Latest News

హిందీ భాషపై పట్టుకోసం తంటాలు... బాలీవుడ్ ని టార్గెట్ చేస్తున్న ప్రభాస్ శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట' లో నటించడం చాలా ఆనందాన్నిచ్చింది - హీరోయిన్ దీప్తి శెట్టి సినీ కార్మికుడికి సి.ఎమ్. రిలీఫ్ ఫండ్ క్రింద‌ 2ల‌క్ష‌ల‌ రూపాయ‌లు అఖిల్ సినిమా యాక్ష‌న్ పార్ట్ పూర్త‌య్యింది...మంచి తెలుగు టైటిలే పెడ‌తాం : నాగార్జున‌ పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనని ఫిక్స్ అయ్యారట! సీనియర్ నటుడు చలపతిరావు మాటలను ఖండిస్తున్న సినీ ప్రముఖులు కేశవ సినిమాపై తెలంగాణ సీఎం కేసీఆర్, ఎంపీ కవిత ప్రశంసలు అట్టహాసంగా జరిగిన వంశీ ‘ఫ్యాషన్ డిజైనర్ S/o లేడీస్ టైలర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిరాశలో మహేష్ బాబు ఫాన్స్ ఈ 'అంధ'గాడిని ప్రేక్షకులు చూడగలరా...!

Vamshi Paidipally Leave Him?


ప్రస్తుతం తన రెండో సినిమా మొదలెట్టే పనిలో బిజీగా ఉన్నాడు యంగ్ హీరో అఖిల్.. ఎప్పుడైతే తన తొలి సినిమా భారీ అంచ‌నాల‌తో వచ్చి డిజాస్ట‌ర్ అయ్యిందో.. అప్పుడే క్రిటిసిజం మొదలైంది. ఆ సినిమా యావరేజ్ అయినా, ఇప్పుడు ఆ హీరో కి ఉండే హైప్ వేరేలా ఉండేది. కాకపోతే మొద‌టి ఫ్లాప్ అవ్వడం వలన ఇప్పుడు చాలా సతమతమవుతున్నాడు.. ఇంకా డెసిషన్ తీసుకోలేకపోతున్నాడు అంటూ విశ్లేష‌ణ‌లు బాగానే వచ్చాయి. అక్కినేని అఖిల్‌ గురించి రోజుకో వార్త బయటకు వస్తోంది. అఖిల్.. తన సెకండ్ మూవీ కోసం జూన్ నుంచి సెట్స్‌పైకి వెళ్తాడంటూ వారం రోజుల కిందట వార్త‌లొచ్చాయి. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో రానున్న ఈ మూవీకి అంతా సిద్ధం అయిపోయింద‌ని, ముహూర్తం తర్వాత సెట్స్‌పైకి వెళ్లడమే ఆలస్యమంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు వంశీ పైడిపల్లి చెబుతున్న రొమాంటిక్ స్టోరీలేవీ అఖిల్‌కు సెట్ కావడంలేదని, యువ హీరో మాత్రం మాస్, యాక్షన్ ఫిల్మ్ చేయాల్సిందేనని అంటున్నాడట. దీంతో ఈ ప్రాజెక్టు నుండి దర్శకుడు వంశీ తప్పుకున్నట్లు ప్రచారం మొదలైపోయింది.