'కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త' మూవీ రివ్యూ


ఆడో ర‌కం- ఈడోర‌కం హిట్ త‌ర్వాత రాజ్ త‌రుణ్ హీరోగా, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా తెర‌కెక్కుతున్న చిత్రం కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌. ఎ.కె ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో దొంగాట ఫేమ్ వంశీ కృష్ణ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ చిత్రం ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి కిట్టుగాడు ఈ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ఎలా మెప్పించాడో చూద్దాం.


మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్ చేసి కార్ కేర్ ర‌న్ చేసుకునే కిట్టు (రాజ్ త‌రుణ్) కుక్కల‌ను కిడ్నాప్ చేస్తూ ఉంటాడు. మొద‌టి చూపులోనే జాన‌కి(అను ఇమ్మాన్యుయేల్)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. కిట్టు కుక్క‌ల కిడ్నాప‌ర్ అని తెలుసుకున్న జాన‌కి అలియాస్ జాను అత‌డికి దూరమ‌వుతుంది. ఈ నేప‌థ్యంలోనే సిటీలోనే పెద్ద క్రిమిన‌ల్ అయిన అర్బాజ్ ఖాన్ జాన‌కిని కిడ్నాప్ చేస్తాడు. ఈ విష‌యం తెలుసుకున్న కిట్టు ఆమెను కాపాడేందుకు ప్ర‌య‌త్నాలు స్టార్ట్ చేస్తాడు కిట్టు. మ‌రోవైపు కిట్టు కోసం పోలీసులు కూడా వెతుకుతూ ఉంంటారు. అస‌లు కార్ కేర్ న‌డుపుకునే కిట్టు కుక్క‌ల‌ను ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వ‌స్తుంది. జాన‌కిని ఆ క్రిమిన‌ల్ ఎందుకు కిడ్నాప్ చేస్తాడు.కిట్టు కోసం పోలీసులు ఎందుకు వెతుకుతుంటారు. అస‌లు ఇన్ని స‌మ‌స్య‌ల మ‌ధ్య కిట్టు జాన‌కి ప్రేమ‌ను తిరిగి ఎలా ద‌క్కించుకున్నాడు ఈ ప్ర‌శ్న‌లన్నింటికీ స‌మాధాన‌మే మిగ‌తా క‌థ‌.


రాజ్ త‌రుణ్ న‌ట‌న ఎప్ప‌టిలాగే ఉంది. కాక‌పోతే ఈ సారి కుక్క‌ల కిడ్నాప్ అంటూ త‌న క్యారెక్ట‌రైజేష‌న్ స‌ర‌దా స‌ర‌దాగా సాగుతూ ఉంటుంది. అను ఇమ్మాన్యుయేల్ న‌ట‌న‌తో పాటు గ్లామ‌ర్ ను కూడా బాగానే పండించింది. కాక‌పోతే, అక్క‌డ‌క్క‌డా రాజ్ త‌రుణ్ ప‌క్క‌న అను కొంచెం పెద్దదిగా క‌నిపిస్తుంది. స్నిగ్థ మ‌రోసారి ఉన్నంత‌సేపు త‌నదైన శైలిలో కామెడీని పేల్చింది. పృథ్వీ కామెడీ చాలా బాగుంది. ప్ర‌వీణ్‌, సుద‌ర్శ‌న్ కామెడీ టైమింగ్ బాగుంది. నాగ‌బాబు కు మ‌రోసారి మంచి క్యారెక్ట‌ర్ దొరికింది. రఘుబాబు, వెన్నెల కిషోర్ త‌మ త‌మ పాత్ర‌ల మేర బాగా చేశారు. సాంకేతిక పరంగా, 

ద‌ర్శ‌కుడు ఒక కొత్త కాన్సెప్ట్ ను తీసుకున్న‌ప్ప‌టికీ, దాన్ని మొద‌ట్లో ఉన్నంత ఆస‌క్తిగా చివ‌ర వ‌ర‌కు ఆ ఆస‌క్తిని క‌లిగించ‌లేక‌పోయాడు. సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. అనూప్ సంగీతం సోసో గానే ఉంది.  హంసా నందిని పాట కూడా సినిమాను కాపాడ‌లేక‌పోయింది. ఎడిటింగ్ లో కొన్ని సీన్స్ ను క‌ట్ చేస్తే ఇంకొంచెం బాగుండి ఉండేది. నిర్మాణ విలువ‌లు బాగానే ఉన్నాయి.


ప్ల‌స్ పాయింట్స్ః 

పృథ్వీ కామెడీ

డైర‌క్ట‌ర్ కామెడీ టైమింగ్

ఇంట‌ర్వెల్ బాంగ్


మైన‌స్ పాయింట్స్ః

హంసా నందిని సాంగ్

ర‌ఘుబాబు ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్

స్లో సెకండాఫ్ 


 పంచ్‌లైన్: పృథ్వీ కామెడీతో కిట్టు గాడు గ‌ట్టెక్కుతాడు


ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 2.5/5