Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

Vishal to Teamup with Tamannah


  1. మాస్‌ హీరో విశాల్‌, మిల్కీ బ్యూటీ తమన్నా, ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు ల సూపర్‌ కాంబినేషన్‌లో నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి సూపర్‌హిట్‌ చిత్రాల తర్వాత రాయుడుతో మరో సూపర్‌ డూపర్‌ హిట్‌ కొట్టిన మాస్‌ విశాల్‌ కొత్త చిత్రం జూన్‌ 9 నుంచి హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటుంది. 'రాయుడు' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని ఇచ్చిన జి.హరి హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై ఈ భారీ స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర విశేషాలను నిర్మాత జి.హరి తెలియజేస్తూ - ''భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో చేస్తున్న స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. నిర్మాతగా నాకు చాలా ప్రెస్టీజియస్‌ మూవీ అవుతుంది. విశాల్‌ కెరీర్‌లో ఇది చాలా హై రేంజ్‌ మూవీగా నిలుస్తుంది. షూటింగ్‌ స్టార్ట్‌ అవ్వకముందే ఈ సినిమాకి మంచి క్రేజ్‌ వచ్చింది. విశాల్‌తో నేను చేసిన 'రాయుడు' భారీ ఓపెనింగ్స్‌ సాధించడమే కాకుండా రిలీజ్‌ అన్ని సెంటర్స్‌లో సూపర్‌హిట్‌ టాక్‌తో దిగ్విజయంగా ప్రదర్శింపబడుతోంది. 'రాయుడు' సూపర్‌హిట్‌ అయిన ఈ ఆనంద సమయంలో విశాల్‌తో స్ట్రెయిట్‌ సినిమా ఎనౌన్స్‌ చెయ్యడం మరింత ఆనందంగా వుంది. ఈ సినిమా కోసం విశాల్‌ కూడా చాలా స్పెషల్‌ కేర్‌ తీసుకుంటున్నారు. విశాల్‌, తమన్నా జంట ఈ సినిమాకి స్పెషల్‌ హైలైట్‌ అవుతుంది. ఇందులో జగపతిబాబుగారు మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నారు. అలాగే తరుణ్‌ అరోరా మరో విలన్‌గా చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన పాటల రికార్డింగ్‌ పూర్తయింది. జూన్‌ 9 నుంచి నెలరోజులపాటు హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతుంది. మిగతా షెడ్యూల్స్‌ చెన్నై, ఫారిన్‌లలో చేస్తాం'' అన్నారు. మాస్‌ హీరో విశాల్‌, తమన్నా, జగపతిబాబు, నిరోషా, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, సూరి, తరుణ్‌ అరోరా తదితరులు ముఖ్యపాత్రలు పోషించే ఈ చిత్రానికి సంగీతం: హిప్‌ హాప్‌ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్స్‌, ఎడిటింగ్‌: సెల్వ, ఫైట్స్‌: దినేష్‌, అనల్‌ అరసు, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: ఆర్‌.జి.ప్రేమానందన్‌, సహనిర్మాతలు: ఎం.పురుషోత్తం, ఇ.కె.ప్రకాష్‌, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్‌.