Young Hero In Bhagamati Movie


We all know that Anushka as lead role a movie is coming up named "Bhagamathi". After knowing that this film is based on thriller concept,audience can't wait for the film to release.Malayali actor Jayaram is taken as villain in this film and Aadi pinisetty is considered for one more key role. As a villain in Sarainodu Aadi got a huge applause form the audience. With this unit thought that he is perfect for this role in Bhagamathi. Tabu also acting in this movie. Ashok is the director for this film which is going to sets on June 15th.
భాగ‌మ‌తిలో యంగ్ హీరో ఆది
అనుష్క లీడ్ రోల్ లో భాగ‌మ‌తి చిత్రం త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెర‌కెక్కుతుంద‌న్న విష‌యం తెలిసిన దగ్గ‌ర నుంచి ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి మ‌రింత పెరిగిపోయింది. ఈ సినిమాలో విల‌న్ గా ఇటీవ‌లే ఒక మ‌ల‌యాళ న‌టుడు జ‌య‌రామ్ ను ఎంపిక చేయ‌గా మ‌రో కీల‌క పాత్ర కోసం ఆది పినిశెట్టిని తీసుకున్నార‌ట‌. స‌రైనోడుతో నెగిటివ్ షేడ్ చూపించిన ఆది, ఆ సినిమాతో విల‌న్ గా ఆడియ‌న్స్ నుంచి మంచి మార్కులే కొట్టేశాడు. దీంతో భాగ‌మ‌తి లోని క్యారెక్ట‌ర్ కి ఆది నే క‌రెక్ట్ అని భావించి ఎంపిక చేశార‌న్న‌ది టాక్. ఈ సినిమా లో మ‌రో ముఖ్య‌మైన పాత్ర‌లో ట‌బు కూడా న‌టించనుంది. అశోక్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ సినిమా జూన్ 15నుంచి సెట్స్ పైకి వెళ్ల‌నుంది.