Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

‘ఇజం’ రివ్యూ- పూరీ మార్క్ ‘ఇజం’నాల్రోజుల్లో క‌థ‌ను రాయ‌డం, అంతే స్పీడ్ గా స్టార్ హీరోతో సైతం సినిమాల‌ను తీయ‌గ‌ల స‌త్తా ఉన్న ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్. ఆ ప్ర‌య‌త్నంలో తీసిన సినిమాలు అయితే బ్లాక్ బ్ల‌స్ట‌ర్స్ లేకుంటే డిజాస్ట‌ర్స్. టెంప‌ర్ విజ‌యం తర్వాత తీసిన జ్యోతి ల‌క్ష్మి, లోఫ‌ర్ రెండు సినిమాలు ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయిన‌వే.. దీంతో ఈసారి కొంచెం టైమ్ తీసుకుని, నందమూరి హీరో క‌ళ్యాణ్ రామ్ తో ఓ సినిమా తీశాడు. ‘ప‌టాస్’ హిట్ త‌ర్వాత ‘షేర్’ సినిమా తీసి దాంతో దెబ్బ తిన్న కళ్యాణ్ రామ్ లుక్స్ ను పూర్తిగా మార్చేసి త‌న‌కు అనువైన స్టైలిష్ లుక్ లోకి మార్చేసి ఇజం అన్నాడు. క‌ళ్యాణ్ రామ్ సొంత బ్యాన‌ర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈ సినిమా జ‌ర్న‌లిజం ప్ర‌ధానాంశంగా తెర‌కెక్కింది. సంఘంలో అవినీతి ప‌రుల భ‌ర‌తం పట్టే సిన్సియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ గా క‌ళ్యాణ్ రామ్ క‌నిపించిన ఈ సినిమా ట్రైల‌ర్ తో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య థియేట‌ర్ల లోకి వ‌చ్చిన‌ ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా లేదా చూద్దాం.
జ‌ర్న‌లిస్ట్ అయిన క‌ళ్యాణ్ రామ్ (స‌త్య మార్తాండ్) త‌న చిన్న‌త‌నంలో జ‌రిగిన అన్యాయంతో ప్ర‌భావితుడై, స‌మాజంలో జ‌రిగే అవినీతిపై యుద్ధం చేసేందుకు నిర్ణ‌యించుకుంటాడు. అవినీతిపై యుద్దం చేయ‌డానికి ప్ర‌జ‌లకు ఓ ధైర్యం కావాల‌ని, ఆ ధైర్యానికి రూపం అవ‌స‌రం లేదనుకున్న క‌ళ్యాణ్ రామ్.. చ‌ట్టం, న్యాయ వ్య‌వ‌స్థ ద్వారా జర‌గ‌ని న్యాయాన్ని మాస్క్ మెన్ గా మారి, న్యాయం చేస్తుంటాడు. జ‌గ‌ప‌తి బాబు(జావేధ్ భాయ్), క‌ళ్యాణ్ రామ్ బీడీ ఫ్రెండ్స్. అదే స‌మ‌యంలో అదితి ఆర్య‌(అలియా ఖాన్) తో ప‌రిచ‌యం, ఆ ప‌రిచ‌యం కొన్నాళ్ల‌కే ప్రేమ‌గా మారడం, త‌న ప్రియురాలితో కూడా అనుమానం రాకుండా త‌న రెండో షేడ్ ఎవ‌రికీ తెలియ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌తాడు. అయితే దేశంలో జ‌రుగుతున్న అవినీతికి అస‌లు కార‌ణం జ‌గ‌ప‌తి బాబే అని తెలుసుకున్న క‌ళ్యాణ్ రామ్ త‌ర్వాత ఏం చేస్తాడు..? అస‌లు క‌ళ్యాణ్ రామ్, అదితి ఆర్య ల‌కు ఎలా ప‌రిచ‌యం అవుతుంది..? క‌ళ్యాణ్ రామ్ ను త‌న చిన్న త‌నంలో ప్ర‌భావితం చేసిన ఆ అంశం ఏంటి? అన్న‌దే క‌థ‌..
సినిమాలో మ‌న‌కు క‌నిపించేవి రెండే రెండు పాత్ర‌లు. క‌ళ్యాణ్ రామ్, జ‌గ‌ప‌తిబాబు. సినిమా అంతా వీరిద్ద‌రి చుట్టూనే తిరుగుతుంది. న‌ట‌న విష‌యంలో క‌ళ్యాణ్ రామ్ న‌టుడిగా త‌న‌కు తానే పెట్టుకున్న ప‌రీక్ష‌లో పూర్తిగా విజ‌యం సాధించాడు. స‌రైన క‌థ‌లు వ‌స్తే త‌న న‌ట‌న ఏ స్థాయిలో ఉంటుందో చెప్ప‌డానికి ఇజం ను బెస్ట్ ఎగ్జాంపుల్ గా చూపించాడు. త‌న బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివ‌రీ, యాక్ష‌న్ సీన్స్, ముఖ్యంగా ఎమోష‌నల్ సీన్స్ లో త‌ను కనుబ‌రిచిన న‌ట‌న‌ను మెచ్చుకోవాల్సిందే.ముఖ్యంగా జ‌ర్న‌లిస్ట్ క్యారెక్ట‌ర్ కు ప్రాణం పోశాడ‌నే చెప్పాలి. జావేద్ బాయ్‌గా జ‌గపతి బాబుకు ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం కొట్టిన పిండి. ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో త‌న‌దైన న‌ట‌న‌ను క‌న‌బ‌రిచి ఆక‌ట్టుకున్నాడు. హీరోయిన్ గా అదితి ఆర్య త‌న అందంతో, అభిన‌యంతో మెప్పించింది. త‌ను సినిమాలో క‌నిపించేది త‌క్కువ సేపే అయినా ఉన్నంత సేపు త‌న పాత్ర ఆకట్టుకుంటుంది. తనికెళ్ళ భరణి, గొల్లపూడి మారుతీరావులు సినిమాకు ప్లస్ అయ్యారు. అలీ, పోసాని కామెడీ ప్రేక్ష‌కుల స‌హ‌నానికి పూరీ పెట్టిన ప‌రీక్ష‌. మిగ‌తా వారిలో అజ‌య్ ఘోష్, ఈశ్వ‌రీ రావు, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, వెన్నెల కిషోర్ లు త‌మ త‌మ పాత్ర‌ల మేర న్యాయం చేశారు.
ఎప్పుడూ పాత క‌థ‌ల‌నే కొంచెం అటూ ఇటుగా మార్చి కొత్త సినిమా అనే పూరీ, ఈ సినిమా విష‌యంలో మాత్రం కొంచెం వెరైటీగా, కొత్త‌గా ఆలోచించాడు. ఎప్ప‌టిలాగే పూరీ హీరో అంటే ప్రేక్ష‌కులు తన నుంచి కొత్త‌గా ఆశిస్తారు. ఆ విష‌యంలో కూడా క‌ళ్యాణ్ రామ్ ను కొత్త‌గా చూపించి స‌క్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే అక్క‌డ‌క్క‌డా రొటీన్ గానే ఉన్న‌ప్ప‌టికీ, క్లైమాక్స్ లో వ‌చ్చే సీన్ తో అంద‌రినీ త‌న వైపుకు తిప్పుకుని త‌న ఇజం చూపించాడు. రైట‌ర్ గా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో ఆయ‌న రాసుకున్న డైలాగ్స్, దానికి తోడు క‌ళ్యాణ్ రామ్ డైలాగ్ డెలివ‌రీ ప్ల‌స్ అవ‌డంతో, డైలాగులు బాగా పేలాయి.
బ్లాక్ మనీని వెనక్కి తెప్పించి ప్రజలకు పంచిన తీరు రియలిస్టిక్ బాగా తెర‌కెక్కించాడు. ఫస్టాఫ్ లో హీరో క్యారెక్ట‌ర్ ని ఎస్టాబ్లిష్ చేయ‌డానికి రాసుకున్న కొన్ని సీన్స్ కొత్తగా బాగున్నాయి. సంద‌ర్భానుసారంగా వ‌చ్చిన పాట‌లు బాగున్నాయి. కానీ ఫ‌స్టాఫ్ లో జ‌గ‌ప‌తి బాబు లో అంత విల‌నిజం చూపించిన పూరీ, సెకండాఫ్ లో ఆ క్యారెక్ట‌ర్ ని వీక్ చేసేస‌రికి జావేద్ భాయ్ క్యారెక్ట‌ర్ తేలిపోయింది. క్యారెక్ట‌ర్ సినిమాలో చాలా త‌క్కువ స‌మ‌యం క‌నిపించ‌నట్లు అనిపిస్తుంది. ఇంకొంచెం నిడివిని ఆమెకు కేటాయించి ఉంటే బాగుండేది. సెకండాఫ్ లో ప్రీ క్లైమాక్స్ సీన్ త‌ప్పించి, మిగ‌తా అంతా సాగ‌దీస్తున్న‌ట్లు, ఒక్క సీన్ కూడా చెప్పుకునేదిగా ఉండ‌దు.
సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా ప్ల‌స్ అయింది. ప్ర‌తీ ఫ్రేమ్ ను ఎంతో గ్రాండ్ గా, రిచ్ గా తెర‌కెక్కించారు. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం బాగుంది. పాట‌ల‌న్నీ బాగున్నాయి. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏ మాత్రం చెప్పుకోద‌గిన‌ట్లుగా లేదు. ఆర్ ఆర్ విష‌యంలో ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది. ఎడిటింగ్ బాగున్న‌ప్ప‌టికీ, సెకండాఫ్ లో కొన్ని సీన్స్ కు క‌త్తెర ప‌డితే బాగుండేది. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ విలువ‌లు ఎంతో రిచ్ గా ఉన్నాయి.

చివ‌ర‌గా, త‌న సినిమాల ద్వారా ఏదో సందేశం ఇవ్వాల‌ని ప‌రిత‌పించే పూరీ, అవినీతి ద్వారా జ‌రుగుతున్న అన్యాయాన్ని ప్ర‌జ‌ల‌కు ఈ చిత్రం ద్వారా బాగా చూపించాడు. క‌ళ్యాణ్ రామ్ న‌ట‌న‌, కోర్టు సీన్ లు మ‌రియు సోష‌ల్ మెసేజ్ ను క‌లిగి ఉన్న క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డే వాళ్లు త‌ప్ప‌క చూడాల్సిన సినిమా ఇజం.

పంచ్ లైన్ః పూరీ మార్క్ ఇజం

Filmjalsa Rating: 3.25/5