బాహుబ‌లి అస‌లు ఎలా హిట్ అయింది అని అడిగిన డైర‌క్ట‌ర్


బాహుబ‌లి.. తెలుగు సినిమా చ‌రిత్ర‌ను ప్ర‌పంచానికి చాటిచెప్పిన సినిమా. దాదాపు 700 కోట్ల క‌లెక్ష‌న్స్ ను రాబ‌ట్టుకున్న ఈ సినిమాపై ఒక డైర‌క్ట‌ర్ అసంతృప్తిగా ఉన్నాడు. అదేంటి ప్ర‌పంచం మొత్తం న‌చ్చి, మెచ్చిన సినిమాకు పేరు పెట్టిన డైర‌క్ట‌ర్ ఎవ‌రు అనుకుంటున్నారా, ఖైదీ నెం.150 తో చిరంజీవి ని మ‌ళ్లీ తెర‌కు ప‌రిచ‌యం చేసిన డైర‌క్ట‌ర్ వి.వి. వినాయ‌క్. మ‌రో కొన్ని రోజుల్లో విడుద‌ల కానున్న బాహుబ‌లిఃది కంక్లూజ‌న్ కోసం ప్ర‌స్తుతం యూనిట్ తెగ ప్ర‌చారం చేసేస్తుంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌భాస్ ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాడు.

బాహుబ‌లి విడుద‌ల త‌ర్వాత, అంద‌రూ సినిమా చాలా బావుంది, సూప‌ర్ హిట్, కంగ్రాట్స్ అంటూ ఫోన్ చేసి చెబుతుంటే, వినాయ‌క్ మాత్రం అస‌లు ఇన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇవ్వ‌కుండా సినిమా ఎలా సూప‌ర్ హిట్ అవుతుంది అని ప్ర‌శ్నించాడ‌ట‌. క‌ట్ట‌ప్ప బాహుబ‌లి ని ఎందుకు చంపాడు, దేవ‌సేనను అస‌లు ఎందుకు బంధిస్తారు, అవంతిక అక్క‌డ‌కు ఎందుకు వ‌స్తుంది ఇలా దాదాపు ప‌ది ప్ర‌శ్న‌లకు స‌మాధానాలు చెప్ప‌కుండానే సినిమాను క‌ట్ చేసిన మీకు ఇంత‌టి సూప‌ర్ హిట్ ఎలా ద‌క్కింది అని అడిగాడ‌ట వినాయ‌క్. ఇదంతా చూస్తుంటే ప్రేక్ష‌కుల‌కు కావాల్సింది స‌మాధానాలు కాదు, కొత్త‌ద‌నం అని అర్థ‌మ‌వుతూనే ఉంది క‌దూ. బాహుబ‌లిలో అలాంటి కొత్త‌ద‌నం చాలానే ఉందిలెండి.