Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

'ఇంద్ర‌సేన' మూవీ రివ్యూ


బిచ్చ‌గాడు సినిమాతో క్రేజ్‌ను సంపాదించుకున్న హీరో విజ‌య్ ఆంటోనికి త‌ర్వాత భేతాళుడు, యెమ‌న్ సినిమాలు తెలుగులో మంచి విజ‌యాల‌ను అందించ‌లేక‌పోయాయి. బిచ్చ‌గాడు చిత్రంలో మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో ఆక‌ట్టుకున్న విజ‌య్ ఆంటోని..ఈసారి బ్ర‌ద‌ర్ సెంటిమెంట్‌తో ఆకట్టుకోవ‌డానికి రెడీ అయ్యాడు. మ‌రి ఇంద్ర‌సేన‌తో విజ‌య్ ఆంటోని మ‌ళ్లీ స‌క్సెస్ అందుకుని ప్రేక్ష‌కుల‌ని మెప్పించాడా లేదా అనేది మ‌న స‌మీక్ష‌లో చూద్దాం.  


క‌థః 

ఇంద్రసేన (విజయ్ ఆంటోని), రుద్రసేన (విజయ్ ఆంటోని) ఇద్దరూ ఒకేలా ఉండే అన్నదమ్ములు. వారిలో పెద్దవాడైన ఇంద్రసేన ప్రేమ విఫలమై తాగుడుకు బానిసై బాధపడుతుంటాడు. అతని తమ్ముడు రుద్రసేన మాత్రం మంచి ఉద్యోగం చేస్తూ పెళ్లి చేసుకోవడానికి సిద్దమవుతుంటాడు. అలాంటి తరుణంలోనే అనుకోకుండా ఇంద్రసేన ఒక హత్య కేసులో జైలుకు వెళతాడు. దాంతో అతని కుటుంబం మొత్తం చెల్లాచెదురైపోతుంది. అలా చేయని తప్పులకు కష్టాలపాలైన ఇంద్రసేన, రుద్రసేనలు ఎలా తయారయ్యారు, చివరికి వాళ్ళ జీవితాలు ఏమయ్యాయి అన్న‌దే క‌థ‌


న‌టీన‌టుల ప్ర‌తిభః 

ఇంద్రసేన, రుద్రసేన రెండు పాత్రలను పోషించాడు విజయ్‌ ఆంటోని. అతని పాత్రలన్నీ కాస్త గంభీరంగా ఉంటాయి. ఈ సినిమాలోనూ అదే దారిలో నడిచాయి. విజయ్‌ ఆంటోని మినహాయిస్తే మిగిలిన వారందరూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని నటులే. కాకపోతే ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు. కథానాయికలు ముగ్గురి నటనా ఆకట్టుకుంటుంది. సినిమా మొత్తం విజ‌య్ ఆంటోనీ వ‌న్ మ్యాన్ షో గా నే ఉంటుంది. మిగిలిన వారు కూడా ఎవ‌రి పాత్ర ప‌రిధి మేర వారు బాగా చేశారు. 


సాంకేతిక నిపుణులుః 

అన్నదమ్ముల అనుబంధం, కుటుంబ విలువలు చుట్టూ కథ అల్లుకున్న దర్శకుడు జి.శ్రీనివాసన్ దాన్ని ప్రత్యేకంగా ఉండేలా చూసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. కుటుంబ కథ అనగానే రొటీన్ గా కాకుండా ట్విన్స్ నేపధ్యం తీసుకోవడం, జీవితాన్ని ఎలా నడుపుకోవాలో అన్న సీరియస్ పాయింట్ ను ఆ కవలల మధ్య పోల్చి చూపడం బాగుంది. ఇప్పటిదాకా మనం చూసిన కవలల కథలతో పోల్చుకుంటే ఇంద్రసేన పూర్తి భిన్నం. కధకు తగ్గట్టు కధనం అనిపించినా అది బాగా నెమ్మదిగా అనిపిస్తుంది. కధలో లీనం అయితే పెద్దగా ఆ లోటు కూడా తెలియదు. అయితే రొటీన్ వినోదం ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు.  సినిమాటోగ్ర‌ఫీ బావుంది. విజ‌య్ ఆంటోనీ పాట‌లు, నేప‌థ్య సంగీతం రెండూ చాలా బావున్నాయి. గ్రాఫిక్స్ వ‌ర్క్ ను త‌ప్ప‌క మెచ్చుకోవాలి. ఎడిటర్ సెకండాఫ్ లో త‌న క‌త్తెర‌కు ఇంకాస్త ప‌ని చెప్పాల్సింది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.  


ప్ల‌స్ పాయింట్స్ః 

ఫ్యామిలీ డ్రామా 

విజ‌య్ ఆంటోనీ

సంగీతం


మైన‌స్ పాయింట్స్ః 

అన‌వ‌స‌ర స‌న్నివేశాలు

స్లో నెరేష‌న్


పంచ్‌లైన్ః అన్న‌దమ్ముల ఎమోష‌న‌ల్ సేన‌

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 2.5/5