Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

'మెంట‌ల్ మ‌దిలో' మూవీ రివ్యూ


ప్రస్తుతం ప్రేక్షకుడు సినిమా తీరు మారుతోంది. ఒకప్పుడు పూర్తిస్థాయి కమర్షియల్‌ అండ్‌ మాస్‌ చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు..కుటుంబంలోని విలువలు, బంధాలు, మధ్య తరగతి ప్రేక్షకుడిని తెరపై ఆవిష్కరించే సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలంటే ప్రేక్షకుడు థియేటర్‌ వరకు వస్తున్నారు. అలాంటి సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాలను కూడా సాధిస్తున్నాయి. 2016లో చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది 'పెళ్ళిచూపులు'. ఈ నిర్మాతలు వెంటనే ఏదో సినిమా చేసేయాలని కాకుండా మళ్లీ అలాంటి సెన్సిటివ్‌ సబ్జెక్ట్‌, కొత్త దర్శకుడితో సినిమా చేయడానికే ప్రాధాన్యం ఇచ్చి రూపొందించిన సినిమాయే 'మెంటల్‌ మదిలో'. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆక‌ట్టుకుందో లేదో మ‌న స‌మీక్ష‌లో చూద్దాం

క‌థః 

అర‌వింద్(శ్రీ విష్ణు) , స్వేచ్ఛ‌(నివేదా) లు పెళ్లి చూపుల్లోనే ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డ‌తారు. తీరా నిశ్చితార్థం స‌మ‌యానికి అనుకోని ఘ‌ట‌న వ‌ల్ల ఆ శుభ‌కార్యం వాయిదా ప‌డుతుంది. త‌ర్వాత అర‌వింద్ ముంబై లో ఉద్యోగం చేయాల్సి వ‌స్తుంది. ఆ టైమ్ లో రేణు(అమృత‌) ప‌రిచ‌యం అవుతుంది. అర‌వింద్ మొద‌టి నుంచి త‌ను ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాల‌నుకుంటున్నాడో అలాంటి గుణాల‌న్నీ రేణులో చూసిన అర‌వింద్ రేణు ను ప్రేమిస్తాడు. అస‌లే త‌న‌కు క‌న్ఫ్యూజ‌న్. మ‌రి అర‌వింద్ చివ‌రికి వీరిద్దరిలో ఎవ‌రిని చేసుకున్నాడు అనేది అస‌లు క‌థ‌.


న‌టీన‌టుల ప్ర‌తిభః 

అప్పట్లో ఒకడుండేవాడు సినిమాలో సీరియస్ రోల్ లో కనిపించిన శ్రీ విష్ణు, మెంటల్ మదిలో లవర్ బాయ్ లుక్స్ లో అదరగొట్టాడు. సొంతంగా నిర్ణయం తీసుకోలేని గందరగోళ మనస్తత్వం ఉన్న వ్యక్తిగా మంచి నటన కనబరిచాడు. ఫస్ట్ హాఫ్ అంతా అమాయకుడిగా కనిపించిన శ్రీవిష్ణు, సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకున్నాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ హీరోయిన్ గా నటించిన నివేథ పెతురాజ్, లుక్స్ తో పాటు నటనతోను స్వేచ్ఛపాత్రకు ప్రాణం పోసింది నివేథ. మరో కీలక పాత్రలో నటించిన రేణు, కథను మలుపు తిప్పే పాత్రలో ఆకట్టుకుంది. బబ్లీగా కనిపిస్తూనే మంచి ఎమోషన్స్ పండించింది. చాలా కాలం తరువాత ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించిని సీనియర్ నటుడు శివాజీ రాజా మిడిల్ క్లాస్ తండ్రిగా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.


సాంకేతిక నిపుణులుః 

ఓ కొత్త ద‌ర్శ‌కుడితో ఇలాంటి క‌థ‌తో సినిమా చేసేందుకు అంగీక‌రించినందుకు నిర్మాతను ముందుగా అభినందించాలి. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌కుడిగా తొలిప్ర‌య‌త్నంలోనే మంచి మార్కులు కొట్టేశాడు. చాలా చిన్న పాయింట్ ను తీసుకుని దాని మీద క‌థా క‌థ‌నాల్ని న‌డిపించిన తీరుకు ఖ‌చ్చితంగా వివేక్ ను మెచ్చుకోవాల్సిందే. పాత్ర‌లు, వాటి చిత్ర‌ణ‌, మాట‌లు, అన్నింట్లోనూ త‌న ప్ర‌త్యేకత‌, అభిరుచి క‌నిపిస్తాయి. వేద‌రామ‌న్ సినిమాటోగ్ర‌ఫీ చాలా బాగుంది. ప్ర‌శాంత్ విహారి మంచి సోల్‌ఫుల్ మ్యూజిక్ అందించాడు. రీరికార్డింగ్ చాలా కొత్త‌గా, నీట్ గా ఉంది. నిర్మాణ విలువ‌లు చాలా బాగున్నాయి.  


ప్ల‌స్ పాయింట్స్ః 

ద‌ర్శ‌క‌త్వం

నివేదా, శ్రీవిష్ణు ల న‌ట‌న‌


మైన‌స్ పాయింట్స్ః 

సెకండాఫ్ లో స్లో నెరేష‌న్ 


పంచ్‌లైన్ః క‌న్య్ఫూజ‌న్ లేకుండా చూసేయొచ్చు

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3.5/5