Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా రివ్యూ, రేటింగ్ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో, డిఫ‌రెంట్ స్క్రీన్ ప్లే తో అల‌రిస్తున్న హీరో నిఖిల్, ఈసారి ”ఎక్క‌డ‌కు పోతావు చిన్న‌వాడా..” అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. టైగ‌ర్ సినిమాతో సినీ ప‌రిశ్ర‌మకు ప‌రిచ‌య‌మైన వి.ఐ ఆనంద్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. సినిమా టైటిల్ ఫిక్స్ చేసిన ద‌గ్గ‌ర‌నుంచి, ఫ‌స్ట్ లుక్, ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్, థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ వ‌ర‌కు ప్ర‌తీదీ ప్రేక్ష‌కులలో మరింత ఆస‌క్తిని క‌లిగించ‌డంతో పాటూ, ప్ర‌తీ ఒక్కరిలో అంచ‌నాలను పెంచాయి. కుమారి21ఎఫ్ సినిమాతో కుర్ర‌కారు మ‌న‌సును దోచుకున్న హెబాప‌టేల్, నందిత శ్వేత లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకుందో లేదో చూద్దాం..


త‌న ఫ్రెండ్ (వెన్నెల కిషోర్) ట్రీట్ మెంట్ కోసం కేర‌ళ వెళ్లిన (నిఖిల్) అక్క‌డ హెబాప‌టేల్ ను చూసి ఇష్ట‌పడ‌తాడు. కానీ త‌ను ఇష్ట‌ప‌డింది ఒక ఆత్మ‌న‌ని తెలుసుకుని షాక్ లో ఉండ‌గానే త‌ను ప్రేమించిన అమ్మాయి ఆత్మ అర్జున్ ని వెతుక్కుంటూ వ‌స్తుంది. అస‌లు ఆ అమ్మాయి ఎలా చ‌నిపోతుంది? ఎందుకు ఆత్మ అవుతుంది? ఆత్మ అయిన త‌ర్వాత కూడా అర్జున్ ను ఎందుకు వెంటాడుతుంది? అర్జున్ చివ‌ర‌కు ఎవ‌రికి ద‌గ్గ‌ర‌వుతాడు అనేది అస‌లు క‌థ‌.


ఎప్ప‌టిక‌ప్పుడు భిన్న‌మైన‌ క‌థ‌ల‌ను ఎంచుకుంటూ, త‌న‌దైన శైలిలో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకోవ‌డంలో నిఖిల్ ఎప్పుడూ ముందే ఉంటాడు. ముందుగా ఈ క‌థ‌ను ఎంచుకోవ‌డంలోనే నిఖిల్ టాలెంట్ ఏంటో అర్థ‌మైపోతుంది. ఇక త‌న న‌ట‌న ఎప్ప‌టిలాగానే బాగుంది. అటు కామెడీ టైమింగ్ కానీ, ఇటు థ్రిల్ల‌ర్ సీన్స్ లో కానీ త‌న న‌ట‌న బాగుంది. నందిత శ్వేత. అటు దెయ్యం గానూ, ఇటు మామూలు అమ్మాయిగానూ త‌న న‌ట‌న‌తో ఆకట్టుకుంది. ప్ర‌తీ చిన్న భావాన్ని త‌న ముఖంలో చూపించి, మంచి న‌ట‌న‌ను క‌న‌బ‌రించి, టాలీవుడ్ లోకి మంచి ఎంట్రీని ఇచ్చింది. హెబాప‌టేల్ ఎప్ప‌టిలాగానే బ‌బ్లీగా, ఛార్మింగ్ గా బాగా చేసింది. మిగిలిన వాళ్ల‌లో ఖ‌చ్చితంగా ఇద్ద‌రి గురించి చెప్పుకోవాలి వెన్నెల కిషోర్, స‌త్య‌. ఫ‌స్టాఫ్ అంతా వెన్నెల కిషోర్, సెకండాఫ్ లో స‌త్య క‌డుపుబ్బా న‌వ్వించారు. వైవా హ‌ర్ష కామెడీ బాగుంది. త‌నికెళ్ల భ‌ర‌ణి, తాగుబోతు ర‌మేష్, జోష్ ర‌వి, సుద‌ర్శ‌న్,భ‌ద్ర‌మ్, అపూర్వ శ్రీనివాస్ త‌మ త‌మ పాత్ర‌ల మేర చేశారు.


