'యమన్' మూవీ రివ్యూ


బిచ్చగాడు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో సంచలనాలు సృష్టించిన విజయ్‌ ఆంటోని హీరోగా డైరెక్టర్‌ జీవ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యమన్ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. పొలిటికల్‌ థ్రిల్లర్‌ అయిన ఈ సినిమా విడుదలకు ముందు నుండి బిచ్చగాడు ఎఫెక్ట్‌తో చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి యమన్‌తో విజయ్‌ ఆంటోని ఎలాంటి సక్సెస్‌ను అందుకున్నాడు? బిచ్చగాడు రేంజ్‌ సక్సెస్‌ను మళ్ళీ తన ఖాతాలో వేసుకున్నాడా లేదా అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


కధ : ముందుగా ఈ సినిమా కధ విషయానికి వస్తే . దేవర కొండ గాందీ(విజయ్‌ ఆంటోని) ముందు నుండి రాజకీయాల్లో చురుకుగా ఉండి కౌన్సిలర్‌గా ఎదుగుతాడు. కులాంతర వివాహం చేసుకుంటాడు. వారికి పుట్టిన బిడ్డ అశోక చక్రవర్తి(విజయ్‌ ఆంటోని). పాండు రంగారావు కారణంగా అశోక్‌ తండ్రి, మావయ్యలు గొడవ పడి చనిపోతారు. అశోక్‌ తాతయ్య దగ్గరే పెరిగి పెద్దవాడవుతాడు. ఇక సాంబ, నరసింహ ప్రాణ స్నేహితులు. రాజకీయ కారణాలతో వారిద్దరూ విడిపోతారు. బద్ధ శత్రువులుగా మారి ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నిస్తారు. ఓ సందర్భంలో సాంబ అనుకోకుండా ఓ ప్రమాదానికి గురై గాయాలపాలవుతాడు. ఆ ప్రమాదానికి తానే కారణం అంటూ అశోక చక్రవర్తి(విజయ్‌ ఆంటోని) ఆరెస్ట్‌ అయ్యి సాంబ దృష్టిలో పడతాడు. సాంబ అశోక చక్రవర్తిని చంపడానికి ప్రయత్నిస్తాడు. దానితో నరసింహ అశోక్‌ను జైలు నుండి విడిపిస్తాడు. జైలు నుండి వచ్చిన తర్వాత అశోక్‌ తన తెలివి తేటలతో చాలా ఎత్తుకు ఎదుగుతాడు. ఇంతకు పాండు రంగారావు ఎవరో అశోక్‌కు తెలిసిందా? అశోక్‌ తనకు జరిగిన అన్యాయానికి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నదే మిగిలిన కధ.

నటీ నటుల పనితీరు : ముందు నుండి వేరియేషన్స్ ఉండే కదలని సెలక్ట్ చేసుకుంటూ ప్రెకషకులను మెప్పించిన విజయ్‌ ఆంటోని ఈ చిత్రంలో కూడా డబుల్‌ రోల్‌లో తనదైన నటనతో మెప్పించాడు. ఇక మియా జార్జ్‌ తన పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. పొలిటికల్‌ డైలాగ్స్‌ మెప్పించాయి. మిగిలిన పాత్రలు అన్ని కధలో పరిధిమేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు : టెక్నీకల్ గా డైరెక్టర్‌ జీవ శంకర్‌ ని ముందుగా మెచ్చుకొని తీరాల్సిందే . ఇక దర్శకుడు కథను తయారు చేసుకున్న తీరు, దాన్ని తెరకెక్కించిన తీరు అద్భుతం అనే చెప్పుకోవాలి . దర్శకత్వంలో పాటు జీవ శంకర్‌ సినిమాటోగఫ్రీ హ్యాండిల్‌ చేయడంతో అవుట్‌పుట్‌ చూడటానికి చక్కగా అనిపిస్తుంది. రాజకీయాల్లో మిత్రలు శత్రువులుగా, శత్రువు మిత్రులుగా మారిపోతారనడాన్ని చక్కగా ప్రెజెంట్‌చేశారు. అయితే సీరియస్‌గా సాగే ఈ సినిమాలో మధ్యలో వచ్చే పాటలు ఆడియెన్స్‌ను అలరించవు. విజయ్‌ ఆంటోని హీరోగానే కాకుండా మ్యూజిక్‌ బాధ్యతలు చేపట్టడం ఓ రకంగా ప్లస్‌ అని చెప్పవచ్చు సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బావుంది. విజయ్‌ ఆంటోని వేసిన డ్యాన్సులు ఈ సినిమాకి పెద్ద మైనస్ .

పాజిటీవ్ పాయింట్స్

మంచి కధ

దర్శకుడి పనితీరు

అద్భుతమైన స్క్రీన్ ప్లే

డైలాగ్స్


నెగిటీవ్ పాయింట్స్ :

అక్కడ అక్కడ నేటివిటీ మిస్ అవడం

మ్యూజిక్

విజయ్ ఆంటోని డ్యాన్స్ లు


పంచ్ లైన్ : ఒక్కసారి మన తెలుగు సినిమా రచయతలు అందరిని మూకుమ్మడిగా విజయ్ ఆంటోని దగ్గర నెలరోజులు వదిలేస్తే.. వారు కూడా ఇలాంటి మంచి కధలు అందిస్తారు ఏమో అనిపిస్తుంది!

రేటింగ్ : 3/5