ఎస్-3 మూవీ రివ్యూ, రేటింగ్దర్శకుడు హరి, హీరో సూర్య ల సింగం సీరిస్ సినిమాల్లో భాగంగా తెరకెక్కిన సినిమా సింగం 3. ఇప్ప‌టికే చాలా సార్లు వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ వారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది . సూర్య సూపర్ యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు, అనుష్క, శృతిహాసన్ ల అందాల విందుతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకోగలుగుతుందో ఇప్పుడు చూద్దాం.

కథ‌లోకి వెళితే..
ముందుగా ఈ సినిమా క‌థ‌ విషయానికి వస్తే.. న్యాయానికి మారు పేరైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీస్ ఆఫీసర్ నరసింహ (సూర్య)ను కర్ణాటక హోమ్ మంత్రి (శరత్ బాబు) ప్రత్యేకంగా ఒక కేసు విషయమై మంగళూరుకు రప్పిస్తాడు. ఒక కమీషనర్ హత్యకు సంబంధించిన కేసును నరసింహకు అప్పగిస్తారు. నరసింహం ఆ కేసును చాలా తెలివిగా ఇన్వెస్టిగేషన్ చేసి హంతకులను తొందరగానే పట్టుకుంటాడు. అయితే ఆ కేసు వెనుక చాలా స్టోరీ ఉందని, విఠల్ (అనూప్ సింగ్) అనే ఓ పెద్ద బిజినెస్ పర్సన్ ఈ హత్య వెనుక ఉన్నాడని తెలుసుకుంటాడు.దాంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్న నరసింహం ఏం చేశాడు? ఆస్ట్రేలియాలో ఉండే విఠల్‍పై ఎలా ఫైట్ చేశాడు ? కమీషనర్ హత్య వెనుక ఉన్న రహస్యమేంటి ? ఈ కథలో అగ్ని (శృతి హాసన్) ఎవరు? నరసింహ, తన భార్య కావ్య (అనుష్క)కు దూరంగా ఉన్నట్లు ఎందుకు నటిస్తాడు? అన్నది మిగతా స్టోరీ.

