Vishnu To Remake Assembly Rowdy


Manchu Vishnu proving himself taking inspiration from his father by acting in Action movies and comedy movies in both sides.Not only that he also sucessed as producer like his father.Now Vishnu is keen on remake of Assembly Rowdy with some changes to suit this generation. The story screenplay which B.Gopal handled, the powerful dialogues written by Paruchuri brothers, Mohan babu acting all these finally got a Block buster. Let's wait and see if Vishnu can handle this movie or not.
 
తండ్రి సినిమా రీమేక్ లో కొడుకు
తండ్రి ఆద‌ర్శంతో ఆయ‌న‌లాగే ఒక‌వైపు యాక్ష‌న్ ను, మ‌రోవైపు కామెడీని పండిస్తూ మంచు విష్ణు శ‌భాష్ అన్పించుకున్నాడు. అంతేకాదు ప్రొడ్యూస‌ర్ గానూ తండ్రిలాగే స‌క్సెస్ దిశ‌గా అడుగులు వేస్తున్నాడు. అలాంటి విష్ణు త‌న తండ్రి న‌టించిన అసెంబ్లీ రౌడీ సినిమాను ఈ జెన‌రేష‌న్ కు త‌గ్గ‌ట్లు కొన్ని మార్పులు చేసి, రీమేక్ చేయ‌డానికి రంగం చేస్తున్నాడు.
ఆ సినిమా క‌థ‌, క‌థ‌నాలను బి.గోపాల్ తెర‌కెక్కించిన తీరు, ప‌రుచూరి రాసిన ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్ మోహ‌న్ బాబు న‌ట‌న ఆ సినిమాకు అఖండ విజ‌యాన్ని సాధించ‌డంతో పాటు, ఈ సినిమా ద్వారా అందించిన సందేశం అంద‌రినీ ఆలోచింప‌చేసింది కూడా. ఇన్ని విష‌యాల్లో తండ్రికి త‌గ్గ కొడుకు అనిపించుకున్న విష్ణు ఈ విష‌యంలో తండ్రి కి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకుంటాడో లేదో చూడాలి.