ్ రిలీజ్ చేశారు. టీజ‌ర్ లో సునీల్ క‌శ్య‌ప్ మ్యూజిక్, ఆ లొకేష‌న్ల‌ను చిత్రీక‌రించిన విధానం, నాగ‌శౌర్య లుక్స్ సింప్లీ సూప‌ర్బ్. ఇక నిహారిక గురించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఎంత మెగా ఫ్యామిలీ నుంచి వ‌స్తే మాత్రం అంద‌రికీ యాక్టింగ్ వ‌స్తుందా అనే కొంద‌రి ప్ర‌శ్న‌ల‌కు ఆల్రెడీ ముద్ద‌ప‌ప్పు ఆవ‌కాయ వెబ్ సిరీస్ తోనే స‌మాధాన‌మిచ్చిన నిహా.. ఈ టీజ‌ర్ లోనూ త‌న న‌ట‌న‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. టీజ‌ర్ తోనే అంద‌రి నుండి ప్ర‌శంస‌లు అందుకుంటున్ననిహారిక ట్రైల‌ర్ లో ఎంత హ‌డావుడి చేస్తుందో మ‌రి.