Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

'మ‌ళ్లీ రావా' మూవీ రివ్యూ


అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ అతి కొద్ది కాలంలోనే త‌న‌కంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ మ‌ధ్య త‌న ప‌రాజయాలు కూడా ఆయ‌న్ను దెబ్బ తీయ‌డంతో కాస్త గ్యాప్ తీసుకుని సినిమాలు తీస్తున్నాడు. గ‌తేడాది వ‌చ్చిన న‌రుడా డోన‌రుడా చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. కొంత గ్యాప్ త‌ర్వాత వ‌స్తున్న మ‌ళ్లీ రావా సినిమా అయినా ఆయ‌న్ను బాక్సాఫీస్ వ‌ద్ద నిల‌బెడుతుందా లేదా చూద్దాం.


క‌థః

కార్తీక్, అంజ‌లిల‌ల‌కు ఒక‌రంటే ఒక‌రికి తొమ్మిదే త‌ర‌గ‌తి నుంచే ఇష్టం ఉంటుంది.  ఆ త‌ర్వాత కొన్ని పరిస్థితుల ప్ర‌భావంతో ఇద్ద‌రూ విడిపోతారు. అంజ‌లి అమెరికా వెళ్లిపోతుంది. త‌ర్వాత హైద‌రాబాద్ లో ఓ ప్రాజెక్ట్ ప‌ని మీద వ‌స్తుంది. అదే ఆఫీస్ లో కార్తీక్ క‌న‌ప‌డ‌టం, మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డ‌టం, ఆ ప్రేమ‌ను చెప్ప‌డం, అంజ‌లి త‌న మ‌న‌సులో కార్తీక్ మీదున్న ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌ర‌చ‌డం.. మ‌రి అస‌లు క‌థేంటి?  చివ‌ర‌కు ఎలా క‌లిసారు అన్న‌ది తెర‌మీదే చూడాలి.


న‌టీన‌టుల ప్ర‌తిభః 

రొమాంటిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ లాంటి అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన సుమంత్ మరోసారి ఆ ఇమేజ్ ను నిలబెట్టుకున్నాడు. అందమైన ప్రేమ కథలో హుందాగా నటించాడు. సాఫ్ట్ వేర్ కంపెనీలో అంజలిని కలిసినప్పుడు అల్లరి అబ్బాయిగా మెప్పించినా సుమంత్, తరువాత హుందాగా కనిపించి ఆకట్టుకున్నాడు. బుల్లితెర మీద మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఉత్తరాది నటి ఆకాంక్ష సింగ్ అంజలి పాత్రలో ఒదిగిపోయింది. లుక్స్ విషయంలో తెలుగమ్మాయే అనిపించిన ఈ భామ... పర్ఫామెన్స్ తోనూ మెప్పించింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆకాంక్ష నటన కంటతడిపెట్టిస్తుంది.   

సాంకేతిక నిపుణులుః

దర్శకుడు గౌతమ్ ఈ రెండు అంశాలని చక్కగా మిక్స్ చేసి సెకండాఫ్లో.. మంచి స్క్రీన్ ప్లేను రాసుకుని సినిమాను రూపొందించిన విధానం బాగుంది. ప్రేమికుల చిన్నప్పటి ప్రేమ కథలోని కొన్ని సన్నివేశాలు, పెద్దయ్యాక, ప్రస్తుతంలోని ఇంకొన్ని ఎమోషనల్ సీన్లు బాగున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ హీరోని వదిలి వెళ్లిపోయే సందర్భం, చివర్లో అతనికి సంజాయిషీ చెప్పుకునే సందర్భం భావోద్వేగపూరితంగా ఉండి టచ్ చేస్తాయి.  సినిమాకు సంగీతం మరో బలంగా నిలిచింది. పాటలు కథతో ట్రావెల్ అవుతూ చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది.  ఎడిటింగ్ బానే ఉంది. నిర్మాణ విలువ‌లు సినిమా రేంజ్ కు త‌గ్గ‌ట్టున్నాయి.


ప్ల‌స్ పాయింట్స్ః 

న‌టీన‌టుల ప‌నితీరు

క‌థ‌నం

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌

సినిమాటోగ్ర‌ఫీ


మైన‌స్ పాయింట్స్ః 

స్లో నెరేష‌న్‌

ఫ‌స్టాఫ్


పంచ్‌లైన్ః ఎమోష‌న‌ల్ ఫీల్ గుడ్ ల‌వ్‌స్టోరీ

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3/5