మంచి క‌థ‌ను ఎంచుకున్న ద‌ర్శ‌కుడు వి.ఐ ఆనంద్ కు ఎలా మొద‌లు పెట్టాలి అనేది తెలియక.. ఫ‌స్టాఫ్ లో 20నిమిషాల పాటూ స‌మ‌యాన్ని వృధా చేశాడు. అక్క‌డి నుంచి వెన్నెల కిషోర్ కామెడీ, అస‌లు క‌థ మొద‌లై సినిమాను ఇంట‌ర్వెల్ స‌మ‌యానికి ఆస‌క్తిగా న‌డిపించాడు. డిఫ‌రెంట్ స్క్రీన్ ప్లే తో ప్రేక్ష‌కులంద‌రినీ సీట్ల‌కు అతుక్కునేలా చేశాడు ద‌ర్శ‌కుడు.ఒక థ్రిల్ల‌ర్ సినిమాకు సినిమా పొడ‌వునా ఎంట‌ర్ టైన్ మెంట్ ఇవ్వాలి అంటే మామూలు విష‌యం కాదు. ప్ర‌తీ స‌న్నివేశం థ్రిల్లింగ్ గానూ, ఎంట‌ర్ టైన్ చేసే విధంగానూ ఆనంద్ బాగా ప్రెజెంట్ చేయ‌గలిగాడు. ఫ‌స్టాఫ్ మీద ఇంకొంచె దృష్టి పెట్టి, ర‌న్ టైమ్ కొంచం త‌గ్గించి ఉంటే సినిమా స్థాయి ఇంకోలా ఉండేది. ఇలాంటి క‌థ‌లు మామూలు చెప్తుంటేనే గంద‌ర‌గోళం చేసే స్టోరీని తీసుకుని, దానిని తెర‌కెక్కించిన విధానానికి డైర‌క్ట‌ర్ ను ఖ‌చ్చితంగా మెచ్చుకోవాల్సిందే. సినిమాకు మ‌రో ప్ల‌స్ పాయింట్ సినిమాటోగ్రఫీ ప్ర‌తీ ఫ్రేమ్ ఎంతో గ్రాండ్ గా, క్లీన్ గా ఉంది. శేఖ‌ర్ చంద్ర అందించిన సంగీతంలో పాట‌లు రెండు బాగున్నాయి. రీరికార్డింగ్ సినిమా స్థాయిని పెంచేలా ఉంది. ఎడిటింగ్ బాగున్న‌ప్ప‌టికీ, కొన్ని సీన్స్ కు క‌త్తెర ప‌డుంటే బాగుండేది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.


మొత్తానికి మ‌రో సారి నిఖిల్ ఒక కొత్త క‌థ‌ను ఎంచుకుని స‌క్సెస్ ను సొంతం చేసుకున్నాడ‌ని చెప్పాలి. హార‌ర్ కామెడీతో కూడిన ఈ ఫాంట‌సీ ప్రేమ‌క‌థా చిత్రానికి ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల దృష్ట్యా జ‌నాలు థియేట‌ర్స్ కు రావ‌డానికి కొంచెం టైమ్ ప‌ట్టినా, ఈ వారం సింగిల్ రిలీజ్ దాంతో మంచి టాక్ రావ‌డంతో థియేట‌ర్లు కూడా పెరిగే అవ‌కాశం ఉంది.


పంచ్ లైన్ః చిన్న‌వాడు ఎక్క‌డ‌కీ పోనివ్వ‌డు..


Filmjalsa Rating: 3.25/5