Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

ఎమ్ ఎస్ ధోనీ రివ్యూ : Ms ధోని- ద రియ‌ల్‌ హీరో స్టోరీటీం ఇండియాకు క్రికెటర్, వికెట్ కీప‌ర్, కెప్టెన్ కూల్ గా పేరొందిన ఎంఎస్ ధోనీ, ఇండియాకు ఎన్నో విజ‌యాల‌ను అందించ‌డంతో పాటూ, 28ఏళ్ల ప్ర‌పంచ క‌ప్ క‌ల‌ను కూడా సాకారం చేసిన రియ‌ల్ లైఫ్ హీరో. ధోనీ జీవిత కథ ఆధారంగా సుశాంత్ సింగ్ రాజ్ పూత్ హీరోగా తెరకెక్కిన చిత్రం ”MS ధోని.. ది అన్‌టోల్డ్ స్టోరీ”. స్పెషల్ చబ్బీస్ , రుస్తుం, బేబీ వంటి సినిమాల తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నీరజ్ పాండే ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, సుశాంత్ స‌ర‌స‌న దిశా ప‌టానీ న‌టించింది. అమాల్ మల్లిక్ , రోచక్ కోహ్లీ మ్యూజిక్ అందిస్తుండగా అరుణ్ పాండే, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన‌ ఈ చిత్రం భారీ అంచ‌నాల మ‌ధ్య ఈరోజే ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు వచ్చిన జీవిత చ‌రిత్ర‌లు అన్నీ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాల‌నే సాధించాయి. మ‌రి ఎం.ఎస్ ధోనీ బ‌యోపిక్ కూడా ఆ కోవ‌లోకి చేరుతుందా లేదా అన్న‌ది చూద్దాం.
ఇక క‌థ విష‌యానికొస్తే క‌థంతా ధోనీ వ్య‌క్తిగ‌త జీవితం, ప్రొఫెష‌న‌ల్ లైఫ్ గురించే ఉంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌నాల‌కు తెలియ‌ని కొత్త విష‌యాల‌ను నీర‌జ్ పాండే ఈ సినిమా ద్వారా చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. అస‌లు ధోనీ క్రికెట‌ర్ అవ్వ‌క‌ముందు ఏం చేసేవాడు..త‌న‌లో అస‌లు ఒక క్రికెట‌ర్ దాగి ఉన్నాడ‌ని మొద‌ట ఎవ‌రు గుర్తించారు.. ఆ త‌ర్వాత త‌ను క్రికెట‌ర్ ఎలా అయ్యాడు. ఇండియా క్రికెట్ టీమ్ లో ప్లేస్ ఎలా సంపాధించాడు.. క్రికెట‌ర్ అయ్యాక కెప్టెన్ గా ఎలా ఎదిగాడు.. ప్ర‌పంచ క‌ప్ నెగ్గుకురావ‌డానికి త‌ను ప‌న్నిన వ్యూహాలేంటి ఇలా ఒక‌టేంటి అన్నీ యాంగిల్స్ లోనూ ధోనీ ప‌ర్స‌న‌ల్ లైఫ్ ను అంద‌రికీ తెలియ‌ప‌ర‌చ‌డ‌మే క‌థ‌.
సినిమా గురించి చెప్పాలంటే మొత్తం మ‌హేంద్ర సింగ్ ధోనీ గురించే. ఇప్ప‌టి వ‌ర‌కు జీవిత చరిత్ర‌ల ఆధారంగా వ‌చ్చిన సినిమాల లాగానే ఈ సినిమాను కూడా ద‌ర్శ‌కుడు నీర‌జ్ పాండే ఎంతో చ‌క్క‌గా, అన్నీ ఎమోష‌న్స్ కు క్యారీ చేస్తూ బాగా తెర‌కెక్కించాడు. త‌ను చిన్న‌ప్ప‌టి నుంచి వ‌ర‌ల్డ్ క‌ప్ సాధించే వ‌ర‌కు ధోనీ ప‌న్నిన వ్యూహాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు ఎంతో స‌హ‌జంగా చూపించాడు. హీరోగా సుశాంత్ రాజ్ పూత్ మంచి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. ధోనీ పాత్ర‌లో అచ్చం ధోనీని మైమ‌రపించే విధంగా జీవించేశాడు. బ‌హుశా త‌న ప్లేస్ లో వేరే హీరోని తీసుకుని ఉంటే సినిమా అవుట్ పుట్ ఇలా ఉండేది కాదేమో.ఎప్పుడూ కొడుకు జీవితం గురించి ఆలోచించే పాత్ర‌లో అనుప‌మ్ ఖేర్ త‌న స‌హ‌జ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాడు.
