Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

మ‌న ఊరి రామాయ‌ణం రివ్యూః ఇది మ‌నుషుల రామాయ‌ణంజయాపజయాలతో సంబంధం లేకుండా దర్శకుడిగా తన అభిరుచికి తగ్గట్లు సినిమాలు తీస్తూ వస్తున్నాడు ప్రకాష్ రాజ్. న‌టుడు ప్ర‌కాష్ రాజ్ ద‌ర్శ‌కుడిగా మారి చేసిన మ‌రో ప్ర‌య‌త్న‌మే మ‌న ఊరి రామాయ‌ణం. ఒక్కో సినిమాతో ఒక్కో సందేశాన్ని ఇవ్వాల‌నుకునే ప్ర‌కాష్ రాజ్ ఈ సినిమాతో ప్ర‌జ‌ల‌కు ఏం చెప్ప‌ద‌ల‌చుకున్నాడో చూద్దాం.
క‌థ విష‌యంలోకి వ‌స్తే, భుజంగయ్య (ప్రకాష్ రాజ్).. ఊర్లో పేరూ, పలుకుబడి ఉన్న ఓ పెద్ద మనిషి. తన కుటుంబంతో పాటు సమాజంలోనూ మంచి వ్యక్తిగా, పరువు ప్రతిష్టలతో జీవితం గడపాలన్నదే భుజంగయ్య కోరిక. అలాంటి మనిషి కుటుంబంతో చిన్న గొడవ పడి, ఆ కోపంలో ఒకరోజు ఓ వేశ్య (ప్రియమణి)తో సరదాగా గడపాలనుకుంటాడు. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల్లో భుజంగయ్య తన ఇంటిని ఆనుకొనే ఉండే ఓ చిన్న కొట్టులో ప్రియమణితో పాటు చిక్కుకుపోతాడు. ఆ తర్వాత తన పరువు పోకుండా, ఎవ్వరికీ ఈ విషయం తెలియకుండా భుజంగయ్య ఎలా బయటపడ్డాడు? ఈ మొత్తం తతంగంలో ఆయనలో వచ్చిన మార్పేంటీ అన్నదే సినిమా.
విభిన్న‌మైన సినిమాలను జ‌నాలు ఎప్ప‌టికీ ఆద‌రిస్తారు అన్న మాట వాస్త‌వం. ఆ సిద్దాంతాన్ని న‌మ్మే ప్ర‌కాష్ రాజ్ మ‌న ఊరి రామాయ‌ణం ను తెర‌కెక్కించాడు అని స్పష్టంగా అర్థ‌మ‌వుతుంది. సినిమాలో ఎప్ప‌టిలాగానే త‌న న‌ట‌న బాగుంది. దానికితోడు ఎంచుకున్న క‌థ కూడా సినిమాకు ప్ల‌స్ అయింది. అంద‌రి దృష్టిలా మంచి వ్య‌క్తిగా క‌న‌పించే వ్య‌క్తికి, రాక్ష‌సుడి త‌ర‌హాలో చెడు ఆలోచ‌న‌లు వ‌స్తే ఎలా ఉంటుందో అన్న ఆలోచ‌న‌ను క‌థగా మార్చి త‌న‌దైన శైలిలో ప్రేక్ష‌కుల‌కు ప్రెజెంట్ చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు ప్ర‌కాష్ రాజ్. కొన్ని ఎమోష‌న‌ల్ సీన్స్ ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తాయి.ఇక సిట్యుయేష‌న్ కి త‌గ్గ‌ట్టు వ‌చ్చే కామెడీ చాలా బాగుంది. కాక‌పోతే ఫ‌స్టాఫ్ అంతా చాలా స్లో గా సాగిన‌ట్లు, ఎంత‌కీ క‌థలోకి వెళ్ల‌క‌పోయేస‌రికి ప‌క్క‌దోవ ప‌ట్టిన‌ట్లు అనిపిస్తుంది. అయితే సినిమాలో ఎక్క‌డా క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ అనేవి క‌నిపించ‌వు. మ‌నవాళ్ల‌కు అవే కావాలి. సో ఆ విష‌యంలో కొంచెం జాగ్ర‌త్తలు తీసుకుని ఉంటే బాగుండేద‌నిపించింది.
ప్ర‌కాష్ రాజ్ మ‌రోసారి త‌న న‌ట‌న‌తో మ‌రో మెట్టు మెక్కాడు. చిన్న చిన్న ఎమోష‌న్స్ ను కూడా ఎక్క‌డా మిస్ అవ‌కుండా ప‌లికించాడు. క్లైమాక్స్ లో త‌న న‌ట‌న‌తో అంద‌రినీ క‌ట్టిప‌డేస్తాడు. ప్రియ‌మ‌ణి త‌న పాత్ర‌కు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. ప్రియ‌మ‌ణి, ప్ర‌కాష్ రాజ్ ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు దాదాపు సినిమాలో స‌గం భాగం వీరిద్ద‌రి మ‌ధ్యే న‌డుస్తుంది. అయినా ఎక్క‌డా బోర్ రాదు. స‌త్య‌దేవ్ ప్ర‌కాష్ రాజ్ కు ఆప్తుడిగా బాగా చేశాడు.ఇక ఎప్పుడూ కామెడీ పాత్ర‌ల‌తోనే మెప్పిస్తున్న పృథ్వీ ఇందులో ఓ సీరియ‌స్ రోల్ లో న‌టించి మంచి మార్కులే కొట్టేశాడు.
దర్శకుడిగా, నటుడిగా ప్రకాష్ రాజ్ తనది ప్రత్యేక శైలి అని మరోసారి నిరూపించుకున్నారు. ఒక నూలు పోగులాంటి కథాంశానికి.. మంచి ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే రాసుకొని రచయితగా ప్రకాష్ రాజ్ బాగా ఆకట్టుకున్నారు.కాక‌పోతే ఫ‌స్టాఫ్ లో కొంచెం లాగ్ అయిన‌ట్లు అనిపిస్తుంది. ఇళయరాజా బ్యాంక్‍గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కథలోని అసలైన ఎమోషన్ స్థాయిని పెంచేలా ఇళయరాజా అందించిన స్కోర్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ న్యాచురల్‌గా బాగుంది. ఎడిటింగ్ లో, ఫ‌స్టాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలకి కత్తెర పెడితే ఇంకా బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
చివ‌ర‌గా.. రెగ్యుల‌ర్ సినిమాల‌కు భిన్నంగా, డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో .. అది కూడా ఇలాంటి క‌థ‌తో కూడా సినిమా తీయొచ్చా అని అనుమానం క‌లిగే క‌థ‌తో కూడా సినిమా తీయాల‌ని ఆలోచ‌న వ‌చ్చినందుకే ప్ర‌కాష్ రాజ్ ను అభినందించాలి. వైవిధ్యమైన సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. అంతేకాదు.. కామెడీ, ఫ్యామీలీ సినిమాలు ఇష్టపడే వారు కూడా ఈ సినిమా ను ఎంజాయ్ చేయొచ్చు.

పంచ్ లైన్ః ఇది మ‌నుషుల రామాయ‌ణం

Filmjalsa Rating : 2.75/5