నటీ నటుల పనితనం..
నటీ నటుల విషయానికి వస్తే ఈ సినిమాలో సూర్య నటన చూసిన వారెవరైనా అతని నటనకి, ఎనర్జీకి హేట్సప్ చెప్పి తీరుతారు. ముఖ్యంగా కధలో అసలు పాయింట్ రివీల్ అయిన దగ్గర నుండి సూర్య సూపర్ ఎనర్జీ నే సినిమాని ముందుకి నడిపిస్తుంది. ఇక యాక్షన్ సీక్వెన్స్ ల్లో అయితే సూర్య ఇంటెన్సిటీ నిజంగా అద్భుతం అనే చెప్పుకోవాలి . సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ నరసింహ గా మొదటి రెండు భాగాల్లో సూపర్ సక్సస్ అయిన సూర్య , ఈ చిత్రంలో అంతకు మించి స‌క్సెస్ అయ్యాడు అని చెప్పుకోవచ్చు. ఇక కావ్య గా అనుష్క నటన పరంగా ఓకే అనిపించినా , అందం విషయంలో కాస్త మందంగా తయారవడం ప్రేక్షకులను కాస్త నిరుత్సాహానికి గురవుతార‌నే చెప్పుకోవాలి. అయితే ఆ లోటును పూడుస్తూ, జర్నలిస్ట్ గా శృతి ఈ సినిమాలో రెచ్చిపోయింది అనే చెప్పుకోవాలి. ఒక వైపు అద్భుతమైన నటనని ప్రదర్శిస్తూనే మరోవైపు శృతి చేసిన అందాల విందు అంతా ఇంతా కాదు. ఇక మిగతా నటీ నటులు అంతా తమ తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు..
సాంకేతికంగా చూస్తే సింగం 3లో సినిమాటోగ్ర‌ఫీకి మంచి మార్కులు వేయాలి. సినిమాకు ఖ‌ర్చు పెట్టిన ప్ర‌తి రూపాయి చాలా గ్రాండ్‌గా, రిచ్‌గా తెర‌పై క‌న‌ప‌డేలా చేయ‌డంలో సినిమాటోగ్ర‌ఫీ వ‌ర్క్ సూప‌ర్బ్‌. ఫైట్స్ కంపోజింగ్‌కు హ్యాట్సాఫ్‌. యాక్ష‌న్ సీన్లు దుమ్మురేగిపోయి సినిమా స్థాయిని పెంచాయి. హ‌రీష్ జైరాజ్ పాట‌లు యావ‌రేజ్‌. ఆర్ ఆర్ మాత్రం అదిరిపోయింది. ఎడిటింగ్ బిలో యావ‌రేజ్‌ అని చెప్పుకోవచ్చు. కొన్ని సీన్లు ట్రిమ్ చేసి ఉంటే ఇంకా మంచి అవుట్ ఫుట్ వచ్చి ఉండేది . ఇక తొలి రెండు సినిమాల్లో కామెడీ, ఎమోష‌న‌ల్‌తో పాటు యాక్ష‌న్‌కు ఎక్కువ ప్రేయారిటీ ఇచ్చిన హరి, ఈ సినిమాలో ఎమోష‌న‌ల్ స్థాయి తగ్గించి పెద్ద తప్పే చేశాడు అని చెప్పుకోవచ్చు. అయితే ఒక్క యాక్షన్ సీక్వెన్స్ ల్లో మాత్రం హరి దర్శకత్వ ప్రతిభ అద్భుతం అని చెప్పుకోవాల్సిందే . ఆ విధంగా చూసుకుంటే సింగం 3 ని తెరకెక్కించడంలో దర్శకుడిగా హరి సక్సస్ అయ్యాడు అనే చెప్పుకోవచ్చు.

పాజిటివ్ పాయింట్స్ః
సూర్య నటన, సూర్య ఎనర్జీ లెవల్స్

శృతిహాసన్

యాక్షన్ సీక్వెన్సెస్

హరి టేకింగ్

హ‌రీష్ జైరాజ్ ఆర్ . ఆర్

నెగిటివ్ పాయింట్స్ః

రొటీన్ క‌థ‌

కామెడీ లేక‌పోవ‌డం

ఎక్క‌డా సెంటిమెంట్ లేక‌పోవ‌డం

మ్యూజిక్

అనుష్క “మందం”

చివ‌ర‌గా..

నిజానికి సూపర్ హిట్ అయిన సినిమాకి సీక్వెల్ చేయడం అంటే నిజంగా సాహసం అని చెప్పుకోవాలి. అయితే ఇది సింగం సిరీస్ లో 3 వ భాగం . ఇంత రిస్క్ తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించినందుకు దర్శకుడు హరి ని మెచ్చుకొని తీరాల్సిందే. అయితే ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కోసం ఒక చిన్న పాయింట్ ని క‌థా వస్తువుగా తీసుకొని హరి తన మొదటి స్టెప్ నే రాంగ్ స్టెప్ గా వేశాడు అని చెప్పుకోవచ్చు. అయితే తన దర్శకత్వ ప్రతిభ తో ఆ లోటుని చాలా వరకు కవర్ చేసినా ,క‌థ‌లో ఉన్న లోపాలు అక్కడక్కడా ప్రేక్షకుడికి తెలుస్తూనే ఉంటాయి. సో ఈ సినిమాకి కథ‌ గాని, ఇంకొంచెం బాగుండి ఉంటే, సూర్య కష్టానికి ఇంత కన్నా గొప్ప ఫలితం దక్కేది .

పంచ్ లైన్ : సింహం వేట కొనసాగించింది .” బట్ కాస్త లిమిటెడ్ గా “

ఫిల్మ్‌జ‌ల్సా రేటింగ్ : 2.5/5