Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

Why Rajani Break His Sentiment?


ర‌జ‌నీ సెంటిమెంట్‌ను ఎందుకు బ్రేక్ చేశాడు..?
బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం.. వెన్న‌లోని క‌మ్మ‌ద‌నం, తేనెలోని తీపిద‌నం ఈయ‌న పాట‌లో క‌నిపిస్తాయి. ఆయ‌న పాట‌లోని మాధుర్యాన్ని ఆస్వాదించ‌ని వారుండ‌రంటే అతిశ‌యోక్తి లేదు. అలాంటి బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం పాట క‌బాలి సినిమాలో లేక‌పోవ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే ర‌జ‌నీ సినిమాల‌కు 24 సంవ‌త్స‌రాల నుంచి ఆయ‌న పాడుతూనే ఉన్నారు.
మిగ‌తా హీరోల సంగతెలా ఉన్నా, త‌న సినిమాల‌కు బాలుతో పాడించ‌డం, ముఖ్యంగా టైటిల్ సాంగ్ పాడించ‌డం త‌లైవా ర‌జ‌నీకాంత్ కు సెంటిమెంట్. అలాంటి సెంటిమెంట్ ఉన్నా కానీ, క‌బాలి సినిమాతో అది ఎందుకు బ్రేక్ అయిందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. ఈ సినిమా పాట‌ల‌ను ఆదివారం నేరుగా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నారు. కార‌ణ‌మేదైనా కానీ, ట్రాక్ లిస్ట్ లో బాలు పేరు లేక‌పోవ‌డం అభిమానుల‌ను నిరాశ ప‌రుస్తోంది.