ఆ ముగ్గురిలో ఎవరితో అయిన మల్టీ స్టారర్ సినిమా చేస్తా


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చిత్రం మిస్టర్ ఈ నెల 14న విడుదలకి రెడీగా ఉంది. మిస్టర్ తరువాత శేఖర్ కమ్ములతో వరుణ్ చేస్తున్న " ఫిదా" చిత్రం కూడా దాదాపు షూటింగ్ పూర్తి కానుంది. వరుణ్ ఫిదా మూవీ షూటింగ్ పూర్తవక ముందే నూతన దర్శకుడు వెంకీ అట్లూరితో మరో సినిమా చేయటానికి ఒప్పుకున్నాడు. 

తాజాగా వరుణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చరణ్, బన్నీ మరియు సాయి ధరమ్ తేజ్ లలో ఎవరితో అయిన మల్టీ స్టారర్ సినిమా చేయటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కథ ఓకే అయితే, తన మామ అల్లు అరవింద్ వరుణ్ చేయబోయే మల్టీ స్టారర్ సినిమాకి ప్రొడ్యూసర్ గా ఉండే అవకాశం ఉంది.