వినాయ‌క్ తర్వాత సినిమా... ట్రాక్ లోకి మ‌రో యంగ్ హీరో


ప్ర‌స్తుతం టాలీవుడ్ లో క‌మ‌ర్షియ‌ల్ సినిమాల జోరు న‌డుస్తుంది. ఎలాంటి క‌థ‌కైనా, క‌మ‌ర్షియ‌ల్ హంగులు దిద్ద‌డంలో దిట్ట ఎవ‌రు అంటే అందులో వివి వినాయ‌క్ పేరే ముందుంటుంది. రీసెంట్ గా ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఖైదీ నెం.150 ఎంతటి అఖండ విజయాన్ని సాధించిందో తెలిసిందే. దీంతో ఆయ‌న త‌ర్వాత సినిమా ప‌ట్ల అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. 


వినాయ‌క్ త‌ర్వాతి సినిమా గోపీ చంద్ తో ఉంటుంది అని కొందరు అంటుంటే, సాయి ధ‌ర‌మ్ తేజ్ ఉంటుంది అని ఇంకొందరు అంటున్నారు. లేదు లేదు అల్లు అర్జున్ కోసం ఒక క‌థ‌ను రెడీ చేసుకుంటున్నాడు అని మ‌రికొంద‌రు ఇలా రోజుకో హీరోతో వినాయ‌క్ సినిమా అంటూ వార్త‌లొస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మ‌రో యంగ్ హీరో వ‌చ్చి చేరాడు. వినాయ‌క్ త‌ర్వాతి సినిమా మంచు మ‌నోజ్ తో ఉండ‌నుంద‌ని ఇప్పుడు హాట్ న్యూస్. ఇప్ప‌టికే క‌థా చ‌ర్చ‌లు పూర్త‌య్యాయ‌ని, మిగతా విష‌యాలు కూడా మాట్లాడుకుని సినిమాను త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తీసుకెళ్లే యోచ‌న‌లో ఉన్నార‌ని టాక్. మ‌నోజ్ కూడా రీసెంట్ గానే గుంటూరోడు అనే సినిమాతో బాక్సాఫీస్ వ‌ద్ద త‌న స‌త్తాను చూపించిన విష‌యం తెలిసిందే. ఇదంతా నిజమే అయితే, ఈ సినిమాతో మ‌నోజ్ స్థాయి మారిపోతుంద‌నే చెప్పాలి.