యంగ్ హీరోను టెన్ష‌న్ పెడుతున్న అభిమాని


నేను శైల‌జ‌తో మంచి ట్రాక్ లోకి వ‌చ్చాడ‌నుకున్న యంగ్ హీరో రామ్, హైప‌ర్ తో మ‌ళ్లీ పాత బాట‌నే అనుస‌రించి బోల్తా ప‌డ్డాడు. హైప‌ర్ విడుద‌లై దాదాపు నాలుగు నెల‌లు దాటినా, ఇప్ప‌టివ‌ర‌కు త‌న త‌దుప‌రి సినిమా గురించి ఎక్క‌డా ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం అభిమానుల‌ను నిరాశ ప‌రుస్తుంది. అప్పుడప్పుడు ప్రైవేట్ పార్టీల‌లోనూ, సోష‌ల్ మీడియాలోనూ డిఫ‌రెంట్ గెట‌ప్, లుక్స్ తో ద‌ర్శ‌న‌మిస్తున్న రామ్ కు ఇప్పుడొక వింత ప‌రిస్థితి ఎదురైంది. అది కూడా త‌న అభిమాని నుంచి త‌లెత్త‌డం విశేషం.


రామ్ అన్న‌య్యా.. ఈ రోజు నుంచి మీ త‌దుప‌రి సినిమా గురించి ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు ఉప‌వాసం చేస్తున్నాను. ఇది మొద‌టి రోజు ల‌వ్ యు అంటూ ఒక అభిమాని ట్వీట్ చేయ‌గా, దానికి రామ్ స్పందిస్తూ.. ఇలాంటి కొత్త టెన్ష‌న్స్ పెట్ట‌కు త‌మ్ముడు.. నేను కూడా అదే ప‌నిలో ఉన్నా... అంటూ రిప్లై ఇచ్చాడు. ఏదేమైనా ఎప్పుడూ అంత ఎన‌ర్జీగా ఉండే రామ్, స‌డ‌న్ గా ఇంత గ్యాప్ తీసుకున్నాడంటే.. ఏదో విశేషం ఉండే ఉంటుందిలెండి