‘సిద్దార్థ’ సినిమా రివ్యూ-సాగ‌రంలోకి ‘సిద్ధార్థ‌’స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ వైపు రావాల‌ని ఎవ‌ర‌కు మాత్రం కోరిక ఉండ‌దు చెప్పండి, బుల్లి తెర‌పై త‌న స‌త్తా చాటుకుని, వెండితెర పై కూడా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునే ప్ర‌య‌త్నంలో భాగంగానే చ‌క్ర‌వాకం, మొగలిరేకులు సీరియ‌ల్స్ తో టీవీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న సాగ‌ర్ చేసిన ప్ర‌య‌త్న‌మే సిద్దార్థ‌. రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మించిన ఈ చిత్రాన్ని, లంకాల బుచ్చిరెడ్డి సమర్పించగా, దయానంద్ రెడ్డి దర్శకత్వం వహించారు. సాక్షి చౌదరి, రాగిణి నంద్వాని లు న‌టించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ప్రేక్ష‌కులను సిద్ధార్థ మెప్పించ‌గ‌లిగాడా లేదా చూద్దాం..


ఒక ఊరిలో రైతుల భూముల‌ను లాక్కోవాలనే చూసే ఒక‌త‌ను, ఆ భూముల‌ను కాపాడ‌లనే త‌ప‌న‌తో ఉండే హీరో తండ్రి. రైతుల‌కు అన్ని విష‌యాల్లోనూ తోడుగా ఉంటున్న హీరో తండ్రిని టైమ్ చూసి చంపేస్తారు అవ‌త‌లి వాళ్లు. ఆ విష‌యం తెలుసుకున్న వెంట‌నే హీరో త‌న తండ్రిని చంపిన వ్య‌క్తిని చంప‌డం, అక్క‌డ నుంచి హీరో కుటుంబానికి, ఆ కుటుంబానికి ప‌గ మొదల‌వుతుంది. దీంతో హీరో అదే ఊరిలో ఉండ‌టం మంచిది కాద‌ని మ‌లేషియా పంపుతారు. ఈ గొడ‌వ‌ల‌తో సంబంధం లేని వ్య‌క్తిగా త‌న పేరును కూడా మార్చుకుని మ‌లేసియాలో ఉంటున్న హీరోకి అప్పుడే రాగిణి తో ప్రేమ పుడుతుంది. అయితే అనుకోని సంఘ‌ట‌న‌ల మ‌ధ్య వాళ్లిద్ద‌రూ విడిపోవాల్సి వ‌స్తుంది. వారు ఒక‌రికొక‌రు దూరంగా ఎందుకు ఉండాల్సి వ‌స్తుంది. చివ‌ర‌కు సాగ‌ర్.. రాగిణి ప్రేమ‌ను ఎలా పొందాడ‌న్న‌దే మిగ‌తా క‌థ‌.


పెద్ద పెద్ద హీరోలే కేవ‌లం యాక్ష‌న్ సినిమాల‌ను న‌మ్ముకుంటే బోల్తా ప‌డుతున్నారు. అలాంటిది కెరీర్ స్టార్టింగ్ లోనే సాగ‌ర్ యాక్ష‌న్ మూవీని ఒప్పుకోవ‌డం పెద్ద సాహ‌స‌మే. పోనీ అది వ‌ర్క‌వుట్ అయిందా అంటే ఏమీ లేదు. ఇదే స్టోరీతో ఇప్ప‌టికి చాలానే సినిమాలు వ‌చ్చాయి. న‌టన ప‌రంగా సాగ‌ర్ బాగానే చేశాడు.ఫ‌స్ట్ హాఫ్ లో అంతా సాగ‌ర్ చాలా బాగా చేశాడు. అంతే కాదు, హీరోయిన్ తో వ‌చ్చే ల‌వ్ ట్రాక్ లో మెరుగైన న‌ట‌న క‌న‌బ‌రిచాడు. కాక‌పోతే త‌న బాడీ లాంగ్వేజ్ సీరియ‌ల్ లో ఎలా ఉంటుందో అలానే చూపించారు. అది సాగ‌ర్ త‌ప్పు అని కూడా చెప్ప‌లేం. ఇక హీరోయిన్ల గురించి చెప్పాలంటే ఒక‌రికి ఇద్ద‌రు ఉన్నారు. కానీ ఏం లాభం. ఒక్క‌రి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాలేదు. అజ‌య్ ఈసారి కూడా త‌న న‌ట‌న‌తో మెప్పించాడు. మిగ‌తా పాత్ర‌ల్లో స‌న‌, స‌త్యం రాజేష్, కోటా శ్రీనివాస్, సుబ్బ‌రాజు త‌మ త‌మ పాత్ర‌ల ప‌రిధిలో చేశారు.


సినిమాలో చెప్పుకోద‌గ్గ ప్ల‌స్ అంటే సాగ‌ర్, అజ‌య్. థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులను చివ‌రి వ‌ర‌కు కూర్చోబెట్ట‌గ‌లిగారంటే కార‌ణం వీళ్లిద్ద‌రే. సెకండాఫ్ లో స‌త్యం రాజేష్ తో వ‌చ్చే సీన్స్ కొన్ని అక్క‌డ‌క్క‌డా న‌వ్వులు పూయించాయి.ఇంట‌ర్వెల్ సీన్ బాగుంటుంది. సినిమాలో డ్రా బాక్స్ గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి. ముందుగా ఒక మంచి న‌టుడైన సాగ‌ర్ ను ద‌ర్శ‌కుడు క‌రెక్ట్ గా వాడుకోలేక‌పోయాడు. ఫ‌స్టాఫ్ బాగా సాగిన త‌ర్వాత సెకండాఫ్ లో కావాల‌ని కొన్ని ట్రాక్స్ క్రియేట్ చేసి, ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షించాడు. క్లైమాక్స్ టైమ్ కి సినిమాను మ‌రీ సాగ‌దీశాడు. అస‌లు ఏం చెప్పాలనుకున్నాడో, సినిమాను ఎటు తీసుకెళ్లాడో కూడా అర్థం కాని ప‌రిస్థితి ని క్రియేట్ చేశాడు.

చిన్న సినిమా అయిన‌ప్ప‌టికీ ఖ‌ర్చు మాత్రం బాగానే పెట్టారు నిర్మాత‌లు. కానీ ఇలాంటి క‌థ లేని సినిమాల‌కు ద‌ర్శ‌కులు ఏం చెప్పి ప్రొడ్యూస‌ర్ ని ఒప్పిస్తారో అర్థం కావ‌ట్లేదు. పెట్టిన ప్ర‌తీ రూపాయి సినిమాలో స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. అంద‌మైన లొకేష‌న్ల‌ను బాగా చూపించ‌డంతో సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. సంగీతం ప‌ర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్న‌ప్ప‌టికీ, జెంటిల్ మెన్ సినిమా మ్యూజిక్ ని త‌ల‌పిస్తుంది. ఎడిటింగ్ ఓకే.


చివ‌ర‌గా, మొద‌ట్లో కొంచెం కొత్తగా, ఇంట్రెస్టింగ్ గా న‌డిపించిన‌ప్ప‌టికీ, సెకండాఫ్ లో బోరింగ్ స్క్రీన్ ప్లే తో, రొటీన్ క్లైమాక్స్ తో సిద్దార్థ ప్రేక్ష‌కుల‌కు అనుకున్నంత ఉత్సాహాన్ని ఇవ్వ‌లేక‌పోయాడు.


పంచ్ లైన్ః సాగ‌రంలోకి సిద్ధార్థ‌


Filmjalsa Rating: 2/5