బాహబలితో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న వెంకటాపురం.


ఈరోజుల్లో లాంటి ట్రెండ్ సెట్టింగ్ సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాన్ని అందిచిన గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్ & తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం. హ్యాపీడేస్ ఫేం యంగ్ హీరో రాహుల్, మహిమా మక్వాన్ జంటగా నటించారు. స్వామిరారా, రౌడీఫెలో చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన వేణు దర్శకత్వం వహించాడు. సోష‌ల్ మీడియాలో ఈ సినిమా యొక్క ట్రైలర్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రాన్ని బాహుబలికి పోటీగా ఏప్రిల్ 29న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌బోతున్నారు.

నిర్మాత‌ల్లో ఓక‌రైన శ్రేయాస్ శ్రీను మాట్లాడుతూ..  ట్రైలర్‌కు సోషల్‌ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. పది లక్షలకు పైగా వ్యూస్‌ మార్క్ దాటింది. త‌రువాత స్టార్ డైర‌క్ట‌ర్ వి.వి.వినాయ‌క్ చేతుల మీదుగా విడుద‌ల చేసిన సాంగ్ కి కూడా సూప‌ర్ బ‌జ్ వ‌చ్చింది. క‌థ విష‌యానికోస్తే ఓ యువతి హత్య నేపథ్యంలో ఊహకందని మలుపులతో ఆధ్యంతం ఆసక్తి కరంగా ఆకట్టుకుంది. సరికొత్త కథాంశంలో సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది. హీరో రాహుల్ లుక్ కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారు. హీరోయిన్ మ‌హిమా మ‌క్వాన్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. తెలుగు ప్రేక్ష‌కుల‌కి ఒ కొత్త అనుభూతిని మాత్రం ఈ చిత్రం క‌ల్పిస్తుంది. 

ఈ సినిమాలో అజయ్, జోగిబ్రదర్స్, శశాంక్ ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు, కెమెరా: సాయిప్రకాష్ ఆర్ట్: జె.మోహన్, కెమెరామేన్: సాయి ప్రకాష్, మ్యూజిక్: అచ్చు,ప్రొడక్షన్ కంట్రోలర్: వాసిరెడ్డిసాయిబాబు, డ్యాన్స్ మాస్టర్: అనీష్ విజ్ఞేష్, అనిత నాథ్.