Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

ఈడు గోల్డ్ ఎహె సినిమా రివ్యూ- ఈడు గోల్డ్ కాదెహెఎప్పుడైతే క‌మెడియ‌న్ నుంచి హీరోగా మారాడో అప్ప‌టి నుంచి సునీల్ హీరోగా తానేంటో నిరూపించుకోవాల‌ని ప్ర‌తీ సారి ప్ర‌య‌త్నిస్తున్నాడు కానీ ఒకటి రెండు సార్లు త‌ప్ప అత‌ను చేసిన ప్ర‌య‌త్నాలేవీ ఫ‌లించ‌లేదు. న‌ట‌న ప‌రంగా, బాడీ పరంగా, డాన్సులు (స్టెప్పుల‌) పరంగా ఇలా అన్నింటిలోనూ బెస్ట్ అనిపించుకోవాలని తహతహలాడుతున్నాడు. అయితే సినిమా విజ‌యం సాధించాలంటే ఒక్క త‌న టాలెంట్ స‌రిపోదు.. దానికి స‌రైన టెక్నీషియ‌న్స్ కూడా కావాలి. ఇప్ప‌టి వ‌ర‌కు త‌ను చేసిన సినిమాల్లో హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువున్నాయి. ఆఖ‌రికి అయ్యో అస‌లు సునీల్ క‌మెడియ‌న్ గా ఉంటేనే బాగుండేది అన‌వ‌స‌రంగా హీరో అయి, కెరీర్ నాశనం చేసుకుంటున్నాడు అనే స్థాయిలో ప్రేక్ష‌కుల‌కు సునీల్ మీద జాలి క‌లిగింది. ఈసారి ద‌స‌రా బ‌రిలోకి ఈడు గోల్డ్ ఎహె అంటూ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు సునీల్. గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా వ‌రుసగా ఫ్లాపు లు అందుకుంటూ, రీసెంట్ గా జ‌క్క‌న్న‌తో చేతులు కాల్చుకున్న‌ సునీల్ ఈసారి మాస్ మాసాలకి వీరు పోట్ల కామెడీ తోడయితే కన్ఫర్మ్ గా సక్సెస్ వస్తుందని వీడు గోల్డ్ ఎహె అని ట్రై చేసాడు. మ‌రి ఈ సినిమా అయినా సునీల్ మీద ప్రేక్ష‌కుల్లో ఉన్న జాలిని తీసేసి, సునీల్ తీసుకున్న నిర్ణ‌యం క‌రెక్టే అనిపిస్తుందా లేదా చూద్దాం..
ఇక క‌థ విష‌యానికొస్తే సునీల్ ప్ర‌తీ సినిమాలో లాగానే ఇందులో కూడా మంచి వ్య‌క్తిగా క‌నిపిస్తాడు. అనాధ‌గా ఉన్న సునీల్ దుర‌దృష్ట వంతుడిగా పేరు పొందుతాడు. దీంతో అత‌డు ఎక్క‌డ ప‌నిచేసినా ఆ కంపెనీ య‌జ‌మానికి ఇక్క‌ట్లు త‌ప్ప‌వు. దీంతో అత‌నికి ఉద్యోగం ఇవ్వ‌డానికి ఎవ్వ‌రూ ముందుకు రారు.ఈ నేప‌థ్యంలోనే త‌న‌కు ఒక త‌ల్లి కొడుకులు క‌నిపించి వాళ్లే సునీల్ కి పిలిచి ఉద్యోగం ఇస్తా అంటారు.అయితే అత‌ను ఒక పెద్ద క్రిమిన‌ల్. అత‌ను సునీల్ ను ఒక హ‌త్య కేసులో ఇరికిస్తాడు. ఆ కేసు నుంచి సునీల్ ఎలా బ‌య‌ట ప‌డ‌తాడు.. అస‌లు సునీల్ ను కేసులో ఇరికించాల్సిన అవ‌స‌రం ఏంటి.. రిచా, సుష్మా సునీల్ కు ఎలా ప‌రిచ‌యం అవుతారు.. వాళ్ల‌కు క‌థ‌కు సంబంధం ఏంటి అన్న‌ది తెర‌పైనే చూడాలి.