సినిమా ఫ‌స్టాఫ్ అంతా ధోనీ ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించే ఉంటుంది. అంటే క్రికెట‌ర్ కాక‌ముందు ధోనీ వ్య‌క్తిగ‌త జీవితం గురించి. అస‌లు ఇండియ‌న్ క్రికెట్ టీమ్ లోకి రావ‌డానికి త‌ను ప‌డిన క‌ష్టాలు, ఇబ్బందులు.. ఆద్యంతం క‌ట్టిప‌డేసేలా తెర‌కెక్కించాడు డైర‌క్ట‌ర్. ఇక హీరో, హీరోయిన్ల మ‌ధ్య న‌డిచే ల‌వ్ ట్రాక్ ఒక మంచి ఫీల్ ను ఇస్తుంది. ధోనీ జీవితంలోని కొన్ని సున్నిత‌మైన విష‌యాల‌ను, ఎలాంటి అంశాలు ఇబ్బందిగా ఉండేవో వాటిని ఎంతో చ‌క్క‌గా చూపించ‌గ‌లిగాడు. ఇక సెకండాఫ్ అంతా ధోనీ సాధించిన విజ‌యాలు, ఘ‌న‌త‌లు ఇలా వీటితోనే స‌రిపోతుంది. క్లైమాక్స్ లో వ‌చ్చే 2011 వ‌ర‌ల్డ్ క‌ప్ గేమ్ ను నీర‌జ్ పాండే ఎంతో చాక‌చక్యంగా తెర‌కెక్కించ‌గ‌లిగాడు. ఎక్క‌డా మ‌నం సినిమా చూస్తున్నాం అన్న భావ‌న క‌ల‌గ‌కుండా, ఇండియానే గేమ్ ఆడుతుంది అన్నంతగా ద‌ర్శ‌కుడు ప్రేక్ష‌కుల‌ను హిప్న‌టైజ్ చేశాడు. క్లైమాక్స్ లో సుశాంత్ న‌ట‌న చూస్తే, కాసేపు ధోనీనే వ‌చ్చి ఆడుతున్నాడా అన్న అనుమానం కూడా వ‌స్తుంది.
ధోని గా సుశాంత్ మంచి నటన కనపరిచాడు.. ముఖ్యం గా క్రికెట్ ఆడే సీన్స్ లలో నిజంగా ధోని నే చూస్తున్నామా అనిపించింది.. ధోని వయసు మారుతున్న కొద్దీ తన బాడీ లాంగ్వేజ్ ని మార్చుకుని సుశాంత్ నటిస్తూ ప్రేక్షకులని మరింత అలరించాడు.. త‌న వాకింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ అన్నీ అచ్చు ధోనీని గుర్తుకు తెస్తాయి. చిన్న చిన్న ఎమోష‌న్స్ ను సైతం త‌న ముఖంలో ప‌లికించి, సినిమాను త‌న భుజాల‌పై న‌డిపించాడు. ధోనీ గ‌ర్ల్ ఫ్రెండ్ గా దిశా పటాని బాగా చేసింది. ధోని తండ్రిగా అనుపమ్ ఖేర్, ధోనీ సిస్టర్ గా భూమిక త‌మ న‌ట‌న‌తో సినిమాను మ‌రో మెట్టు ఎక్కించారు. సినిమాలో ఏవైనా డ్రా బ్యాక్స్ ఉన్నాయా అంటే, అది సినిమా ర‌న్ టైమ్.. చాలా లెంగ్తీ గా ఉండ‌టం, దానికి తోడు కొంచెం స్లో నెరేష‌న్ తో సినిమా భాగాలు భాగాలుగా అనిపిస్తుంది.
టెక్నిక‌ల్ ప‌రంగా, సినిమాటోగ్ర‌ఫీ ఈ సినిమాకు మేజ‌ర్ హైలెట్. ప్ర‌తీ ఫ్రేమ ఎంతో గ్రాండ్ గా, రిచ్ గా ప్రెజెంట్ చేశాడు. సంగీతం బాగుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్ష‌కుల్లో మంచి ఫీల్ ను కలిగిస్తుంది. ఎడిటింగ్ బాగా ఉంది. ప్రొడ‌క్ష‌న్ విలువ‌ల గురించి ఎక్క‌డా వంక పెట్ట‌డానికి లేదు. ఇక నీర‌జ్ పాండే గురించి ముందుగా చెప్పుకున్న‌ట్లే మూడు సినిమాల‌తోనే తనేంటో ప్రూవ్ చేసుకున్న నీర‌జ్, ధోనీ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఎవ్వ‌రికీ తెలియ‌ని కోణంలో ధోనీ గురించి త‌ను చెప్పాల‌నుకున్న‌వి చెప్ప‌టంలో స‌క్సెస్ అయ్యాడు.
చివ‌ర‌గా.. ఒక గొప్ప జీవిత చ‌రిత్ర ను ప్రేక్ష‌కుల‌కు తెలియ‌చెప్పాల‌నుకున్న నీర‌జ్ పాండే, సుశాంత్ రాజ్ పూత్ ద్వారా దాన్ని చేర‌వేశాడు.

పంచ్ లైన్ః MS ధోని- ద రియ‌ల్‌హీరో స్టోరీ

 

Filmjalsa Rating : 3.25/5