Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

జాగ్వార్ రివ్యూ- జాగ్వార్ రేస్ లో వెనుకంజ‌రాజ‌మౌళి ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైర‌క్ట‌ర్ గా ప‌నిచేసిన ద‌ర్శ‌కుడు, రాజ‌మౌళి సినిమాల‌కు క‌థ‌ల‌ను అందించే వ్య‌క్తే ఈ సినిమాకు కూడా క‌థ అందించ‌డం,ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతున్న న‌టీన‌టులు, స్టార్ క‌మిడియ‌న్, స్టార్ హీరోయిన్ తో ఐట‌మ్ సాంగ్.. మంచి మంచి లొకేష‌న్ల‌లో సాంగ్స్ షూట్, ఉన్న నాలుగు ఫైట్స్ లో ఒక్కో ఫైట్ కి ఒక్కో ఫైట్ మాస్ట‌ర్.. .. ఇలా ఖర్చుకి వెనకాడకుండా డబ్బుని నీళ్లు లా పోసుకుంటూ… మాజీ ప్రధాన మంత్రి హెచ్.డి. దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ సీఎం హెచ్.డి. కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ ఎంట్రీని గ్రాండ్ గా చేయటానికి ‘జాగ్వార్’ రూపంలో పన్నిన వ్యూహం మ‌హా అయితే, జనాల్ని థియోటర్ వరకూ రప్పించటంవరకూ అద్బుతంగా ప‌నిచేస్తుందేమో.. మ‌రి త‌ర్వాత థియేట‌ర్ లో వారిని ఎంట‌ర్ టైన్ చేయ‌డంలో వీరంతా విజ‌యం సాధించారా లేదా చూద్దాం..


ఎస్.ఎస్.కృష్ణ (నిఖిల్ కుమార్) మెడిసిన్ చదివే ఓ కుర్రాడు. తన చుట్టూ ఉండే అందరిలానే చదువుకుంటూ, సరదాగా కాలం వెళ్ళదీసే కృష్ణ, రాత్రి వేళల్లో ఓ టీవీ ఛాన‌ల్‍నే హ్యాక్ చేసి, మాస్క్ వేసుకొని పలు హత్యలు చేస్తూ అవి లైవ్‌లో వచ్చేలా చేస్తూంటాడు. ఈ లైవ్ హత్యలను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఆ కేసును డీల్ చేయడానికి ఓ సీబీఐ ఆఫీసర్‌ (జగపతి బాబు)ను నియమిస్తుంది. కృష్ణ ఇలా హత్యలు చేయడానికి గల కారణం ఏంటి? ఆ హత్యలన్నింటినీ లైవ్‌లో ఎందుకు ప్రదర్శిస్తూంటాడు? అస‌లు ఈ క‌థ‌కు రామ చంద్రయ్య (రావు రమేష్), ప్రియ (దీప్తి సతి), సుప్రీత్, సంపత్ ఎవరు? అన్న‌ది తెర‌మీదే చూడాలి.


అందరిలా రొటీన్ క‌థ కాకుండా కొంచెం డిఫ‌రెంట్ గా ఎంచుకుని, ఆ క‌థ‌కు అందరినీ ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట్ చేయడం సినిమాకు మంచి బ‌లాన్నిచ్చింది. సినిమా అంత‌టికీ రావు ర‌మేష్ ఎపిసోడ్ మేజ‌ర్ హైలైట్ గా చెప్పుకోవాలి. ఇంట‌ర్వెల్ లో అంద‌రూ అనుకునేలా కాకుండా వచ్చే ట్విస్ట్ బాగుంది. క్లైమాక్స్ లో ర‌మ్య‌కృష్ణ పాత్ర మెప్పిస్తుంది. మ‌ధ్య‌లో వచ్చే కార్ ఎపిసోడ్, రావు ర‌మేష్- సంప‌త్ ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు బాగున్నాయి.


