Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

వైవిధ్యమైన 'వెంకటాపురం' సెకండ్ లుక్ విడుదల


గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణ  సారధ్యంలో ఐదో చిత్రంగా నిర్మిస్తున్న చిత్రం వెంకటా పురం. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఇదే ఊపుతో సెకండ్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. 
హైదరాబాద్ లోని శాన్ ఫ్రాన్సిస్కో కాలేజ్ లో సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు. వేణు ఈ చిత్రానికి దర్శకుడు. గతంలో నిఖిల్ నటించిన స్వామి రారా, నారా రోహిత్ నటించిన రౌడీ ఫెలో చిత్రాలకు వేణు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశాడు. 
 
ఈ చిత్రంలో హ్యాపీడేస్ లో టైసన్ క్యారెక్టర్ తో మంచి పేరు సంపాదించుకున్న రాహుల్ హీరోగా నటిస్తున్నారు. రాహుల్ డిఫరెంట్ లుక్ తో, ఆటిట్యూడ్ తో కనిపించబోతున్నారు. బాలీవుడ్ టీవీ ఆర్టిస్ట్ మహిమా మక్వాన్ హీరోయిన్ గా నటిస్తోంది. అచ్చు సంగీత దర్శకత్వం వహించాడు. సాయి ప్రకాష్ సినిమాటోగ్రాఫర్. కాశీ విశ్వనాథ్, అజయ్, జోగి బ్రదర్స్, అనితా, శశాంక్ ముఖ్య పాత్రలు పోషించారు. 
 
ఈ చిత్రాన్ని శ్రీయాస్ శ్రీనివాస రావ్, తుము ఫణి కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... వెంకటా పురం ఫస్ట్ లుక్ విడుదల చేసిన తర్వాత మంచి అప్లాజ్ వచ్చింది. ఇండస్ట్రీ పెద్దలు సైతం ప్రశంసించడం విశేషం. ఇప్పుడు రిలీజ్ చేసిన సెకండ్ లుక్ కూడా అదే స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంటుంది. రాహుల్ విభిన్నంగా కనిపించబోతున్నాడు. దర్శకుడు వేణు డిఫరెంట్ కథను, తనదైన స్క్రీన్ ప్లేతో ఎంటర్ టైనింగ్ గా చెప్పబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి ఫిబ్రవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. 
 
నటీనటులు - రాహుల్, మహిమా మఖ్వానా, అజయ్, జోగి బ్రదర్స్, కాశి విశ్వనాథ్, శశాంక్
 
సాంకేతిక నిపుణులు
ఆర్ట్ - జె. మోహన్
కెమెరామెన్ - సాయి ప్రకాష్
మ్యూజిక్ - అచ్చు
స్క్రీన్ ప్లే, డైలాగ్స్  - వేణు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - తాళ్లూరి ఆనంద్
ప్రొడ్యూసర్ - ఎంవివి సత్యనారాయణ
లైన్ ప్రొడ్యూసర్ - కె.అరున్ మోహన్
ప్రొడక్షన్ కంట్రోలర్ - వాసిరెడ్డి సాయిబాబు
డ్యాన్స్ మాస్టర్స్ - అనీష్ విగ్నేష్, అనితా నాథ్
పి.ఆర్.ఓ - ఎస్.కె.ఎన్. ఏలూరు శ్రీను
లిరిసిస్ట్ - అనంత శ్రీరాం, వనమాలి, అజయ్ కుమార్
ఎడిటింగ్ - మధు
స్టోరీ, డైరెక్షన్ - వేణు మడికంటి