హిందూపురంలో ఇంత దారుణం జరుగుతుంటే బాలయ్య ఏమి చేస్తున్నారు ?


మంచి నాయకులూ ప్రజలకు ఎంత మంచి చేయాలి అని ప్రయత్నించినా వాళ్ళ చుట్టూ చెడ్డవారిని పెట్టుకొని ప్రజలకి మేలు చేయలేరు. ప్రస్తుతం  ‘హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు కూడా అలాంటి పరిస్థితే ఎదురవుతుంది. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా ఎమ్మెల్యే గా తన విధులను నిర్వర్తించడంలో హిందూపురంలో బాలయ్య సక్సస్ అయ్యేడు అనే చెప్పుకోవాలి . అయితే ఇప్పుడు బాలయ్యకి చిక్కు అంతా ఆయన వ్యక్తిగత సహాయకుడి(పీఏ)గా ఉన్న చంద్రశేఖర్‌ (శేఖర్‌)  వల్లే వస్తుంది. నియోజకవర్గంలోని ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సైతం లంచాలు తీసుకుని అవినీతిలో కూరుకుపోయాడు బాలయ్య మంగళవారం సాయంత్రం లేపాక్షి మండలం కల్లూరు గ్రామంలోని ఓ తోటలో టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ లేపాక్షి ఎంపీపీ హనోక్‌ను పీఏ శేఖర్‌ తన ఏజెంటుగా పెట్టుకుని ఇళ్ల మంజూరుకు రూ.25 వేలు, పింఛన్‌కు రూ.2 వేలు, సబ్సిడీ రుణాలు ఇవ్వాలంటే రూ.20 వేల చొప్పున ప్రజలతో వసూలు చేశారని విమర్శించారు. గ్రామాల్లోకి టీడీపీ నాయకులు వెళ్తే ప్రజలు ఉమ్మి వేస్తున్నారని, పార్టీ పరువును, నాయకుల ప్రతిష్టను దెబ్బతీశారని వారు అన్నారు. పార్టీ అధిష్టానం పీఏ శేఖర్‌ను అలాగే కొనసాగిస్తే 20 వేల మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలతో వెళ్లి నిలదీస్తామని హెచ్చరించారు.
 
మరి ఇప్పటికైనా బాలయ్య తన పీఏ వ్యవహారం పై ఆరా తీసి హిందూపురం తెలుగు తమ్ముళ్లకు న్యాయం చేస్తాడో లేదో చూడాలి