మహాశివరాత్రి కానుకగా విజయ్‌ ఆంటోని 'యమన్‌'


విజయ్‌ ఆంటోని హీరోగా మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌, ద్వారకా క్రియేషన్స్‌ పతాకాలపై జీవశంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'యమన్‌' చిత్రాన్ని మిర్యాల రవీందర్‌రెడ్డి తెలుగులో అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మహాశివరాత్రి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఫిబ్రవరి 11న ఆడియో 
ఈ సందర్భంగా నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ - ''ఇటీవల విడుదలైన టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. నకిలి, డా|| సలీం, బిచ్చగాడు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన విజయ్‌ ఆంటోనిగారికి 'యమన్‌' మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది. ఈ చిత్రంలో విజయ్‌ ఆంటోని పెర్‌ఫార్మెన్స్‌, ఆయన అందించిన మ్యూజిక్‌ చాలా పెద్ద హైలైట్‌ అవుతాయి. పాటలన్నీ చాలా బాగా వచ్చాయి. ఈ చిత్రం ఆడియోను ఫిబ్రవరి 11న చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. చిత్రాన్ని మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం'' అన్నారు.