అది చెప్ప‌డం నేర్చుకోండి గురూ..


 సినిమాతారలు తమ భావాలను చెప్పాలంటే.. ఇది వరకూ బోలెడంత హంగామా ఉండేది. కానీ ఇప్పుడు చిన్నపాటి వీడియో తీసి నెట్లో పెట్టేస్తే సరిపోతుంది. పైగా షార్ట్ ఫిలిమ్స్ లాంటివి వచ్చాక.. ఇది మరింత సులభం అయిపోయింది. చిల్డ్రన్స్ డే సందర్భంగా.. చిన్నారులకు తన మెసేజ్ ఇచ్చాడు వెంకీ. టీనేజ్ ఫౌండేషన్ అనే సంస్థ రూపొందించిన వీడియోలో పీర్ ప్రెజర్ పై మాట్లాడాడు వెంకీ. ఎప్పుడు నో చెప్పాలనే విషయం నేర్చుకుంటే జీవితం సాఫీగా ఉంటుందంటున్నాడు వెంకీ. 
 
' దురలవాట్లు ఎప్పూడూ సరదాగానే ఉంటాయి. ఒకసారి ప్రయత్నిస్తే తప్పేముంది అనిపించచ్చు.. అందరూ చేస్తున్నారు కదా..  ఫ్రెండ్స్ చెప్పినట్లు చేయకపోతే వాళ్లు నాకు దూరమవుతారు అనే ఒత్తిడి జయించాలి. ఇలా ఆలోచించి మొదలుపెడితే.. ఆ కారణంగా రాబోయే ఫలితాలను ఆలోచించలేరు. ఫ్రెండ్స్ ని నిరాశపరచడం ఇష్టం లేక మీ జీవితాలను ప్రమాదంలో పడేసుకోవడం కరెక్ట్ కాదు. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. ఒకసారి నో చెప్పండి.. అప్పుడు ఎదుటివారు మీ గురించి ఏమనుకున్నా పట్టించుకోవాల్సిన పని లేదు.  వాళ్లు మిమ్మల్ని వదిలేసినా ఏం పర్లేదు. మీకు మీ జీవితం ముఖ్యమని తెలుసుకోండి. నో చెప్పడం నేర్చుకోండి' అంటూ పెద్ద సందేశాన్నే ఇచ్చాడు వెంకీ.