'ద్వార‌క' మూవీ రివ్యూ


విజయ్ దేవర..పెళ్లి చూపులు సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్ అయిన ఈ యువ హీరో ఇప్పుడు దర్శక నిర్మాతలకి హాట్ కేక్. విభిన్నమైన డైలాగ్  డెలివిరితో , అమాయకపు నటనతో ఆకట్టుకునే  విజయ్‌ దేవరకొండ ఇప్పుడు ప్రేక్షకులకు నచ్చిన , మెచ్చిన హీరో . అలాంటి ఈ యువ హీరో ఈ శుక్రవారం  ‘ద్వారక’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం కూడా విజయ్ దేవరకొండ కి మరో సక్సస్ ని ఇచ్చిందో లేదో తెలియాలంటే ఈ రివ్యూ వాచ్ చేయాలిసిందే. 


క‌థ‌లోకి వెళితే, ముందుగా ఈ సినిమా కథ‌ విషయానికి వస్తే.. హీరో తన  స్నేహితులతో కలిసి చిన్నచిన్న దొంగతనాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఒకరోజు అనుకోకుండా  ద్వారక అనే అపార్ట్‌మెంట్‌కు దొంగతానికి వెళ్తాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో  హీరో బాబాగా మారాల్సి వస్తుంది. హీరోని బాబా అని నమ్మిన జనం అంతా అదే అపార్ట్‌మెంట్‌లో చిన్న సైజ్ గుడి కడతారు.మీడియా కూడా బాబాకి కావాల్సినంత పబ్లిసిటీ ఇస్తుంది. ఈ క్రమంలో హీరో ప్రేమించిన అమ్మాయికి పెళ్లి కాలేదంటూ ఆమె తల్లిదండ్రులు బాబాగా ఉన్న ఆయన వద్దకే తీసుకువస్తారు. కానీ హీరోయిన్‌కు హీరోపై ఏ మాత్రం నమ్మకం ఉండదు. ఈ బాబాను అడ్డుపెట్టుకుని ఓ ట్రస్టుకు అందాల్సిన రూ.2వేల కోట్లను స్వాధీనం చేసుకోవాలని ఒక ముఠా ప్రయత్నిస్తుంది. హీరో బాబా కాదని నిరూపించడానికి ఓ నాస్తికుడు వస్తాడు. ఓ వైపు ప్రేమించిన అమ్మాయి.. మరోవైపు ముఠా.. ఇంకోవైపు నాస్తికుడు.. వీరి మధ్య హీరో ఎలా ఇరుక్కున్నాడు? బాబా నాటకానికి ఎలా తెరదించాడు అనేదే మిగిలిన స్టోరీ. 


 నటీ నటుల పనితీరు :  తనకి  పెళ్లి చూపులు ద్వారా విజయం, గాలివాటాన వచ్చిన హిట్ కాదని విజయ్‌ దేవరకొండ నిరూపించుకున్నాడు.  ఈ యువ హీరో నటనలో వేరియేషన్ చుపించగ‌లిగాడు. పాత్రకు తగ్గట్టు హుషారుగా నటించారు. కామెడీ కూడా అద్భుతమైన టైమింగ్ తో చేసి ఆకట్టుకున్నాడు . హీరోయిన్ పాత్రకు అంతగా స్కోప్‌ లేదు. కానీ ఉన్నంతలో ఆమె పరవాలేదు అనిపించింది.  మురళీ శర్మ,  పృథ్వీతో ప్రకాశ్‌రాజ్‌ తదితర కీలక నటులు సినిమా విజయానికి కారణం అయ్యారు . 


 సాంకేతిక ప‌రంగా ముందుగా ఈ సినిమా విషయంలో మెచ్చుకోవాల్సింది దర్శకుడినే . అన్ని క్రాఫ్ట్స్ నుండి దర్శకుడు త‌న‌కు కావాల్సిన అవుట్‌పుట్ ను రాబట్టుకున్న విధానం  అద్భుతం .  పాటలు వినడానికి ఓకే అనిపిస్తాయి. చిత్రీకరణ పరంగా ఎక్కువ మార్కులు పడతాయి. విజువల్ ప‌రంగా సినిమా రిచ్‌గా చూపించారు. కథ పరంగా వైవిధ్యం లేకున్నా కథనంతో ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ సినిమాకి డైలాగ్స్ పెద్ద ఎస్సెట్ అని చెప్పుకోవచ్చు . 


ప్ల‌స్ పాయింట్స్ః 

* విజయ్‌ దేవరకొండ 

* వినోదం 

* దొంగబాబా లీలలు

 

మైన‌స్ పాయింట్స్ః 

* అక్కడక్కడా నెమ్మదించటం 

* సరైన ప్రతినాయకుడు లేకపోవడం 


పంచ్ లైన్ : అయ్యారే.. ఇది కాపీయే

 ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్: 2.5 /5