మంచి స్టోరీ లైన్ ఉన్న‌ప్పుడు ద‌ర్శ‌కుడు స్క్రీన్ ప్లే ను డెవ‌ల‌ప్ చేసుకున్న‌ప్పుడే స‌క్సెస్ అవుతాడు. అలా కాకుండా పాత చింత‌కాయ ప‌చ్చ‌డినే మళ్లీ రుచి చూపిస్తానంటే ఎలా ఉంటుందో అలాగే అయింది ఇక్క‌డ కూడా. అన‌వ‌స‌రంగా పాట‌లు రావ‌డం, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ ఉందా అన్న‌ది వాళ్ల‌కే తెలియాలి మ‌రి. బ్ర‌హ్మానందంతో కామెడీ చేయించాల‌ని చూసినా, అస‌లు కుద‌ర‌లేదు. పైగా కేవ‌లం కామెడీ కోస‌మే బ్ర‌హ్మానందాన్ని పెట్టిన‌ట్లు సీన్స్ లో ఇరికించారు. అనాథ గా చెప్పుకునే హీరో ద‌గ్గ‌ర అంతంత విలువైన గ్యాడ్జెట్స్ ఎలా ఉంటాయో అర్థం కాదు. సో లాజిక్ అనే మాటకు సినిమాలో చోటే లేదు. త‌నేమ‌నుకుంటే అవి జ‌రిగిపోతే ఇక విల‌న్ ఎందుకు.. అలానే ఉంటుంది ఈ సినిమాలో విల‌న్ల ప‌రిస్థితి. అన్నీ హీరోకు స‌పోర్ట్ చేసేట్లే ఉండ‌టంతో కొంచెం ఓవ‌ర్ గా అనిపిస్తుంది. ఏదో మొద‌ట్లో కొంచెం ఎమోష‌న్ తో క‌ట్టిప‌డేశారు క‌దా.. మొద‌ట్లోనే ఇలాంటి స‌న్నివేశం ఉందంటే సినిమా మొత్తంలో ఇంకెన్ని ఉన్నాయో అనుకుని పాపం థియేట‌ర్లోనే ఉండే ప్రేక్ష‌కుల‌కు నాలుగు పాట‌లు, రెండు ఫైట్లు, కూసింత నిరాశ త‌ప్ప ఏం చూడ‌లేడు. సినిమా అంతా అర్థం లేని స‌న్నివేశాల‌తో చికాకు క‌లిగిస్తుంది.


ఇక న‌ట‌న విష‌యానికొస్తే, మొద‌టి సినిమాతో నిఖిల్ గౌడ్ ప్రేక్ష‌కుల్లో త‌న ముద్ర వేయాల్సింది పోయి, వ‌స్తాడు ఫైట్ చేస్తాడు, లేదంటే ఒక పాటేసుకుంటాడు. వెళ్తాడు.. అదేంటి కుమార స్వామి త‌న కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తా అన్న‌ది హీరో గా క‌దా.. ఒక ఫైట‌ర్ గా కాదు కదా అన్న డౌట్ రాక‌మాన‌దు. హీరో అంటే యాక్టింగ్ ఉండాలి క‌దా అది ఇక్క‌డ లేదు. న‌టుడిగా త‌ను చాలా క‌ష్ట‌ప‌డితే కానీ త‌నను న‌టుడిగా ప్రేక్ష‌కులు అంగీక‌రించ‌లేరు. హీరోయిన్ దీప్తి స‌తి ఏదో చేసింది. ఇక సినిమాకు ప్రాణం పోసిన వ్య‌క్తి రావు ర‌మేష్. త‌న స‌హ‌జ‌మైన‌ న‌ట‌న‌తో రావు ర‌మేష్ ప్ర‌జ‌ల‌కు సేవ చేసే వైద్యుడిగా, సాటి మ‌నిషి క‌ష్టాల‌ను అర్థం చేసుకునే వ్య‌క్తిత్వం గ‌ల వాడిగా బాగా మెప్పించాడు. క్లైమాక్స్ లో వ‌చ్చిన ర‌మ్య‌కృష్ణ క్యారెక్ట‌ర్ ఆ సీన్స్ కు బ‌లాన్ని చేకూర్చింది. సీబీఐ ఆఫీస‌ర్ గా జ‌గ‌ప‌తి బాబు త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. కానీ అస‌లు ఆ పాత్ర వ‌ల్ల సినిమాకు ఒరిగింది కానీ, ఈ సినిమాతో జ‌గ‌ప‌తి బాబు కు ఒరిగేది కానీ ఏం ఉండ‌దు. ఎప్పుడూ నెగిటివ్ రోల్స్ చేసే ఆద‌ర్శ్ బాల‌కృష్ణ ఈ సినిమాలో పాజిటివ్ రోల్ చేసి, న్యాయం వైపు నిలబ‌డే వ్య‌క్తిగా, విద్యార్థులంద‌రికీ కాలేజ్ ప్రెసిడెంట్ గా మెప్పించాడు. ఇక విల‌న్స్ అయిన సంప‌త్, ఆదిత్య మీన‌న్ లు వాళ్లకు స్కోప్ ఉన్నంత వర‌కు బాగా చేశారు. మిగ‌తా వాళ్లు త‌మ త‌మ పాత్ర‌ల ప‌రిధిలో బానే చేశారు.


