'నేను కిడ్నాప్ అయ్యాను' మూవీ రివ్యూ


 జైల‌వ‌కుశ‌, స్పైడ‌ర్, మ‌హానుభావుడు సినిమాల త‌ర్వాత వ‌రుస‌గా చిన్న చిత్రాలు విడుద‌ల‌వుతున్న నేప‌థ్యంలో నేను కిడ్నాప్ అయ్యాను అనే చిన్న చిత్రం కూడా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఎంతో గొప్ప చిత్రాన్ని నిర్మించామ‌ని చెప్తున్న నిర్మాత‌ల ఆశ‌ల‌ను ఈ చిత్రం నిల‌బెట్టిందా లేదా అన్న‌ది మ‌న స‌మీక్ష‌లో చూద్దాం


క‌థః
కొంద‌రు స్నేహితులు ఒక‌ కొత్త సాఫ్ట్ వేర్ ను రూపొందించి డెవ‌ల‌ప్ చేసి దాన్ని ఒక ఐటీ నిపుణుడైన పెద్ద వ్య‌క్తికి ఇవ్వ‌గా ఆ సాఫ్ట్ వేర్ ను అత‌ను త‌న స్వార్థం కోసం వేరే వాళ్ల‌కు పెద్ద మొత్తానికి అమ్మేస్తాడు. ఎలాగైనా త‌మను మోసం చేసిన వ్య‌క్తికి బుద్ధి చెప్పాల‌ని నిర్ణ‌యించుకుంటారు ఆ స్నేహితులంద‌రూ. ఆ వ్య‌క్తికి ఈ స్నేహితులంద‌రూ ఎలా బుద్ధి చెప్పార‌నేదే అస‌లు క‌థ‌.

న‌టీన‌టుల ప్ర‌తిభః
నటీనటులంద‌రూ కొత్త వాళ్లైనా చాలా బాగా చేశారు. సినిమాకు త‌నదైన మ్యాన‌రిజ‌మ్స్ తో త‌న బాడీ లాంగ్వేజ్ తో సినిమాకు ప్ల‌స్ అయ్యాడు. విలన్ గా కూడా పోసాని బాగా కామెడీ పండించాడు. బ్ర‌హ్మానందం త‌న‌దైన స్టైల్ లో న‌వ్వించాడు. పృథ్వీ, ర‌ఘుబాబు కామెడీ కొత్త‌గా బావుంది. సినిమా మొత్తంలో కామెడీ భారాన్ని వారే భ‌రించారు. మిగిలిన వారు త‌మ త‌మ పాత్ర‌ల్లో బాగానే న‌టించారు. 

సాంకేతిక నిపుణులుః
ముందుగా ద‌ర్శ‌కుడు అనుకున్న స్టోరీ లైన్ కు ఆయ‌న్ను ఖ‌చ్చితంగా అభినందించాల్సిందే. కాక‌పోతే ఆ స్టోరీని ఇంకా క‌న్విన్సింగ్ గా చెప్పి ఉండాల్సింది. మ‌న‌కు ఇలాంటి ఘ‌ట‌నలు చాలానే జ‌రుగుతుంటాయి. వాటిని సినిమా రూపంలో తెర‌పై బాగానే చూపించాడు.  సినిమాటోగ్ర‌ఫీ బావుంది. శ్రీకాంత్ అందించిన సంగీతంలో పాట‌లు సో సో గా ఉన్నా రీరికార్డింగ్ చాలా బావుంది. ఎడిటింగ్ సినిమాకు త‌గ్గ‌ట్టు ఉంది. చిన్న సినిమా అయిన‌ప్ప‌టికీ ఎక్క‌డా ఖ‌ర్చుకు వెనకాడ‌కుండా త‌మ నిర్మాణ సంస్థను మ‌రో స్థాయికి తీసుకెళ్లేలా సినిమాను నిర్మించారు.  

ప్ల‌స్ పాయింట్స్ః 
కొత్త స్టోరీ లైన్
న‌టీన‌టుల న‌ట‌న‌

మైన‌స్ పాయింట్స్ః 
అక్క‌డ‌క్క‌డా అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాలు
 

పంచ్‌లైన్ః ఆక‌ట్టుకునే కిడ్నాప్ క‌థ‌
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 2.75 5