'పైసా వ‌సూల్' మూవీ రివ్యూ


సినిమా అనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర నుంచేక్రేజీ కాంబినేష‌న్.. క్రేజీ కాంబినేష‌న్ అంటూ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. త‌ర్వాత సినిమాకు 'పైసా వ‌సూల్' అని టైటిల్ పెట్టి, బాల‌య్య ను మునుపెన్న‌డూ చూపించని విధంగా చూపించి బ‌జ్ క్రియేట్ చేశాడు ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌. ఇలా పైసా వ‌సూల్ కు సంబంధించిన ప్ర‌తీ విష‌యం న్యూస్ గానే మారి, సినిమాకు మంచి హైప్ తెచ్చిపెట్టింది. మ‌రి ఇంత హైప్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ''పైసా వ‌సూల్'' చేస్తుందా లేదా చూద్దాం.

క‌థః
 ఫస్టాఫ్ అంతా పాత్రల పరిచయం, మూడు పాటలు, తేడా సింగ్ డైలాగులు, పంచ్‌లతో గడిపేశారు. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో అసలు కథలోకి అడుగుపెట్టాడు దర్శకుడు. ఇంటర్వెల్ తరవాత తేడా సింగ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో శ్రియ ఎంట్రీ ఇచ్చింది. శ్రియాకి డాన్ బాబ్ మార్లే నుంచి ప్రమాదం వచ్చి పడుతుంది. తేడా సింగ్ ఆమెను కాపాడటానికి ప్రయత్నిస్తాడు. చివరిగా ట్విస్ట్ ఏంటంటే తేడా సింగ్ అసలు పేరు బాల. అతనో రా ఏజెంట్. డాన్‌ని చంపడానికి వస్తాడు. సింపుల్ గా చెప్పాలంటే ఇదీ పైసా వ‌సూల్ క‌థ‌.

న‌టీన‌టుల ప్ర‌తిభః 
మొద‌ట చెప్పుకోవాల్సింది బాల‌కృష్ణ గురించే. త‌న ఎన‌ర్జీ లెవ‌ల్స్ కు కుర్ర హీరోలు సైతం వాట్ ఏ ఎన‌ర్జీ అన‌క మాన‌రు. ప్ర‌తీ సీన్ లోనూ త‌న యాక్టింగ్, ఎన‌ర్జీ, కామెడీ టైమింగ్ అన్నింటిలోనూ బాల‌కృష్ణ ది బెస్ట్ అనిపించుకున్నాడు. అంతేకాదు పాట‌ల్లో త‌న డ్యాన్స్ చూస్తే బాల‌య్య‌కు ఏడాదికి ఏడాదికి అస‌లు వ‌య‌సు పెరుగుతుందా అన్న అనుమానం రాకుండా ఉండ‌దు. ఒక విధంగా చెప్పాలంటే సినిమా మొత్తాన్ని బాల‌కృష్ణ త‌న భుజాల‌పై వేసుకుని న‌డిపించాడ‌నే చెప్పుకోవాలి. ఇక హీరోయిన్స్ పాట‌ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు త‌ప్ప పెద్ద‌గా వారి గురించి చెప్పాల్సిందేమీ లేదు. పూరీ జ‌గ‌న్ సినిమాలంటే అలీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కానీ గ‌త రెండు మూడు సినిమాలుగా అలీ ట్రాక్ ఏదీ స‌రిగా పేలడం లేదు. అందుకేనేమో ముందుగానే చెప్పారు ఈ సినిమాలో అలీ క్యారెక్ట‌ర్ చేసే కామెడీకి పొట్ట చెక్క‌ల‌య్యేలా న‌వ్వుతార‌ని. కానీ తీరా సినిమా చూశాక మాత్రం అలీ ఏదో క్యామియో చేసిన‌ట్లు అనిపిస్తుంది త‌ప్ప కామెడీ మాత్రం ఎక్క‌డా ఉండ‌దు. సినిమాలో బాల‌కృష్ణ తప్ప మ‌రే ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఆశించినా నిరాశ ప‌డ‌టం మాత్రం త‌ప్ప‌దు. సినిమాలో ముఖ్యంగా మ‌నం చెప్పుకోవాల్సిన క్యారెక్ట‌ర్స్ అంటే వీళ్లే. మిగిలిన వారిలో ఎవ‌రికి వారు త‌మ పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టు బాగానే చేశారు. 

ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభః 
అస‌లు ఎవ్వ‌రూ ఊహించని విధంగా బాల‌కృష్ణ తో మేకోవ‌ర్ చేయించిన పూరీ, సినిమాలో హీరో ఒక్క‌డిని కొత్త గా చూపించి, మ‌నం ఆల్రెడీ తీసిన క‌థ‌ల్లో ఏదో ఒక దానితో సినిమాను లాగించేస్తే స‌రిపోతుందిలే అనుకున్నాడో ఏమో తెలీదు కానీ, తేడా సింగ్ గా బాల‌కృష్ణ ను ప్రెజెంట్ చేసిన విధానం, సినిమాకు రాసుకున్న డైలాగ్స్ త‌ప్పించి ఎక్కడా క‌నెక్ట్ అయ్యే సీన్ కానీ, అబ్బా ఈ సీన్ భ‌లేగుందే అనుకునే సీన్ కానీ లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. సినిమా చివ‌రకు వ‌చ్చినా కూడా సినిమాలో ఇంకా ఏదో ఉంటే బాగుండని ఆశిస్తాం. హీరోను త‌నదైన స్టైల్ లో చూపించ‌డం, హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ను బాగా మ‌లిచడంలో స‌క్సెస్ అయిన పూరీ క‌థ విష‌యంలో మ‌రోసారి త‌డ‌బ‌డ్డాడు. ఇంట‌ర్వెల్ వ‌ర‌కు సినిమా అస‌లు  క‌థ‌లోకి వెళ్ల‌లేదంటేనే సినిమా ఎలా ఉంది అనేది అర్థం చేసుకోవ‌చ్చు. కానీ సినిమా కోసం పూరీ రాసుకున్న డైలాగులు థియేట‌ర్లో విజిల్స్ వేయిస్తాయి.  న‌న్ను న‌మ్ముకో.. ఉన్నదంతా పెట్టుకో.. పైసా వ‌సూల్, డిపార్ట్‌మెంట్ ని ఏమైనా అనుకోండి కానీ న‌న్ను మాత్రం త‌క్కువ చేయ‌కండి. ఇగో కోసం అయినా వెళ్లి చంపేస్తా, ఫాలోయింగ్ ఉన్నోడిని, ఫాలో అయ్యే ర‌కం కాదు, ప‌ది మందికి పెట్టినా మ‌న‌మే.. న‌లుగురిని కొట్టినా మ‌న‌మే.., తేడా సింగ్ ని నువ్వు క‌లిశాక ఇంకా బ్ర‌తికే ఉంటే ఫోన్ చెయ్.. చార్మినార్ తీసేసి నీ స్టాచ్యూ పెట్టిస్తా.., రేయ్ నా గుండెల్లో కాల్చే హ‌క్కు ఇద్ద‌రికే ఉంది. ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ.. ఔట‌ర్స్ నాట్ అలౌడ్,క‌ర్రో క‌త్తో తెచ్చుకో బే.. ఖాళీ చేత్తో కామ్ న‌హీ చ‌ల్తా, నేనంతే క‌సి తీర‌క‌పోతే శ‌వాన్ని లేపి మ‌ళ్లీ చంపుతా.. లాంటి డైలాగులు చాలా బాగున్నాయి.

సాంకేతిక విభాగంః
చాలా త‌క్కువ టైమ్ లోనే బాల‌య్య లాంటి పెద్ద హీరోతో సినిమా అంటే మాట‌లు కాదు. దానికితోడు చెప్పిన తేదీకి దాదాపు నెల రోజుల ముందు సినిమాను థియేట‌ర్ల‌లోకి తీసుకురావ‌డం అంటే ఆషామాషీ విష‌యం కాదు. ఈ నేప‌థ్యంలోనే పైసా వ‌సూల్ క్వాలిటీ గురించి అంద‌రూ టెన్ష‌న్ ప‌డ్డారు. కానీ సినిమా క్వాలిటీ మాత్రం బావుంది. టీమ్ అంతా క‌లిసి మంచి అవుట్ పుట్ ఇచ్చారు. సినిమాటోగ్ర‌ఫీ బావుంది. అనూప్ సంగీతంలోని పాట‌లు బావున్నాయి. బాల‌కృష్ణతో పాడించిన మామా ఏక్ పెగ్ లా పాట‌కు థియేట‌ర్ల‌లో మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. రీరికార్డింగ్ ఇంకా బావుండాల్సింది. సినిమాకు త‌గ్గ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేదు. ఎడిటింగ్ బాగానే ఉంది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి. 

ప్ల‌స్ పాయింట్స్ః 
బాల‌కృష్ణ‌
డైలాగులు

మైన‌స్ పాయింట్స్ః 
రొటీన్ స్టోరీ
హీరోయిన్లు పాట‌ల‌కే ప‌రిమిత‌మ‌వ‌డం
సెకండాఫ్

పంచ్‌లైన్ః ఓన్లీ ఫ‌ర్ ఫ్యాన్స్.. అవుట‌ర్స్ నాట్ అలౌడ్ 
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 2.5/5