Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

'నెపోలియ‌న్' మూవీ రివ్యూ


రీసెంట్ గా ఫస్ట్ పోస్ట‌ర్, టీజ‌ర్ తోనే ప్రేక్ష‌కుల్లో ఎంతో ఆస‌క్తి కలిగించిన సినిమా నెపోలియ‌న్. ఒక వ్య‌క్తి త‌న నీడ పోయిందంటూ పోలీస్ ల‌ను ఆశ్ర‌యించ‌డం అనే డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో ఆనంద్ ర‌వి ద‌ర్శ‌కుడిగా, నటుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. నారా రోహిత్ హీరోగా న‌టించిన ప్ర‌తినిధి చిత్రానికి ర‌చనా స‌హకారం అందించిన ఆనంద్ ర‌వి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన ఈ చిత్రం మ‌రోసారి ప్ర‌తినిథి స్థాయిలో ఆకట్టుకుందా లేదా మ‌న స‌మీక్ష‌లో చూద్దాం.


క‌థః 

రొటీన్ కేసులతో సి ఐ రవివర్మ ( రవివర్మ ) విసిగిపోతున్న సమయంలో ఓ మహిళని ముగ్గురు కిడ్నాప్ చేస్తారు , కట్ చేస్తే నెపోలియన్ (ఆనంద్ రవి ) రవివర్మ దగ్గరకు వచ్చి నా నీడ తప్పి పోయిందని ఫిర్యాదు చేస్తాడు . నీడ తప్పిపోవడం ఏంటి ? అంటే ఈ విషయం దేవుడు మీకు చెప్పమన్నాడని అందుకే చెప్పడానికి వచ్చానని చెబుతాడు దాంతో మరింత ఆశ్చర్య పోతాడు , ఈ విషయం మీడియాకి తెలియడంతో సంచలనం అవుతుంది . కట్ చేస్తే నందినగర్ లో చనిపోయిన తిరుపతి ది యాక్సిడెంట్ కాదని ప్లాన్ ప్రకారం చేసిన హత్య అని చెప్పి మరో షాక్ ఇస్తాడు పోలీసులకు నెపోలియన్ . దాంతో ఆ కేసు ని చేధించే క్రమంలో పలు విషయాలు వెలుగులోకి వస్తాయి . అసలు నెపోలియన్ ఎవరు ? తిరుపతి హత్య ఎందుకు జరిగింది ? చివరకు రవివర్మ ఈ కేసు ని ఎలా సాల్వ్ చేశాడు అన్న‌దే మిగ‌తా క‌థ‌.


న‌టీన‌టుల ప్ర‌తిభః 

ఎంతో కాలంగా ఇండ‌స్ట్రీలో ఉన్న‌ప్ప‌టికీ ర‌వివ‌ర్మ‌కు తొలిసారిగా ఫుల్ లెంగ్త్ క్యారెక్ట‌ర్ ప‌డింది. ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర కావ‌డంతో త‌న సత్తా చాటి మంచి మార్కులే కొట్టేశాడు. నెపోలియ‌న్ పాత్ర‌లో ఆనంద్ ర‌వి బాగా చేశాడు. అన్నీ ఎక్స్‌ప్రెష‌న్స్ స‌రిగా పలికించేలా లేడు కానీ నెపోలియ‌న్ త‌ర‌హా పాత్ర‌ల‌కు ఆనంద్ ర‌వి స‌రైన వ్య‌క్తి అనిపించాడు. కోమ‌లి త‌న న‌ట‌న‌తో రాణించింది. ఇక మిగతా పాత్ర‌ధారులు ఎవ‌రి పాత్ర‌ల ప‌రిధిలో వారు బాగానే  చేశారు.


సాంకేతిక వ‌ర్గంః 

ఆనంద్ రవి రచయితగా ఫస్టాఫ్ వరకు కథనంలో మంచి ఉత్కంఠను మైంటైన్ చేసి సత్తా చూపినా సెకండాఫ్ ను సాదా సీదాగా తయారుచేసి ప్రేక్షకుడి స‌హ‌నాన్నిప‌రీక్షించాడు.  అలా కాకుండా సినిమాను ఏదైనా ఒక పద్దతిలోనే నడిపి ఉంటే బాగుండేది. స్క్రీన్ ప్లే ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే సినిమా స్థాయి వేరేలా ఉండేది. సినిమాటోగ్ర‌ఫీ బావుంది. సిద్దార్థ్ స‌దాశివుని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. ఎడిట‌ర్ త‌న క‌త్తెర‌కు ఇంకాస్త ప‌దును పెట్టాల్సింది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.  


ప్ల‌స్ పాయింట్స్ః 

 సినిమా మొదలు పెట్టిన విధానం

నేపథ్య సంగీతం

సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్


మైనస్ పాయింట్స్ :

స్క్రీన్ ప్లే

అన‌వ‌స‌ర‌మైన స‌న్నివేశాలు


పంచ్‌లైన్ః నెపోలియ‌న్ నీడ దొర‌క‌దు

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3/5