Vikram Fights In Chennai


చెన్నైలో ఫైట్ చేయ‌నున్న విక్ర‌మ్
విక్ర‌మ్ హీరోగా న‌టిస్తున్న 'ఇరుముగ‌న్' షూటింగ్ వేగంగా జ‌రుపుకుంటుంది. రేపటి నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను చెన్నై శివారు ప్రాంత‌మైన 'షోలింగ‌న‌ల్లూరు' లోని ఐటీ సెట్ లో జ‌ర‌గ‌నుంది. భారీ యాక్ష‌న్ సీన్ గా తెర‌కెక్కించ‌నున్న ఈ ఫైట్ లో 200 మంది ఫైట‌ర్లు పాల్గొన‌నున్నారు. ఈ షెడ్యూల్ పూర్త‌యిన వెంట‌నే యూనిట్ అంతా క‌లిసి బ్యాంకాక్ వెళ్ల‌నుంది.
బ్యాంకాక్ లో హెలికాప్ట‌ర్ తో కూడిన భారీ ఛేజింగ్ సీన్స్ ను ప్లాన్ చేశార‌ట‌. ఋ ఫైట్ సీన్ ను భారీ ఖ‌ర్చుతో 20 రోజుల పాటు చిత్రీక‌రించ‌నున్నారు. విక్ర‌మ్ స‌ర‌స‌న న‌య‌న్, నిత్య మీన‌న్ న‌టిస్తున్న ఈ సినిమాను ఆగ‌స్టు లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు.