Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

Girl asked Mahesh Babu, Will You Marry Me?


నీకెలాంటి భ‌ర్త కావాలి అని ఏ అమ్మాయిని అడిగినా చెప్పే మాట నాకు మ‌హేష్ బాబు లాంటి వాడు కావాల‌ని. పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు కేవ‌లం ఈ మాట‌తో స‌రిపెట్టుకుంటుంటే... ఒక చిన్నారి మాత్రం ఏకంగా మ‌హేష్ బాబుని డైర‌క్ట్ గా న‌న్ను పెళ్లిచేసుకుంటావా అని అడిగేసింది. ప్రిన్స్ మ‌హేష్ న‌టిస్తున్న బ్ర‌హ్మోత్స‌వం చిత్రానికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన  ఫస్ట్‌లుక్ పోస్టర్స్ మొదలుకొని రోజుకో పోస్టర్‌తో అభిమానులకు మరింత చేరువవుతుంది ఈ సినిమా. ఇక తాజాగా విడుదలైన బ్రహ్మోత్సవం సాంగ్ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. ఈ సాంగ్ టీజర్‌లో మహేష్ అదిరిపోయే లుక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. బ్రహ్మోత్సవం సినిమా పేరుకు తగ్గట్టుగానే ఈ టీజర్ కలర్‍ఫుల్‌గా సాగిపోయింది.  మధురం మధురం.. అనే పాట టీజర్‌‌ను చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా రిలీజ్ చేసింది. ఈ టీజర్‌లో మహేష్‌బాబును చూసిన ఓ చిన్నారి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మహేష్‌ అలా నడిచి వస్తుంటే దగ్గరే ఉన్న అమ్మాయిలు సైతం ఆయన్నే చూస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ‘మధురం మధురం’ అంటూ వచ్చే బ్యాక్‌గ్రౌండ్‌కి మిక్కీ జే మేయర్ ఇచ్చిన ట్యూన్ సింప్లీ సూపర్. మహేష్ ఎప్పటిలాగానే చాలా హ్యాండ్సమ్‌గా కనిపించాడు. తన చార్మింగ్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను కట్టిపడేశాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా విడుదలైన ఈ టీజర్ మరిన్ని అంచనాలు పెంచుతుంది.మే 7న ఈ చిత్రం ఆడియోను విడుదల చేసి,   మే  20న మంచి ఎండల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న మ‌హేష్.. అభిమానుల‌కు నీడనిస్తాడో లేదో చూడాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. Watch Brahmotsavam Song Teaser https://www.youtube.com/watch?v=hakOAO-_Prs