సునీల్ ముఖ్యంగా కొన్ని విష‌యాలు ఎంత త్వ‌ర‌గా తెలుసుకుంటేనే త‌న‌కు విజ‌యం వ‌రిస్తుంది త‌ప్ప ఎలాంటి సినిమాలు చెయ్యాలా అనే అయోమ‌యం లో ఉంటే మాత్రం ఎప్ప‌టికీ ఇలాంటి సినిమాలే తీస్తాడు. అస‌లు త‌న‌కు ఏం వ‌చ్చు.. త‌న బ‌ల‌మేంటి, బ‌లహీన‌తేంటి.. ప్రేక్ష‌కులు త‌న ద‌గ్గ‌ర నుంచి ఏం కోరుకుంటున్నారు.. వాళ్లు కోరుకున్న దానిలో త‌నేమి చేయ‌గ‌ల‌డు అన్న‌ది తెలుసుకోవాలి. అంతేకాదు ఇప్పుడు తెలుగు సినీ పరిశ్ర‌మ కూడా మార్పు చెందుతుంది. ఎంత‌కాలం అవే పాత సినిమాలు, కొట్టుకోవ‌డాలు, యాక్ష‌న్ సినిమాలు అంటూ చేస్తూ పోతే ఇక త‌న‌ను చూడ‌టానికి ఎవ‌రూ ముందుకు రారు అన్న విష‌యం గ‌మ‌నించాలి. మ‌హేష్ బాబు లాంటి హీరోనే నేనొక్క‌డినే, ఖ‌లేజా, శ్రీమంతుడు అంటూ ఒక‌దానికి ఒక‌టి సంబంధం లేకుండా క‌థ‌లు ఎంచుకుంటుంటే, సునీల్ మాత్రం ఇంకా అవే మూస సినిమాలు, అదే పాత చింత‌కాయ ప‌చ్చ‌డిని మ‌న‌కు రుచి చూపిస్తున్నాడు.
న‌ట‌న ప‌రంగా త‌న‌కు వ‌చ్చిన, సెట్ అయిన విధంగా కామెడీ క‌థ‌తో సునీల్ బాగా మెప్పించాడు. త‌న కామెడీ కి పృథ్వీ, వెన్నెల కిషోర్, ప్ర‌భాస్ శ్రీను, ష‌క‌ల‌క శంక‌ర్ కూడా తోడ‌వ‌డంతో సినిమాలో పంచ్ లు బాగా పేలాయి. జ‌య‌సుధ క్యారెక్ట‌ర్ ఎందుకు ఉందో అర్థం కాదు. న‌టించడానికి స్కోప్ కూడా ఉండ‌దు. ఏం ఇంపార్టెన్స్ లేని పాత్ర‌లో జ‌య‌సుధ నిరాశ ప‌రిచింద‌నే చెప్పాలి. ఇక విల‌న్స్ అంటే చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. అంద‌రూ సో సో గా చేశారు. హీరోయిన్స్ ఇద్ద‌రున్న‌ప్ప‌టికీ, అక్క‌డ‌క్క‌డా కొన్ని స‌న్నివేశాల్లో, పాటల్లో త‌ప్ప వారికి ప్రాముఖ్య‌త ఏమీ ఉండ‌దు.
కామెడీ పరంగా వీరు పోట్ల తన అనుభవాన్నంతా రంగ‌రించి బాగానే హేండిల్ చేసాడు. సినిమాలో ఏ ఒక్క టెక్నీషియ‌న్ కూడా బాగా చేశారు సూప‌ర్ అని చెప్ప‌లేం. ఓకే, ప‌ర్లేదు అనే రేంజ్ చాలు అనిపిస్తుంది. రెండు మూడు ట్విస్ట్ ల‌తో క‌థ అల్లిన విధానం బాగుంది. కానీ దానికి త‌గ్గ స్క్రీన్ ప్లే విష‌యంలో మాత్రం బాగా త‌డ‌బ‌డ్డాడు వీరు పోట్ల‌. ఆ ట్విస్ట్ ల మీద‌, కామెడీ మీద పెట్టిన ఫోక‌స్ డైర‌క్ట‌ర్ స్క్రీన్ ప్లే మీద కూడా పెట్టి ఉంటే, ఈడు గోల్డ్ ఎహె రిజ‌ల్ట్ ఇంకోలా ఉండేది. సాగ‌ర్ మ‌హ‌తి అందించిన పాట‌ల్లో ఒక్క‌టి కూడా గుర్తుండేది లేదు. రీ రికార్డింగ్ ప‌ర్లేదు. సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. ఎడిటింగ్ బాగ‌లేదు. కొన్ని అనవ‌ర‌స‌ర స‌న్నివేశాల‌ను కూడా బ‌ల‌వంతంగా ఇరికించిన‌ట్లుంది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.
మొత్త‌మ్మీద సినిమాలో ట్విస్ట్ లున్నాయి, కామెడీ ఉంది. యాక్ష‌న్ సీన్స్ ఉన్నాయి. అక్క‌డ‌క్క‌డా ల‌వ్ సీన్స్ ఉన్నాయి. కానీ అదేదో సామెత ఉంది క‌దా.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శ‌ని ఉంద‌న్న‌ట్లు సినిమాలో ఇన్ని ఉన్నా,వాటిన్నింటినీ క‌రెక్ట్ గా మెయిన్ టెయిన్ చేయ‌లేక‌పోవ‌డంతో అక్క‌డ‌క్క‌డా పార్ట్ ల వారీగా చూస్తే సినిమా ప‌ర్వాలేద‌నిపిస్తుంది.

పంచ్ లైన్ః ఈడు గోల్డ్ కాదెహె

Filmjalsa Rating : 2.5/5