కె.ఎల్.ఎం ఫ్యాషన్ మాల్ బ్రాండ్ అంబాసడర్ గా విజయ్ దేవరకొండ


అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన నటుడిగా గుర్తింపు పొంది యువతకి బాగా దగ్గరైన విజయ్ దేవరకొండ ఇప్పుడు బ్రాండ్ అంబాసడర్ గా తన తొలి అసైన్ మెంట్ పై సంతకం చేసారు.

జంటనగరవాసులకి అంతర్జాతీయ స్థాయి ఫ్యాషన్స్ పరిచయం చేస్తూ ప్రారంభించబడుతున్న కె.ఎల్.ఎం ఫ్యాషన్ మాల్ కి బ్రాండ్ అంబాసడర్ గా విజయ్ దేవరకొండ బాధ్యతలు మొదలుపెట్టారు.

మాదాపూర్ ట్రైడెంట్ హోటల్ వేదికగా జరిగిన పాత్రికేయ సమావేశంలో కె.ఎల్.ఎం ఫ్యాషన్ మాల్ డైరక్టర్ కళ్యాణ్ అన్నం ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండను తమ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించారు.

ఈ సందర్భంగా సంస్థ డైరక్టర్ కళ్యాణ్ అన్నం మాట్లాడుతూ, "ఇప్పటికే కళామందిర్, వరమహాలక్ష్మి సిల్క్స్, మందిర్, ఆర్ బ్రాండ్లతో 26 బ్రాంచులతో, 3000 మంది ఉద్యోగులతో గత 12 ఏళ్లుగా నిర్విరామ కృషితో లక్షలాది మంది వినియోగదారులకి దగ్గరయ్యాం. ఇప్పుడు అతి తక్కువ ధరలతో అంతర్జాతీయ స్థాయి ఫ్యాషన్స్ ను హైదరాబాద్ వాసులకి అందించే ఆలోచనతో ఈ కె.ఎల్.ఎం ఫ్యాషన్ మాల్ ను స్థాపించాం. ప్రస్తుత తరం యువతకి ఐకాన్ గా నిలిచిన విజయ్ దేవరకొండగారిని మా కె.ఎల్.ఎం ఫ్యాషన్ మాల్ బ్రాండ్ అంబాసడర్ గా ప్రకటించడం ఎంతో గర్వంగా భావిస్తున్నాం" అన్నారు.

కె.ఎల్.ఎం ఫ్యాషన్ మాల్ లోగో ని, టీ.వీ యాడ్ ని విడుదల చేసిన విజయ్ దేవరకొండ మాట్లాదుతూ, "కె.ఎల్.ఎం ఫ్యాషన్ మాల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు కొత్త బాధ్యత. త్వరలోనే కె.ఎల్.ఎం ఫ్యాషన్ మాల్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫ్యాషన్ కి చిరునామాగా మారుతుందని ఆశిస్తున్నాను" అన్నారు.

ఈ కార్యక్రమంలో కె.ఎల్.ఎం ఫ్యాషన్ మాల్ మరో డైరక్టర్ చలవాది మోహన్ కూడా పాల్గొన్నారు.