”క‌నుపాప” మూవీ రివ్యూమలయాళంలో అద్భుత విజయం సాధించిన ‘ఒప్పమ్‌’ సినిమా, తెలుగులో ‘కనుపాప’ పేరుతో అనువాదమైంది. మోహన్‌లాల్‌, బేబీ మీనాక్షి, విమలా రామన్, సముద్ర ఖణి ప్రధాన పాత్రలు పోషించగా దర్శకుడు ప్రియదర్శన్ ఈ సినిమాని తెరకెక్కించాడు. ఎన్నో చిత్రాల్లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ స్వయంగా నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. అయితే ఫిల్మ్ జల్సా తన వ్యూయ‌ర్స్ కోసం ఒక్క రోజు ముందే ఈ సినిమా రివ్యూ ని అందిస్తుంది. మరి ఈ సినిమా రిజల్ట్ తెలియాలంటే ముందుగా ఈ సినిమా కధ తెలుసుకోవాల్సిందే .


క‌థ‌లోకి వెళితే..


పుట్టు గుడ్డి వాడైనా రాము ( మోహన్ లాల్ ) ఒక అపార్ట్ మెంట్ లో వాచ్ మెన్ గా పని చేస్తుంటాడు. తన తెలివి తేటలతో , తన మంచి తనంతో రాము అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకొని వాళ్లలో ఒకడిగా కలిసిపోతాడు. అందరి కన్నా ముఖ్యంగా ఆ అపార్ట్ మెంట్ లో నివసించే రిటైర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ రాముని బాగా నమ్ముతాడు . తన బంధువులతో కూడా చెప్పుకోలేని విషయాలన్నీ రాముతో చెప్పుకుంటూ ఉంటాడు. అలా ఒకరోజు తనని వాసు అనే వ్యక్తి చంపేయబోతున్నాడు అని , ఊటీలో తన కూతురుగా పెరుగుతున్న పాప అకౌంట్ లో కొంత డబ్బు వేయాలని బ్యాంక్ అకౌంట్ నుండి 50 లక్షలు డ్రా చేస్తాడు. అయితే ఆ రోజు రాత్రే వాసు , జడ్జ్ ని చంపేస్తాడు. అనుకోని పరిస్థితుల్లో ఆ హత్య కేసు రాము మెడకి చుట్టుకుంటుంది. మరోవైపు జడ్జ్ కూతురుగా చెప్పబడుతున్న ఆ పాపని కూడా వాసు చంపేయాలని నిర్ణయించుకుంటాడు. గుడ్డివాడైన రాము ఆ పాప ని ఎలా అయినా వాసు నుండి కాపాడాలని నిర్ణయించుకుంటాడు. మరి రాము ఆ హత్య కేసు నుండి బయటపడతాడా ? ఆ పాప ని వాసు చంపకుండా కాపాడగ‌లిగాడా? అసలు ఆ పాప నిజంగా ఆ జడ్జ్ కూతురేనా ? ఆ జడ్జ్ కి వాసుకి ఉన్న వైరం ఏమిటి ? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు అన్నీ కధనాన్ని ఇంట్రెస్టింగ్ గా ముందుకు నడుపుతాయి.


నటీ నటుల పనితీరు..


ముందుగా ఈ సినిమాలో నటీ నటుల నటన గురించి చెప్పుకోవాల్సి వస్తే ముందుగా మోహన్ లాల్ గురించే చెప్పుకోవాలి . పుట్టు గుడ్డివాని గా మోహన్ లాల్ ఈ సినిమాలో అసమాన రీతిలో రెచ్చిపోయి నటించాడు అనే చెప్పుకోవాలి. సినిమాలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నా, ప్రతి క్యారెక్టర్ జర్నీ, మోహన్ లాల్ పోషించిన రాము పాత్ర చుట్టే తిరుగుతూ ఉంటుంది. అలా సినిమా ఆసాంతం అంత అద్భుతంగా నటించి, ప్రేక్షకులను మెప్పించడం నిజంగా అద్భుతం . ముఖ్యంగా టైట్ క్లోజ్ షాట్స్ లో గుడ్డివానిగా ఒక్కో దగ్గర మోహన్ లాల్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ సూపర్బ్ . ఇక సినిమాలో మరో ముఖ్య పాత్రని బేబీ మీనాక్షి పోషించి, తన అమాయకపు నటనతో అద్భుతంగా ఆకట్టుకుంది. ఇక కెరీర్ లో మొదటి సారి నెగిటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన సముద్ర ఖణి విలన్ గా సూపర్ సక్సస్ అయ్యాడు అనే చెప్పుకోవాలి.


సాంకేతిక వర్గం..


 ఇలాంటి క్రైమ్ సస్పెన్స్ సినిమాలకి ప్రధానంగా బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉండాలి. అయితే ఇక్కడ దర్శకుడు కధని చాలా రియలిస్టిక్ నెరేట్ చేయడంతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొంత వరకు డల్ అయినా , అదేమీ సినిమాకి పెద్దగా నష్టం కలిగించలేదు అని చెప్పుకోవాలి. ఇక ఈ చిత్రంలో ఉన్నవి మూడు పాటలే అయినా అవి ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాయి. ఏకాంబరం కెమెరా వర్క్ ని ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే . నిర్మాతగా మోహన్ లాల్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదనే చెప్పుకోవాలి . ఎడిటింగ్ బాగుంది. చివరగా ఇలాంటి ఒక చిన్న పాయింట్ ని కధగా తీసుకొని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సినిమాని నడిపిన దర్శకుడు ప్రియదర్శన్ ని మెచ్చుకొని తీరాల్సిందే .


ప్ల‌స్ పాయింట్స్..


1) ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే


2) మోహన్ లాల్, సముద్ర ఖణి నటన


3) సెకండాఫ్


మైనస్ పాయింట్స్ :


1) ఫస్టాఫ్ స్లో నేరేషన్


2) బ్యాగ్రౌండ్ స్కోర్


3) క్లైమాక్స్


4) టైటిల్


చివరి మాట..


తెలుగులో ఒక స్టార్ హీరో ఇలాంటి సినిమాలో నటించడం ఎప్పటికీ అసాధ్యం . కాబట్టి మన స్ట్రైట్ తెలుగు సినిమా కాదులే అని కనుపాప సినిమాని మిస్ అవ్వకండి .


పంచ్ లైన్..


నిజమే కనుపాప డబ్బింగ్ సినిమానే, కానీ తెలుగు దర్శక నిర్మాతలకి కనువిప్పు కలిగించే సినిమా. 


ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ : 3/5