ఆటాడుకుందాం…రా రివ్యూఅక్కినేని వంశంలో త‌న‌ను తాను హీరోగా నిరూపించుకోవ‌డానికి వీర లెవ‌ల్ లో ప్ర‌య‌త్నాలు చేస్తున్న హీరోల్లో సుశాంత్ కూడా ఒకడు. క‌రెంట్, అడ్డా సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించినా, ఇప్ప‌టివ‌ర‌కు ఈ కాళిదాసు ఖాతాలో చెప్పుకోద‌గ్గ హిట్ ఒక్క‌టీ లేదు. దీంతో చాలా గ్యాప్ త‌ర్వాత, జి. నాగేశ్వ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈసారి కేవ‌లం కామెడీనే న‌మ్ముకుని, ఆటాడుకుందాం రా అనే సినిమా ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు సుశాంత్. ఇవాళ విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కు ఎంత‌గా రీచ్ అయిందో చూద్దాం.


సుశాంత్‌ ఎన్‌ఆర్‌ఐ. భారత్ వచ్చి సోనమ్‌తో ప్రేమలో పడతాడు. అయితే ఇద్దరూ టైం మిషన్‌లో ట్రాప్ అవ్వాలనుకుంటారు. 50 యేళ్ళ ముందుకూ, వెనక్కూ వెళ్ళగలననే సత్తా ఉన్న ఆ మిషన్‌లో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్‌ ద్వారా వెళతారు. అప్పటికి ఇప్పటికే దర్శకత్వం, కథల్లో ఏదైనా తేడావుందోనేమో కనిపెట్టాలనుకుంటారు. ఆ దశలో పృథ్వీ అనే దర్శకుడి వద్దకు వెళ్తారు. తర్వాత అక్కడ ఏం జరిగింది? అనేదే మిగ‌తా క‌థ‌.


సుశాంత్ న‌ట‌న గ‌త చిత్రాల కంటే మెరుగ్గా ఉంది. డ్యాన్స్, యాక్ష‌న్ అన్నీ ఓకే. హీరోయిన్ సోన‌మ్ బ‌జ్వా త‌న గ్లామ‌ర్ తో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేస్తూనే, త‌న న‌ట‌న‌తో మెప్పించింది. బ్ర‌హ్మానందం చాలా కాలం త‌ర్వాత ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్ట‌ర్ చేశాడు. పృథ్వీ త‌న కామెడీతో సినిమాకే పెద్ద హైలెట్ గా నిలిచాడు. వెన్నెల కిషోర్ త‌న స్టైల్ లో బాగా న‌వ్వించ‌గ‌లిగాడు. మిగ‌తా పాత్ర‌లు ర‌ఘుబాబు, ముర‌ళీ శ‌ర్మ‌,గిరిజా రావు త‌మ త‌మ పాత్ర‌ల ప‌రిధిలో న‌టించారు. అఖిల్, నాగ‌చైత‌న్య‌, సుశీల పాత్ర‌లు క‌థ‌కు త‌గ్గ‌ట్టు బాగా క‌నెక్ట్ చేశాడు.


సినిమాలో సుశాంత్, పృథ్వీ ల మ‌ధ్య వ‌చ్చే కామెడీ సీన్స్ బాగున్నాయి. టైమ్ మెషీన్ కార‌ణంగా పేలిన పంచ్ లు సూప‌ర్బ్. నాగ‌చైత‌న్య స్పెష‌ల్ అప్పీరియ‌న్స్ క‌థ‌కు స‌రిపోయే విధంగా చేశారు. ఏఎన్నార్ చెల్లి అంటూ ఝాన్సీ చేసే కామెడీ థియేట‌ర్లో న‌వ్వులు పూయించాయి. క‌థ, క‌థ‌నంలో ఏ మాత్రం ఆస‌క్తి లేకుండా రొటీన్ స్టోరీతో బోర్ కొట్టించాడు డైర‌క్ట‌ర్. సినిమాలో ఎక్క‌డా బ‌ల‌మైన ఎమోష‌న్స్ కానీ, సీరియ‌స్ సీన్స్ కానీ లేవు. నేను లాజిక‌ల్ గా ఆలోచిస్తా అంటే అస‌లు సినిమా చూడ‌కుండా ఉండ‌ట‌మే బెట‌ర్.


ముఖ్యంగా అనూప్‌ రూబెన్స్‌.. ఈ చిత్రానికి ప్లస్‌ అయింది. ఆకట్టుకునే బాణీలు చూపించాడు. ఏఎన్నార్ ‘దేవదాసు’ చిత్రంలోని “పల్లెకుపోదాం..” అనే లైన్‌ను అక్కడక్కడ పెట్టి.. రీమిక్స్‌ ప్రయోగం బాగుంది. సంభాషణలపరంగా ఎంటర్‌టైన్‌చేసేలా ఉంది. నాగేశ్వ‌ర్ రెడ్డి డైర‌క్ష‌న్ త‌న గ‌త చిత్రాల మాదిరిగానే ఉన్నా, కొంచెం కొత్త‌గా ఉంది. ఎడిటింగ్ ఫ‌ర్వాలేదు. నిర్మాణ విలువ‌లు, సినిమాటోగ్ర‌ఫీ చాలా బాగున్నాయి.


ఫైన‌ల్ గా, చాలా కాలం త‌ర్వాత ఎలాగైనా సుశాంత్ తో హిట్ కొట్టించాల‌ని నాగ‌చైత‌న్య‌, అఖిల్ ఆడిన ఆటే ఈ ఆటాడుకుందాం రా.. ప్రేక్ష‌కుడిని పూర్తిగా ఎంట‌ర్ టైన్ చేయాల‌ని ఎంత ట్రై చేసిన‌ప్ప‌టికీ, అనుకున్నంత‌గా ఎంట‌ర్ టైన్ చేయ‌లేక‌పోయాడు.


పంచ్ లైన్ః ఆటాడుకుందాం రా.. అక్కినేని అడ్డా