Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

'ఆక్సిజ‌న్' మూవీ రివ్యూ


సినిమా రంగంలో అన్నీ అనుకున్న‌ట్లు జ‌ర‌గ‌వు. జ‌రిగినా అవి అనుక‌న్న టైమ్ కు జ‌ర‌గ‌వు. ఆక్సిజ‌న్ మూవీ ప‌రిస్థితీ అదే. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా కొన్ని కార‌ణాల వ‌ల్ల వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ ఫైన‌ల్ గా ఇవాళ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. హీరోగా అను ఇమ్మాన్యుయేల్, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుందా లేదా అన్న‌ది స‌మీక్ష‌లోచూద్దాం. 


క‌థః 

ఆర్మీలో ప‌నిచేసే సంజీవ్ (గోపీచంద్), మూడు సంవత్సరాల తరువాత సొంత ఊరికి వచ్చి తను ప్రేమించిన అమ్మాయి గీత (అను ఇమ్మానుల్)ను కలిసి తన ప్రేమను వ్యక్తపరుస్తాడు. టైగర్ బ్రాండ్ సిగరెట్ వల్ల సంజీవ్ తన తమ్ముడిని కోల్పోతాడు. అందుకు కారణమైన ఆ బ్రాండ్ యజమాని పై పగ తీర్చుకుందామని పల్లెటూరుకు వస్తాడు సంజీవ్. ఆ తరువాత సంజీవ్ కృష్ణ ప్రసాద్ గా ఎలా మారాడు ? అస‌లు శృతి (రాశీ ఖన్నా)కు, సంజీవ్ కు సంబంధం ఏంటి..? టైగర్ బ్రాండ్ యజమానిని సంజీవ్ ఏం చేసాడు ? అన్నదే క‌థ‌


న‌టీన‌టుల ప్ర‌తిభః 

ఎప్పటిలాగానే గోపీచంద్ తన యాక్షన్ తో అదరగొట్టాడు. రెండు విభిన్న క్యారెక్టర్లలో అభిమానులను అలరించాడు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ లో గోపీచంద్ అదరగొట్టాడు.  హీరోయిన్స్ విషయానికి వస్తే అను ఏమాన్యూల్ జస్ట్ గెస్ట్ రోల్ కే పరిమిత‌మ‌యిన‌ప్ప‌టికీ గ‌త సినిమాల కంటే భిన్నంగా, చాలా గ్లామ‌రస్ గా క‌నిపించింది. ఇక రాశిఖన్నా తన గ్లామర్ తో అలరించింది. కథ పరంగా చూస్తే ఈ ఇద్దరికీ పెద్దగా మార్కులేవి పడలేదు. జ‌గ‌ప‌తి బాబు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మొదట్లో పంచెక‌ట్టులో పెద్ద‌రికంగా ఉన్న వ్య‌క్తి, ఒక్క‌సారిగా విల‌న్ గా మారి అద‌ర‌గొట్టాడు. వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, ఆలీ కామెడీ పర్వాలేదు అనిపించింది. మిగిలిన వారిలో కిక్ శ్యామ్, చంద్ర‌మోహ‌న్, నాగినీడు, బ్ర‌హ్మాజీ, షాయాజీ షిండ్ ఎవ‌రి పాత్ర‌లో వారు మెప్పించారు.  


సాంకేతిక నిపుణులుః 

ప్ర‌తీ సినిమాకు ముందు వ‌చ్చే ముఖేష్ యాడ్ ను దాదాపు 3 గంట‌ల సినిమాగా మ‌లిచినందుకు ద‌ర్శ‌కుడిని మెచ్చుకుని తీరాల్సిందే. అస‌లు గోపీచంద్ క‌థ‌లో ఏం చూసి ఈ సినిమాను ఒప్పుకున్నాడో త‌న‌కే తెలియాలి. అను ఇమ్మాన్యుయేల్ తో ఒక్క ఎమోష‌న‌ల్ సీన్ త‌ప్పించి, ప్రేక్ష‌కుడు ఎక్క‌డా సినిమాకు క‌నెక్ట్ అవ్వ‌డు అంటే సినిమా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాలు, కావాల‌ని కామెడీని ఇరికించాల‌ని ప్ర‌య‌త్నించ‌డం, అది బెడిసి కొట్టి అన‌వ‌స‌ర‌మైన సీన్ల‌తో సినిమా నిడివి పెరిగి బోర్ కొట్టింది. చిన్నా అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బావుంది. సినిమాటోగ్ర‌ఫీ బావుంది.ఎడిట‌ర్ సినిమా ర‌న్ టైమ్ కాస్త త‌గ్గి ఉంటే సినిమాకు కొంచెం ప్ర‌యోజ‌నం ఉండేది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.  


ప్ల‌స్ పాయింట్స్ః 

గోపీ చంద్ న‌ట‌న‌

అనూ, రాశీ ల గ్లామ‌ర్


మైన‌స్ పాయింట్స్ః 

ద‌ర్శ‌క‌త్వం

కావాల‌ని ఇరికించిన స‌న్నివేశాలు

ర‌న్ టైమ్


పంచ్‌లైన్ః ఈ ఆక్సిజ‌న్ ఆరోగ్యానికి హానిక‌రం

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3/5