ఇలాంటి విష‌యాల్లో టాలీవుడ్ వాళ్ల‌ని ఫాలో అవుతుందా


రైతుల క‌ష్టాల‌ను మ‌రో హీరో గుర్తించి, చ‌లించాడు. త‌మిళ హీరో విశాల్ ఇప్పుడు అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. త‌మిళ‌నాడులో ఎన్నో స‌మ‌స్య‌ల‌తో అల్లాడిపోతున్న రైతుల త‌ర‌పున ప్ర‌కాష్ రాజ్ మ‌రియు కొంత‌మంది న‌టుల‌తో క‌లిసి ఢిల్లీలో ధ‌ర్నా చేసిన విశాల్, మొన్నీమధ్య‌నే అరుణ్ జైట్లీని క‌లిసి, రైతుల‌ను ఆదుకోవాలని కూడా కోరారు.న‌డిగ‌ర్ సంఘ అధ్య‌క్షుడిగా ప‌లు సామాజిక కార్య‌క్ర‌మాల్లో చురుకుగా పాల్గొంటున్న విశాల్  ఇప్పుడు మ‌రో అడుగు ముందుకు వేశాడు. 

ఇక‌పై సినిమా ప్ర‌తీ టిక్కెట్ లో ఒక రూపాయి నిర్మాత‌ల వంతుగా రైతుల‌కు అందించ‌డానికి నిర్ణ‌యం తీసుకుంది నిర్మాత‌ల సంఘ నూత‌న కార్య‌వ‌ర్గం. త‌మిళ‌నాడులో తీవ్ర క‌ష్టాల‌ను ఎదుర్కొంటున్న రైతుల‌ను ఆదుకునేందుకే ఈ కార్యాన్ని త‌ల‌పించామ‌ని విశాల్ అన్నారు.తమిళనాడులో ప్రదర్శితమయ్యే అన్ని సినిమాలకు ఏదో ఒకరోజు ప్రతి టిక్కెట్‌పై ఒక రూపాయిని రైతు నిధికి కేటాయిస్తామన్నారు. తద్వారా ఎన్ని కోట్లు వచ్చినా వాటిని తమిళనాడు రైతుల కోసం ఉపయోగిస్తామన్నారు. విశాల్ టీం తీసుకున్న నిర్ణయంపై తమిళ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాల్ నిర్ణయం రైతుల్లో మనో ధైర్యాన్ని పెంచుతుందంటున్నారు.  

ఇదిలా ఉండ‌గా, అప్ప‌ట్లో జ‌ల్లిక‌ట్టు ఉద్య‌మాన్నిఇన్సిపిరేష‌న్ గా తీసుకుని, ఏపీ స్పెషల్ స్టేట‌స్ కోసం పోరాడదామంటూ మ‌న టాలీవుడ్ స్టార్స్ కూడా ఉద్య‌మం మొద‌లుపెట్టారు. అలాంటి కార్య‌క్ర‌మాలు కాకుండా, ఇలా నేరుగా రైతుల‌కు న్యాయం చేయ‌డం అనే కాన్సెప్ట్ ను కూడా మ‌న వాళ్లు ఫాలో అయితే బావుంటుంది.