Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

'స‌ప్త‌గిరి ఎల్ఎల్‌బి' మూవీ రివ్యూ


క‌మెడియ‌న్ గా త‌న‌కంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న స‌ప్త‌గిరి, స‌ప్తగిరి ఎక్స్‌ప్రెస్ అనే సినిమాతో హీరోగా మారిన విష‌య‌మే. ఇప్పుడు మ‌రోసారి జాలీ ఎల్ఎల్‌బి అనే సినిమాను తెలుగు స‌ప్త‌గిరి ఎల్ఎల్‌బి అనే పేరుతో రీమేక్ చేసి ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు స‌ప్త‌గిరి. ఈ సినిమాతో కూడా నిరూపించుకుంటే స‌ప్త‌గిరి హీరోగా స‌క్సెస్ అయిన‌ట్లే. మ‌రి క‌మెడియ‌న్ గా మంచి పేరు తెచ్చుకున్న స‌ప్త‌గిరి హీరోగా ఆ రేంజ్ లో స‌క్సెస్ అయ్యాడా లేదా మ‌న స‌మీక్షలో చూద్దాం.


క‌థః

అప్పుడే ఎల్ఎల్‌బి పూర్తి చేసుకున్న స‌ప్త‌గిరి, త‌న‌ను తాను మంచి లాయ‌ర్ గా నిరూపించుకునే నేప‌థ్యంలో, హైద‌రాబాద్ కు వ‌స్తాడు. హైదరాబాద్ లో బాగా పేరు మోసిన లాయ‌ర్ రాజ్‌పాల్(సాయి కుమార్) తో ఒక కేసు విష‌యంలో స‌ప్త‌గిరికి వైరం పెరుగుతుంది. అస‌లు ఆ కేసుకు, స‌ప్త‌గిరికి సంబంధం ఏంటి?  రాజ్‌పాల్ ఆట‌ల‌ను స‌ప్త‌గిరి ఎలా ఎదుర్కొని విజ‌యం సాధించాడన్న‌దే అస‌లు క‌థ‌.


న‌టీన‌ట‌లు ప్ర‌తిభః 

హీరోగా స‌ప్త‌గిరి మంచి నట‌న క‌న‌బ‌రిచాడు. త‌న కామెడీ టైమింగ్ తో అల‌రించాడు. హీరోయిన్ పాత్ర‌కు న‌టించ‌డానికి పెద్ద‌గా స్కోప్ లేదు. సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సాయి కుమార్ గురించి. బాగా పాపుల‌ర్ అయిన లాయ‌ర్ హోదాలో త‌ను చాలా బాగా ఇమిడిపోయాడు. త‌న హుందాత‌నం, పొగ‌రు, క‌న్నింగ్ లుక్స్ తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాడు. జ‌డ్జిగా శివ ప్ర‌సాద్ న‌ట‌న బాగుంది. సెకండాఫ్ లో సాయి కుమార్ కు, రాజ్‌పాల్ కు మ‌ధ్య వ‌చ్చే సీన్స్ చాలా బాగున్నాయి. ఇక మిగిలిన వారిలో ప్ర‌భాస్ శీను, ష‌క‌ల‌క శంక‌ర్, ఎల్‌బి శ్రీరామ్, త‌దిత‌రులు ఎవ‌రి పాత్రల ప‌రిధిలో వారు బాగా చేశారు. 


సాంకేతిక నిపుణులుః 

ద‌ర్శ‌కుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. ఫ‌స్టాఫ్ అంతా ఒక కేసును రీ ఓపెన్ చేయించి, అస‌లేం జ‌రిగింద‌న్న విష‌యాన్ని ఇంట‌ర్వెల్ వ‌ర‌కు ఆస‌క్తిగా తీసుకొచ్చిన ద‌ర్శ‌కుడు, ఇంట‌ర్వెల్ కు ముందు హీరో రియ‌లైజేష‌న్ అయ్యే సీన్ చాలా బావుంది. సెకండాఫ్ లో ఆ కేసులో ఎలాగైనా న్యాయాన్ని గెలిపించాల‌ని హీరో క్యారెక్ట‌ర్ ప‌డే త‌ప‌న చాలా ఎమోష‌న‌ల్ గా తెర‌కెక్కించాడు. ఇక క్లైమాక్స్ సినిమాకు ప్రాణం అనే చెప్పాలి. క్లైమాక్స్ లో మంచి డైలాగులు కూడా ప‌డ‌టంతో సినిమా స్థాయి పెరిగింది. పోతే సారంగం సినిమాటోగ్ర‌ఫీ బావుంది. బుల్గానిన్ అందించిన సంగీతంలో పాటలు ఆక‌ట్టుకోన‌ప్ప‌టికీ, నేప‌థ్య సంగీతం సినిమాకు త‌గ్గ‌ట్లుంది. గౌతం రాజు ఎడిటింగ్ ఫ‌ర్వాలేదు. నిర్మాణ విలువ‌లు చాలా బావున్నాయి. 


ప్ల‌స్ పాయింట్స్ః 

సాయి కుమార్ న‌ట‌న‌

సాయికుమార్- శివ ప్ర‌సాద్ ల మ‌ధ్య వ‌చ్చే సీన్స్

క్లైమాక్స్


మైన‌స్ పాయింట్స్ః 

హీరోయిన్ 

అన‌వ‌స‌రంగా వ‌చ్చే పాట‌లు


పంచ్‌లైన్ః స‌ప్త‌గిరి LLB పాస‌య్యాడు 

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3.25/5