Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

'జ‌వాన్' మూవీ రివ్యూ


మెగా ఫ్యామిలీలో ప్ర‌తీ ఒక్క‌రూ ఒక్కొక టైప్ సినిమాలు మాత్రమే ఎంచుకుంటూ ఉంటారు. కానీ మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ మాత్రం కాస్త డిఫ‌రెంట్ గా ఎంచుకుంటూ త‌న ప్ర‌త్యేకతను చాటుతున్నాడు. తేజూ కెరీర్ స్టార్టింగ్ లో బావున్న‌ప్ప‌టికీ, సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్, సుప్రీమ్ వంటి బ్లాక్ బ్ల‌స్ట‌ర్స్ త‌న ఖాతాలో ఉన్న‌ప్ప‌టికీ.. రీసెంట్ గా వ‌చ్చిన తిక్క‌, విన్న‌ర్, న‌క్ష‌త్రం వంటి సినిమాలు త‌న‌కి ఫ్లాప్స్ ను మూట‌గ‌ట్టాయి. ఈ నేప‌థ్యంలోనే ఈసారి సినిమా ఎలాగ‌యినా గ‌ట్టిగా చేయాల్సిందే, హిట్ కొట్టాల్సిందే అని ఎంతో క‌సిగా జ‌వాన్ ను తీశాడు. బివిఎస్ ర‌వి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాతో అయినా తేజూ ఫామ్ లోకి వ‌స్తాడా..?  ప్రేక్ష‌కులు జ‌వాన్ మీద పెట్టుకున్న అంచ‌నాల‌ను అందుకున్నాడా లేదా అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థః 
కుటుంబం మీద, దేశం మీద ఉన్న ప్రేమ వ‌ల‌న తేజూ కు అనుకోని స‌మ‌స్య‌లు వ‌చ్చి ప‌డ‌తాయి. ఆ సమ‌స్య‌ల‌ను ఎలా ఎదుర్కొని త‌న కుటుంబంతో పాటూ, దేశాన్ని కూడా కాపాడుకుని జవాన్ లా నిలిచాడు అన్న‌దే క‌థ‌

న‌టీన‌టుల ప్ర‌తిభః 
సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇప్ప‌టివ‌ర‌కు తన కెరీర్లోనే బెస్ట్ ప‌ర్ఫామెన్స్ ఇచ్చాడ‌ని చెప్పుకోవాలి. ఇప్ప‌టి వ‌ర‌కు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో న‌ట‌న‌కి పెద్దగా ఆస్కారం లేని పాత్ర‌లు చేసిన తేజూ, ఈ సినిమాతో త‌న‌లోని న‌టుడిని బ‌య‌ట‌కు తీసి మంచి మార్కులే కొట్టేశాడు. ఎత్తుకు పై ఎత్తులు వేయ‌డంలోనూ, త‌న కుటుంబాన్ని కాపాడుకునే సీన్స్ లో మంచి కొడుకుగానూ, ఇటు దేశంకోసం పోరాడే జ‌వాన్ లాగానూ, ల‌వ‌ర్ బాయ్ గానూ, మాస్ ఆడియ‌న్స్ ను త‌న డ్యాన్స్ ల తోనూ బాగా అల‌రించాడు. మెహ‌రీన్ కేవ‌లం పాట‌ల‌కే ప‌రిమిత‌మైన‌ప్ప‌టికీ, త‌న గ్లామ‌ర్ తో ఆక‌ట్టుకుంటుంది. ఇక చెప్పుకోవాల్సింది విల‌న్ గా చేసిన ప్ర‌స‌న్న గురించి. త‌న పాత్ర దాదాపు హీరో పాత్ర‌కు స‌మానంగా ఉంటుంది. హీరో ఫ్రెండ్ గా ఉంటూ అటు మంచిత‌నాన్ని త‌న ముఖంలో ప‌లికిస్తూనే, విల‌న్ గా త‌న‌లోని రెండో షేడ్ ను చూపించ‌డంలో బాగా స‌క్సెస్ అయ్యాడు. త‌న క్యారెక్ట‌రైజేష‌న్ కూడా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. మిగిలిన వారిలో త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్యంరాజేష్, హీరో తండ్రిగా చేసిన జ‌య‌ప్ర‌కాష్ తమ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణులుః 
రచ‌యిత‌గా మంచి పేరున్న బివిఎస్ ర‌వి, ద‌ర్శ‌కుడిగా మారి వాంటెడ్ లాంటి డిజాస్ట‌ర్ సినిమా త‌ర్వాత తెర‌కెక్కించిన జ‌వాన్ మాత్రం ఎంత‌లా ఉంటుందిలే అనుకున్న వాళ్లందరూ, ఈ సినిమా తీసింది బీవీఎస్ ర‌వి యేనా అనుకునేలా  తెర‌కెక్కించాడు ఈ సినిమా. అటు కాన్సెప్ట్ ను, ఇటు క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ను స‌మ‌పాళ్ల‌లో మెయింటెయిన్ చేసి, ద‌ర్శ‌కుడిగా మంచి మార్కులే కొట్టేశాడు ర‌వి. హీరో- విల‌న్ మ‌ధ్య సాగే సీన్స్ ను, సెంటిమెంట్ సీన్స్ ను బాగా ఎలివేట్ చేయ‌గ‌లిగాడు. డైలాగ్స్ కూడా బాగా రాసుకున్నాడు. గుహ‌న్ సినిమాటోగ్ర‌ఫీ  చాలా బావుంది. ఇక ముఖ్యంగా  చెప్పుకోవాల్సింది థ‌మ‌న్ గురించి. పాట‌లతో పాటూ, మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. త‌న రీరికార్డింగ్ తో సినిమాను మ‌రో స్తాయికి తీసుకెళ్లాడు థ‌మ‌న్. ఎడిటింగ్ బావుంది కానీ ఎడిటర్ ఇంకాస్త త‌న కత్తెర‌కు ప‌ని చెప్పుండాల్సింది. సినిమా స్థాయికి త‌గ్గ‌ట్లు నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్ః 
సాయి ధ‌ర‌మ్ తేజ్, ప్ర‌స‌న్న ల న‌ట‌న‌
థ‌మ‌న్ రీరికార్డింగ్
డైలాగ్స్

మైన‌స్ పాయింట్స్ః 
స్క్రీన్ ప్లే రొటీన్ గా ఉండ‌టం
అక్క‌డక్క‌డా స్లో నెరేష‌న్

పంచ్‌లైన్ః జ‌వాన్- ఇంటికొక‌డుండాలి
ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 3.25/5