100 Days Of Love Movie Reviewదుల్క‌ర్ స‌ల్మాన్, నిత్యా మీన‌న్ లు క‌లిసి నటించిన మలయాళ చిత్రం 100 డేస్ ఆఫ్ ల‌వ్. 2015లో విడుదలైన ఈ చిత్రాన్నితెలుగులో కూడా అదే పేరుతో డబ్ చేశారు. గతంలో దుల్క‌ర్ స‌ల్మాన్, నిత్య మీన‌న్ లు క‌లిసి న‌టించిన సినిమాల‌న్నీ మంచి స‌క్సెస్ ను సాధించగా ఇప్పుడు మ‌ళ్లీ వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న 100 డేస్ ఆఫ్ ల‌వ్ సినిమా ఈరోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. జీన‌స్ ముహ్మ‌ద్ ద‌ర్శ‌క‌త్వంలో, SSC మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో , ఎస్. వెంక‌ట‌ర‌త్నం నిర్మాత‌గా వ్య‌వ‌హరిస్తున్న ఈ చిత్రం గ‌తంలో విధంగానే మ్యాజిక్ చేసిందా లేదా చూద్దాం.


హీరో ఒక పత్రిక‌లో ఫీచ‌ర్ రైట‌ర్ గా ప‌నిచేస్తుంటాడు. ఆల్రెడీ ప్రేమ‌లో విఫ‌ల‌మై, జీవితం ఎటు వెళ్తుందో అనుకునే టైమ్ లో హీరోయ‌న్ ను క‌లుస్తాడు. అతి కొద్ది కాలంలోనే ఇద్ద‌రూ బాగా ద‌గ్గ‌ర‌వుతారు. హీరోయిన్ ఆల్రెడీ వేరే అబ్బాయితో పెళ్లికి సిద్ధ‌మై ఉంటుంది. అయితే అస‌లు హీరో, హీరోయిన్స్ మ‌ధ్య ప్రేమ ఎలా పుడుతుంది, వాళ్ల ప్రేమను చివ‌ర‌కు ఎలా విజ‌య‌వంతం చేసుకున్నారు అన్న‌దే క‌థ‌.


మొద‌టి నుంచి చెప్పుకున్న‌ట్లే నిత్య, దుల్క‌ర్ ల జంట సినిమాకు పెద్ద ప్ల‌స్ పాయింట్. ఇద్ద‌రూ త‌మ త‌మ స‌హ‌జ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే ప్ర‌తి స‌న్నివేశాన్ని బాగా చేశారు. ఏ చిన్న ఫీలింగ్ ను మిస్ కాకుండా, అద్భుత‌మైన న‌ట‌న ప్ర‌ద‌ర్శించారు. నిత్య‌మీన‌న్ త‌న న‌ట‌న‌ను మ‌రోసారి ఋజువు చేసుకుంది. తన క్యారెక్ట‌ర్ లో జీవించేసింది. డైర‌క్ట‌ర్ ప్ర‌తీ క్యారెక్ట‌ర్ ను ఎంతో బాగా మ‌లిచాడు. హీరో, హీరోయిన్ కి ప్ర‌పోజ్ చేసే సీన్ చాలా బాగుంది.


100డేస్ ఆఫ్ ల‌వ్ అని పేరులోనే ప్రేమ‌క‌థ అనిపించేలా పేరుపెట్టిన ద‌ర్శ‌కుడు, సినిమాలో సెకండాఫ్ లో కానీ, ప్రేమ క‌థను మొదలుపెట్ట‌డు. సినిమా ప్ర‌థ‌మార్థం అంతా హీరోయిన్ ను వెతికే ప‌నిలోనే ఉండ‌టం, అప్ప‌టి వ‌ర‌కు నిత్య ప్రాప‌ర్ ఎంట్రీ కూడా ఇవ్వ‌క‌పోవ‌డం ప్రేక్ష‌కుడు రుచించుకోలేడు. అస‌లు ప్రేమ క‌థ అన్నాడు, మ‌నం క‌రెక్ట్ సినిమాకే వ‌చ్చామా అని అనుమాన ప‌డే ప‌రిస్థితి కూడా వ‌స్తుంది. ప్రేమ క‌థ‌లంటే నెమ్మ‌దిగానే తీయాలి అని రూల్ ఏమైనా పెట్టార‌నుకున్నారో ఏమో కానీ, సినిమా చాలా స్లోగా సాగుతుంది. సుమారు రెండున్న‌ర గంట‌లు అంత స్లో సినిమాను చూడాలంటే, ప్రేక్ష‌కుడి ఓపిక‌కు ప‌రీక్ష పెట్టిన‌ట్లే.


ద‌ర్శకుడు జీన‌స్ మొహ్మ‌ద్ గురించి చెప్పాలంటే, అన్ని క‌థ‌ల్లాంటి స్టోరీనే సెలెక్ట్ చేసుకున్నా, చెప్ప‌డంలో మ‌రీ స్లోగా అనిపించింది. కానీ త‌న మ్యాజిక్ తో మెస్మ‌రైజ్ చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు చూసిన ట్రైల‌ర్, పోస్ట‌ర్స్ చూస్తేనే అర్థ‌మ‌వుతుంది సినిమాటోగ్ర‌ఫీ గురించి. ప్ర‌తీశ్ వ‌ర్మ త‌న కెమెరా క‌న్నును బాగా చూపించ‌గ‌లిగాడు. ఎడిటింగ్ బాగుంది కానీ, ఫ‌స్టాఫ్ లో కొన్ని సీన్స్ ను క‌త్తిరిస్తే ఇంకా మెరుగ్గా ఉండేది. గోవింద్ మీన‌న్ సంగీతం ఎంతో విన‌సొంపుగా ఉంది. ఆల్రెడీ విడుద‌ల చేసిన మ్యూజిక్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. హృద‌యం క‌న్నుల‌తో పాట నిత్య మీన‌న్ బాగా పాడింది. నిర్మాణ విలువ‌లు ఎక్క‌డ ఎంత ఖ‌ర్చు పెట్టాలో అంత ఖ‌ర్చు పెట్టాడు నిర్మాత వెంక‌ట్.


చివ‌ర‌గా, నెమ్మ‌దిగా సాగితేనే ప్రేమ క‌థ‌లు కావు, ప్రేమ క‌థ‌లు అంటే ఎప్పుడూ సేమ్ ఫార్మాట్ లోనే ఉండాలని లేదు.  ఈ సినిమా నెమ్మ‌దిగా ఉన్న‌ప్ప‌టికీ, చూసినంత సేపు ఒక మంచి ఫీల్ క్యారీ అవుతుండ‌టంతో ప్ర‌తీ ప్రేక్ష‌కుడి మ‌న‌సును హత్తుకుంటుంది.


పంచ్ లైన్ః 100 రోజుల పాటు నెమ్మ‌దిగా సాగిన ప్రేమ క‌థ‌.


Filmjalsa Rating:3/5