మ‌ళ్లీ మ‌ళ్లీ అదే చేస్తానంటున్న సీనియ‌ర్ హీరో


ఎప్ప‌టిక‌ప్పుడు విభిన్న‌మైన పాత్ర‌ల‌ను, సినిమాల‌ను ఎంచుకుని, త‌నకంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోల్లో సీనియ‌ర్ హీరో విక్ర‌మ్ ఒక‌రు. కోలీవుడ్ లో ఆయ‌న‌కున్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పన‌క్క‌ర్లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తీ సినిమాలోనూ డిఫ‌రెంట్ గా ట్రై చేసే విక్ర‌మ్ త‌న తదుప‌రి సినిమా విష‌యంలోనూ ఆ ప్ర‌య‌త్నాన్ని కొన‌సాగించ‌నున్నాడు. హాలీవుడ్ లో ఘ‌న విజ‌యాన్ని సాధించిన డోంట్ బ్రీత్ అనే చిత్రాన్ని త‌మిళంలో రీమేక్ చేయ‌నున్నారు. థ్రిల్ల‌ర్ గా సాగే ఈ సినిమా స్టోరీ న‌చ్చ‌డంతో, విక్ర‌మ్ ఈ రీమేక్ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. ఈ సినిమాకోసం విక్ర‌మ్ మ‌రో కొత్త గెట‌ప్ లో అవ‌తార‌మెత్త‌నున్నాడ‌ట‌. గ‌డ్డం పెంచి పూర్తిగా త‌న మేకోవ‌ర్ ను కూడా విక్ర‌మ్ మార్చుకోనున్నాడ‌ట‌. రీసెంట్ గా ఇంకొక్క‌డు తో మంచి టాక్ తెచ్చుకున్న విక్ర‌మ్, ఇలాంటి విభిన్న క‌థ‌ల‌కు ఓకే చెప్ప‌డాన్ని అభినందించాల్సిందే.