'2 కంట్రీస్' మూవీ రివ్యూ


ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌ను తాను హీరోగా నిరూపించుకోవాల‌ని తెగ ట్రై చేస్తున్నాడు సునీల్. క‌మెడియ‌న్ నుంచి హీరోగా మారాక త‌న‌కు చెప్పుకోద‌గ్గ రీతిలో గుర్తింపు ద‌క్క‌లేద‌నేది వాస్త‌వం. ఈసారి ఎలాగైనా 2 కంట్రీస్ తో మంచి విజ‌యం సాధించాల‌ని ఎన్నో ఆశ‌ల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. మరి ఈ సినిమా అయినా సునీల్ ఆశ‌ల‌ను నెర‌వేరుస్తుందా లేదా అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం..


క‌థః 

స‌ర‌దాగా జీవితం గ‌డుపుతున్న ఉల్లాస్(సునీల్) డ‌బ్బు కోసం సిమ్ర‌న్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాల‌నుకుంటాడు. కానీ కొన్ని అనుకోని సంఘ‌ట‌నల వ‌ల్ల ఉల్లాస్ కు, ల‌య‌(మ‌నీషారాజ్‌)తో వివాహ‌మ‌మవుతుంది. పెళ్లైన త‌ర్వాత వాళ్లిద్ద‌రి మ‌ధ్య గొడవ‌లు వ‌చ్చి విడాకులు కూడా తీసుకుందామ‌నుకుంటారు. కానీ ఉల్లాస్ తప్పు త‌న‌దే అని తెలుసుకుని ల‌య‌తో ఉండ‌టానికి సిద్ధ‌ప‌డ‌తాడు. ల‌య ఇందుకు ఒప్పుకుంటుందా? అస‌లు వారిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు రావ‌డానికి కార‌ణ‌మేంటి అన్న‌దే మిగ‌తా క‌థ‌.


న‌టీన‌టుల ప్ర‌తిభః

మొద‌టి నుంచి హీరోగా నిల‌దొక్కుకోవాల‌ని తెగ క‌ష్టాలు ప‌డుతున్న సునీల్, ఈ సినిమా కోసం త‌న వంతు ప్ర‌య‌త్నం చేశాడు. త‌న కామెడీ టైమింగ్  తో ఆక‌ట్టుకున్నాడు. సెంటిమెంట్ సీన్స్ లోనూ సునీల్ న‌ట‌న బాగుంది. హీరోయిన్ కొత్త అమ్మాయి అయినా మంచి న‌ట‌న ప్ర‌ద‌ర్శించింది. హీరో ఫ్రెండ్ గా శ్రీనివాస్ రెడ్డి కామెడీ బావుంది. మిగ‌తా పాత్ర‌ల్లో పృథ్వీ, న‌రేష్ , త‌దిత‌రులు త‌మ త‌మ ప‌రిధుల్లో బాగానే చేశారు.


సాంకేతిక నిపుణులుః 

ఆల్రెడీ ఒక భాష‌లో హిట్ అయిన సినిమాను మ‌రోభాష‌లోకి రీమేక్ చేయాలంటే అది ద‌ర్శ‌కుడికి క‌త్తిమీద సాము లాంటిదే. ఈ విష‌యంలో ద‌ర్శ‌కుడు ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. సినిమా మొత్తం ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెట్టాడ‌నే చెప్పాలి. గోపీ సుంద‌ర్ సంగీతం చెప్పుకోద‌గ్గ రీతిలో ఏం లేదు. రీరికార్డింగ్ సో సో గా ఉంది. సినిమాకు ప్ల‌స్ అంటే సినిమాటోగ్ర‌ఫీ. ప‌ల్లెటూరి అందాల‌ను బాగా చూపించారు. ఎడిటింగ్ విష‌యంలో ఇంకాస్త జాగ్ర‌త్త తీసుకుని ఉండాల్సింది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.


ప్ల‌స్ పాయింట్స్ః 

అక్క‌డ‌క్కడా ఆక‌ట్టుకునే కామెడీ

సినిమాటోగ్ర‌ఫీ


మైన‌స్ పాయింట్స్ః 

క‌థ‌

ద‌ర్శ‌క‌త్వం


పంచ్‌లైన్ః 2 కంట్రీస్.. ఎక్క‌డా ఆక‌ట్టుకోదు

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ః 2/5