ఒక మంచి ఎమోష‌న‌ల్ క‌థ కు మ‌హ‌దేవ్ రాసుకున్న స్క్రీన్ ప్లే తోనే డైర‌క్ట‌ర్ గా ఫెయిల్ అయ్యాడు. అన‌వ‌స‌ర‌మైన సీన్స్ ను సినిమాలో ఇరికించి ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షించాడు. ఒక రకంగా చెప్పాలంటే మంచి క‌థ‌ను పాడు చేశాడు. అదే గొప్ప ప్ర‌తిభ క‌ల‌వాడైతే ఇదే స్టోరీని ఒక మంచి క‌మ‌ర్షియ‌ల్ సినిమాగా మ‌ల‌చ‌గ‌ల‌డు. సినిమాటోగ్ర‌ఫీ విష‌యానికొస్తే ప్ర‌తీ ఫ్రేమ్, రిచ్ గా ప్రెజెంట్ చేశాడు మ‌నోజ్ ప‌ర‌మ‌హంస‌. ప్ర‌తీ విజువ‌ల్ లో త‌న కెమెరా ప‌నితీరు అర్థ‌మ‌వుతుంది. ఎడిటింగ్ ప‌ర్వాలేదు. ఇక థ‌మ‌న్ అందించిన సంగీతం ఎప్ప‌టిలానే అన్నీ విన్న‌ట్లుగానే ఉంటాయి. కాక‌పోతే ఈసారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఇవ్వ‌లేక‌పోయాడు థ‌మ‌న్. సినిమాలో వ‌చ్చే యాక్ష‌న్ సీన్స్ అన్నీ బావుంటాయి. నిర్మాణ విలువ‌లు గురించే మాట్లాడ‌టానికేముంది. 75 కోట్లు అంటే మాటలు కాదు. ప్ర‌తీ విజువ‌ల్ చూస్తున్నంత సేపు డ‌బ్బులే క‌నిపిస్తాయి.


పోతే సినిమాలో వ‌చ్చే.. ”నేను ఒక మెట్టు ఎక్క‌డం కోసం ప‌ది మందికి మొక్క‌డానికైనా, 100మందిని తొక్క‌డానికైనా రెడీ..”
”జ‌నాల‌కు ఎంట‌ర్ టైన్ మెంటే కావాలి న్యూస్ కాదు అని సంప‌త్ అనే మాట‌కు నీలాంటి వాళ్లు నిజాల‌కు మాస్ మ‌సాలా ల‌ను యాడ్ చేసి చెప్తుంటే జ‌నాలే రిపోర్టర్స్  అయి మాట్లాడుతున్నారు..” అని జ‌గ‌ప‌తి బాబు దానికి బదులు చెప్ప‌డం లాంటి కొన్ని డైలాగ్స్ బాగున్నాయి.


సినిమాకు అన్ని హంగులూ సమకూర్చుకున్నా..వాటికి బేస్ గా నిలబడే క‌థ‌నం మాత్రం సరిగ్గా కూర్చుకోకపోవటంతో చివ‌ర‌కు సినిమా సోసో గా…లేదు అని ఓపిక తో చూసిన ప్రేక్ష‌కులు ద‌య చూపితే ఫ‌ర్లేదు అన్నట్లు తయారైంది.


పంచ్ లైన్ : జాగ్వార్ – రేస్ లో వెనుకంజ‌


Filmjalsa Rating : 2.5/5