బన్నీని టార్గెట్ చేసిన టాప్ డైర‌క్ట‌ర్


ఒక‌ప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్స్ కే కొర‌త ఉండేది. ఇప్పుడు హీరోల‌కు కూడా కొర‌తే. ఎంత పెద్ద డైర‌క్ట‌ర్ అయినా, స‌క్సెస్ లో ఉన్న డైరక్ట‌ర్ అయినా స‌రే, తాను ప‌నిచేయాల‌నుకున్న హీరోతో సినిమా తీయడానికి ఆ హీరోలు దొర‌క‌ట్లేదు. తాజాగా ఇదే ప‌రిస్థితి వి.వి. వినాయ‌క్ కు ఎదురైంది. ఎలాంటి సినిమాకైనా క‌మ‌ర్షియ‌ల్ హంగులు దిద్ద‌డం వినాయ‌క్ కు స్క్రిప్ట్ తో పెట్టిన విద్య‌. అలాంటి వినాయ‌క్ కూడా అనుకున్న హీరో దొర‌కట్లేదు అంటే మ‌న టాలీవుడ్ హీరోలు ఎంత బిజీగా ఉన్నారో అర్థం చేసుకోవ‌చ్చు. దానికి తోడు ఎప్పుడూ,  రొటీన్ మాస్ మ‌సాలా సినిమాలే వినాయ‌క్ నుంచి రావ‌డంతో, హీరోలు వినాయ‌క్ కు ఛాన్స్ ఇవ్వాలంటే ఆలోచిస్తున్నారు. దీంతో మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తో సినిమా తీయ‌డానికి వినాయ‌క్ రెడీ అయిపోయాడ‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి. కానీ ఇప్పుడు వినాయ‌క్ ఆ నిర్ణ‌యాన్ని మార్చుకున్నాడ‌ట‌. అసలు విష‌యంలోకి వెళితే..,


అల్లు అర్జున్ కోసం వినాయ‌క్ ఒక మంచి స్టోరీ ని రెడీ చేసి, ఓకే చేయించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం డీజే మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న బ‌న్నీ, దాని త‌ర్వాత వ‌క్కంతం వంశీతో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ త‌ర్వాత వినాయ‌క్ త‌న‌తో సినిమా చేసేలా బ‌న్నీ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ తీసుకోవాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. ఆల్రెడీ వినాయ‌క్ బ‌న్నీ కోసం త‌న రైట‌ర్స్ తో ఒక క‌థను డెవ‌ల‌ప్ చేయిస్తున్నాడ‌ని, స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌యిన వెంట‌నే బ‌న్నీ కి నెరేట్ చేయాల‌ని చూస్తున్నాడ‌ట వినాయ‌క్. క‌థ న‌చ్చాలే కానీ, బ‌న్నీ వినాయ‌క్ కాంబినేష‌న్ తెర మీద‌కు వెళ్లే అవ‌కాశాలు చాలానే ఉన్నాయి.