నాగచైతన్య ' యుద్ధం శరణం ' రిలీజ్ డేట్ ఫిక్స్


నాగచైతన్య హీరోగా వారాహి చలనచిత్ర బ్యానర్ పై తెరకెక్కిన కొత్తచిత్రం 'యుద్ధం శరణం'. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. కృష్ణ ఆర్‌.వి.మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్రం పతాకంపై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్ కి మంచి స్పందన లభించింది. 

ఈ చిత్రానికి కథ: డేవిడ్‌ ఆర్‌.నాథన్‌, మాటలు: అబ్బూరి రవి, సినిమాటోగ్రఫీ: నికేత్‌ బొమ్మి, సంగీతం: వివేక్‌సాగర్‌ అందిస్తున్నారు. దాదాపు అన్ని కార్యక్రమాలు ముగించుకున్న ఈ చిత్రం, సెప్టెంబర్ 8 న విడుదల అవబోతుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్ గా కనిపించబోతున్నాడు.